హైదరాబాద్

వ్యవస్థీకృత నేరాలపై దృష్టి ... నగరంలో నేరాలు తగ్గాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: హైదరాబాద్ నగరంలో నేరాలు గణనీయంగా తగ్గాయని, వ్యవస్థీకృత నేరాలపై దృష్టి సారించాలని నగర కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. సమిష్టి కృషితోనే నగరంలో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. బుధవారం నేరాలపై వార్షిక రిపోర్టును వెల్లడించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నేరాల అదుపు, నేరస్థులను పట్టుకోవడం, నేరస్తులకు శిక్షలు పడేవిధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తున్నారన్నారు. పోలీస్ వ్యవస్థకు దేశంలోనే మంచి పేరుందని, తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకు అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే సేఫ్టీసిటీగా తీర్చిదిద్దేందుకు అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు.
హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు ఢోకాలేదని, 15వేల మంది పోలీసులు నగరంలో జరిగే ప్రతి వేడుకలను ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహిస్తున్నారన్నారని కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు.
గత రెండేళ్లుగా జరిగిన నేరాలను పోలిస్తే..ప్రస్తుతం హైదరాబాద్‌లో నేరాలు బాగా తగ్గాయన్నారు.
రాష్ట్రంలో తీవ్రవాదం, ఉగ్రవాదం వంటి కదలికలేమీ లేవన్నారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే శక్తులను అడ్డుకుంటున్నామని, కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నామని కూడా తెలిపారు. హైదరాబాద్‌లో ఐసిస్ వైపు ఆకర్షించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ క్రైం, షీ టీమ్, ట్రాఫిక్, సిసిఎస్, డిడి విభాగం, భరోస, ఆపరేషన్ స్మైల్, పునర్జన్మ వంటి విభాగాల్లో పోలీస్ సిబ్బంది ఫ్రెండ్లీ పోలిసింగ్‌తో అన్ని వర్గాల ప్రజల్లో మమేకలై పనిచేస్తున్నారన్నారు.
ఆధునిక టెక్నాలజీ వినియోగించి నేరాలను అదుపుచేస్తూ, నేరస్థులను పట్టుకుంటున్నామని తెలిపారు. సిసికెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నేరం జరిగిన కొన్ని గంటలలోపే నేరస్తులను పట్టుకోవడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ పోలీసులు అనేక యాప్‌లను ప్రవేశపెట్టిందని, ప్రమాదాలు, వేధింపులు, చోరీలు జరిగిన వెంటనే యాప్‌ల ద్వారా అందరికీ మెస్సేజ్‌లు వెళ్లిపోతున్నాయని, దీంతో వెంటనే పోలీస్ బృందాలు రంగంలోకి దిగి నేరస్తులను పట్టుకోవడంలో సఫలీకృతమవుతున్నారని ఆయన పోలీస్ సిబ్బందిని ప్రశంసించారు. పెద్ద నోట్లు రద్దు తర్వాత నోట్ల మార్పిడి కేసులో పోలీసులపై కూడా కేసుల పెట్టామని, వివిధ నేరాలతో ప్రమేయం ఉన్న దాదాపు 25 మంది పోలీసు సిబ్బందిని అరెస్టు చేసి కేసు పెట్టామని తెలిపారు. ఇప్పటి వరకు రూ. 1,16,73వేలు కొత్త, పాత నోట్లను స్వాధీనం చేసుకుని, నోట్ల మార్పిడిపై 51 మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించి, 36 మందిని అరెస్టు చేశామని కమిషనర్ మహేందర్‌రెడ్డి వివరించారు.