హైదరాబాద్

‘స్వచ్ఛ సర్వేక్షణ్’కు జిహెచ్‌ఎంసి నూతన నినాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: స్వచ్ఛ్భారత్ మిషన్ జాతీయ స్థాయిలో నిర్వహించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేపై జిహెచ్‌ఎంసి పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే స్వీపర్ మొదలుకుని కార్పొరేట్ సంస్థల వరకు ప్రతి ఒక్కర్నీ ఇందులో భాగస్వాములను చేసేందుకు సిద్దమైంది. ఇందుకోసం ఇటీవలే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి స్వయంగా రూపొందించిన ‘కుటుంబంగా కలిసి ఉందా..చెత్తను విడదీద్దాం..! అన్న నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్దమైంది. అయితే కుటుంబానికి చెత్తకు ఏం సంబంధం.. రెండింటిని పోల్చి చూడటంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ నూతన నినాదంలో విస్త్రృతస్థాయి సందేశం దాగి ఉందని, ప్రస్తుత సమాజంలో ఇది ప్రతి వారిలో ప్రత్యేక చర్చనీయాంశంగా మారుతోందని కమిషనర్ జనార్దన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గ్లోబలైజేషన్ సమాజంలో విభిన్న రంగాలతో పాటు కుటుంబ వ్యవస్థలోనూ తీవ్రమార్పులకు కారణమైన సంగతి తెలిసిందే! నేటికీ కొందరు విదేశాల్లోని బహుళ జాతి కంపెనీల్లో కార్పొరేట్ విధుల్లో నిమగ్నమై స్వదేశంలో ఉన్న కన్నవారిని కూడా పట్టించుకోని వారికి కుటుంబంలా కలిసుందాం అన్న నినాదం కాస్త కనువిప్పు కల్గిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలను ఇందులోని కుటుంబ సభ్యులు ఇంటి ఆవరణలోనే ప్రత్యేక గుంతలను ఏర్పాటు చేసిన సేంద్రీయ ఎరువులను తయారు చేసి, పంట పొలాలకు, ఇంట్లోని పెరటితోటలకు వినియోగించుకోవచ్చుని అధికారులు సూచించారు. ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా పెరగటంతో అధిక శాతం ఇళ్లు ఈరకమైన విధానానికి స్వస్తిపలికాయి. దీంతో ప్లాస్టిక్ అటు భూమిలో కలవకుండా పర్యావరణానికి పెనుముప్పుగా మారింది. ఇదే పరిస్థితిని నేటి కుటుంబ వ్యవస్థ కూడ ఎదుర్కొంటుంది. ప్రస్తుత సాంకేతిక యుగంలో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావటం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దూరమైన, ఒంటరి జీవితాలు అధికమైన నేటి తరుణంలో చెత్తను తడి,పొడి చెత్తగా వేరు చేసేందుకు ఇచ్చే నినాదం కొంతవరకైనా కదిలించకపోతుందా? అని జిహెచ్‌ఎంసి అధికారులు భావిస్తున్నారు.
కలిసుంటేనే కలదు సుఃఖం
కాలక్రమేనా ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ కుటుంబ వ్యవస్థ రోజురోజుకి దెబ్బతింటోంది. బెల్జియంలో అత్యధికంగా 71.2 శాతం, పోర్చుగల్‌లో 68శాతం, అంగరిలో 67, స్పెయిన్‌లో 61, ఫ్రాన్స్‌లో 56శాతం, అమెరికాలో 53శాతం, బ్రిటన్‌లో 47, ఆస్ట్రేలియాలో 43 శాతం కుటుంబాలు పలు కారణాలతో విడిపోతున్నట్లు తాజాగా అధ్యయనాలు చెబుతున్నాయి. మన దేశంలోనూ ఉమ్మడి కుటుంబాలు విడిపోతున్న సందర్భాలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కలిసుంటేనే కలదు సుఃఖం అన్న సామెత జిహెచ్‌ఎంసి చెత్తను వేరు చేసేందు ఇచ్చిద నినాదం నిజం చేయనుంది. విడిపోయిన కుటుంబ సభ్యులకు పలు సమస్యలు ఎదురైనపుడు ఎదుర్కొనే మానసిక పరిస్థితులు. సహాయానికి ఎవరూ లేకపోవటం వంటి పరిణామాలేర్పడుతాయి. ఈ పరిస్థితులను పారిశుద్ద్య కార్మికులకు అనువదిస్తూ కుటుంబ సభఉయలుగా కలిసి ఉందా..చెత్తను తడి,పొడి చెత్తగా విడదీద్దాం.. అనే నినాదం జిహెచ్‌ఎంసి చేపట్టింది.