హైదరాబాద్

గాంధీ మార్గంలో లక్ష్యసాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకును సాధించుకునేందుకు జిహెచ్‌ఎంసి గాంధీగిరిని అనుసరించనుంది. కొంతకాలం క్రితం వరకు నాలాల్లో, రోడ్లపై ఎక్కడబడితే అక్కడ చెత్త వేసేవారి నుంచి జరిమానాలను వసూలు చేసేందుకు సిద్దమైన జిహెచ్‌ఎంసి ఇదివరకు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దక్కిన 19వ స్థానం కన్నా ఈ సారి మెరుగైన ర్యాంకును దక్కించుకునేందుకు వినూత్న మార్గాలను అనుసరించనుంది. నాలాల్లో చెత్త వేసే వారిని గుర్తించి వారికి పూలమాల వేసి ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. స్వచ్ఛ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు నగరంలో పంపిణీ చేసిన 44లక్షల డస్ట్‌బిన్లు ఏ మాత్రం ఫలితమివ్వకపోయే సరికి ఈ దిశగా మెరుగైన కృషి చేసేందుకు కార్పొరేట్ సంస్థలు ఐటిసి, గోద్రెజ్‌లతో ఒప్పందాలు చేసుకుంది. ఐటిసి సంస్థతో కలిసి వెల్ బీయింగ్ ఔట్ ఆఫ్ వేస్ట్(డబ్ల్యువోడబ్ల్యు)తో జిహెచ్‌ఎంసి ‘వావ్ హైదరాబాద్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీనికి తోడు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సంబంధించి నగరాన్ని మరింత స్వచ్ఛ సిటీగా తీర్చిదిద్దేందుకు జిహెచ్‌ఎంసి చేపట్టనున్న కార్యక్రమాలు సామాన్యుడి వరకు సైతం వెళ్లేందుకు శుక్రవారం ఎల్బీ స్టేడియంలో భారీ సభను నిర్వహించనుంది. అంతేగాక, ఐటిసి సంస్థతో కలిసి వెల్ బీయింగ్ ఔట్ ఆఫ్ వేస్ట్(డబ్ల్యువోడబ్ల్యు) అనే ప్రక్రియతో జంటనగరాల్లోని ప్రజల జీవన శైలికి అనుకూలమైన కాలుష్య రహితమైన పర్యావరణ పరిస్థితులను కల్పించేందుకు గాను ఈ చెత్తను ఎప్పటికపుడు వేర్వేరుగా సేకరించనున్నారు. దీంతో పాటు ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లోనున్న 500 టాయిలెట్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు జిహెచ్‌ఎంసి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే నగరంలోనున్న సుమారు 3600 పెట్రోలు బంకుల్లో వాహనదారులకు వౌలిక సదుపాయాలు కల్పించాలన్న నిబంధనతో ఆయా బంకుల్లో టాయిలెట్లు అందుబాటులో ఉన్నా, వాటిని కేవలం బంకు సిబ్బంది, అందుల్లో పెట్రోలు, డీజిల్ పోయించుకునే వారు మాత్రమే వినియోగించాలన్న అపోహ ఉందని, దీన్ని తొలగించేందుకు కూడా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 300 పెట్రోలు బంకుల యజమానులతో జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి ప్రత్యేకంగా చర్చలు జరిపి, పెట్రోలు బంకుల్లోని టాయిలెట్లు అందరూ వినియోగించుకునేందుకు వీలుగా వారిని ఒప్పించగలిగారు. మిగిలిన పెట్రోలు బంకుల యజమానులను కూడా త్వరలోనే అంగీకరింపజేస్తామని కమిషనర్ తెలిపారు.

చేయి చేయి కలిపితే
‘స్వచ్ఛ’ర్యాంకు మనదే

స్వచ్ఛ సర్వేక్షణ్-2017పై నేడు ప్రత్యేక సమావేశం
ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
హాజరుకానున్న సినీ ప్రముఖులు

హైదరాబాద్, డిసెంబర్ 22: స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిర్వహించే వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకును సాధించేందుకు జిహెచ్‌ఎంసి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా స్వచ్ఛ సర్వేక్షణ్ పై ప్రజల్లో అవగాహన పెంపొదించేందుకు నేడు ఎల్బీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. ఇందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హజరుకానున్నారు. అలాగే మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, స్వచ్ఛ బ్రాండ్ అంబాసిడర్ ఎంపి కవిత, అర్జున అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, వివిధ రంగాల ప్రముఖులు,కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు హజరుకానున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, వార్డు కమిటీ సభ్యులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొనున్నట్లు తెలిపారు. భారీ ఎత్తున నిర్వహించనున్న ఈ సమావేశానికి గడిచిన మూడురోజులుగా అధికారులు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ జనవరి మొదటి వారంలో స్వచ్ఛ భారత్‌లో భాగంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రారంభమవుతుందని, అసలు స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే ఏమిటీ? అందులో ముఖ్యమైన అంశాలేమిటీ? అన్న అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదివరకు నిర్వహించిన స్వచ్ఛసర్వేక్షణ్ 2016 కార్యక్రమం దేశంలోని 75 పట్టణాలపై జరగ్గా, అందులో జిహెచ్‌ఎంసి 19వ స్థానాన్ని కైవసం చేసుకుందని, ప్రస్తుతం వచ్చే నెల నుంచి జరగనున్న సర్వేక్షణ్‌లో దేశవ్యాప్తంగా 500 నగరాల్లో వివిధ స్వచ్ఛ కార్యక్రమాలపై సర్వే మొదలవుతుందని కమిషనర్ వెల్లడించారు. దేశంలోనే హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి సారిగా కార్పొరేట్ సొషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇంటింటి నుంచి చెత్తను వేర్వేరుగా చేయడానికి ఐటిసి, గోద్రెజ్ సంస్థలు ముందుకు వచ్చాయని, ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు శుక్రవారం నాటి సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నారు.
మాకు స్వీయ ప్రేరణ ఇస్తుంది:కమిషనర్
శుక్రవారం ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రత్యేక సమావేశం మెరుగైన ర్యాంకు సాధించుకునేందుకు తమకో స్వీయ ప్రేరణగా ఉపయోగపడుతుందని కమిషనర్ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్వచ్ఛ హైదరాబాద్ తర్వాత సిఎం ప్రత్యేక ఆదేశాల మేరకు నగరంలో దాదాపు 44లక్షల డస్ట్‌బిన్లను అందజేసినా తడి, పొడి చెత్త అనుకున్నంత స్థాయిలో వేర్వేరుగా రాయటం లేదన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ సమావేశాన్ని నిర్వహించటమే గాక, తడి,పొడి చెత్తను వేర్వేరుగా చేయటం, ఆ రెండు రకాల చెత్తను ఏ రకంగా మళ్లీ రీ సైక్లింగ్‌తో ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవచ్చుననే అంశంపై ఐటిసి సంస్థకు చెందిన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఇంటింటికి అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.