హైదరాబాద్

ఏసిబికి చిక్కిన జిహెచ్‌ఎంసి ఏఇ అశోక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 28: ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ జిహెచ్‌ఎంసి ఏఇ అశోక్ ఏసిబి అధికారులకు చిక్కారు. జిహెచ్ ఎంసి సర్కిల్ -10 పరిధిలో ఏఇగా విధులు నిర్వహిస్తున్న అశోక్ కాంట్రాక్టర్ శివ కుమార్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలోని బృందం ఈ దాడులు నిర్వహించింది. డిఎస్‌పి తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 10లోని ఎమ్మెల్యే కాలనీలోని ఓ ఇంటి పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ సివరేజ్ పైప్‌లైన్ పనుల నిమిత్తం అనుమతులు కావాలని వెళ్లాడు. నిబంధనల ప్రకారం రోడ్డు కట్టింగ్ కోసం రూ. 48 వేలు చెల్లించాల్సి ఉంటుందని, తాము చెప్పినట్టు చేస్తే తక్కువలో మీపని ముగించుకోవచ్చునని చెప్పారు. అందుకు గాను జిహెచ్‌ఎంసికి డిడి రూపంలో రూ. 23 వేలు చెల్లించి, తనకు రూ.15 వేలు ఇచ్చి పనులు చేసుకోవాలని సూచించాడు. దీనిపై బేరసారాలకు శివకుమార్ ప్రయత్నించగా ఒక్కపైసా తగ్గినా పనులు ఎలాచేస్తావో చూస్తానంటూ హెచ్చరించాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోదక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఫిర్యాదును స్వీకరించిన ఏసిబి డిఎస్పి అశోక్ కుమార్ బుధవారం బంజారాహిల్స్ వార్డు కార్యాలయంలో శివకుమార్ నుంచి డబ్బులు తీసుకున్న వెంటనే పట్టుకొన్నారు. అనంతరం వివరాలు సేకరించడంతో పాటు ఏఇ అశోక్ ఇంటిపై కూడా దాడులు నిర్వహించారు. అశోక్ ఉద్యోగంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. దీంతో పాటు వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు సైతం బిల్లు చేయడానికి సైతం భారీగా డబ్బులు డిమాండ్ చేసేవారని తెలిసింది. ప్రజల కోసం విధులు నిర్వర్తించాల్సిన ప్రభుత్వ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తే నిర్భయంగా తమకు ఫిర్యాదు చేయవచ్చునని డిఎస్పీ కోరారు.