హైదరాబాద్

హమ్మయ్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: పాతబస్తీలో జరిగిన ఘర్షణలు మినహా చెదురుమదురు సంఘటనలు మనిహా గ్రేటర్‌లో మంగళవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడు గంటల నుంచి ప్రశాంతంగానే కొనసాగిన పోలింగ్, మధ్యాహ్నం తర్వాత పలు చోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. రంగారెడ్డి జిల్లాలోని రోషన్ దవ్లా ప్రాంతంలో స్థానికులు ఓటు వేసేందుకు నిరాకరిస్తూ పోలింగ్ కేంద్రం ముందు నిరసన వ్యక్తం చేశారు. స్థానికంగా తమ సమస్యలను ఎవరూ పరిష్కరించటం లేదని ఓటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటిస్తూ బైఠాయించారు. కలెక్టర్ జోక్యం చేసుకుని ఆర్డీవోను విచారాణాధికారిగా నియమించగా, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో నిరసన ముగించి, ఓటింగ్‌లో పాల్గొన్నారు. అంతకుముందు పలు చోట్ల పేర్లు గల్లంతుకావటం వంటి సంఘటనలతో ఓటర్లు నిరసనలకు దిగారు. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో పాతబస్తీ పురానాపూల్ డివిజన్‌లో మజ్లిస్ అభ్యర్థి సున్నం రాజ్‌మోహన్, కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ వర్గీయుల మధ్య చెలరేగిన స్వల్ప ఘర్షణ తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీలపై దాడికి దారి తీయగా, చార్మినార్ ఎమ్మెల్యే పాషాఖాద్రి సైతం అరెస్టయ్యారు. అలాగే ఆజంపురాలో టిఆర్‌ఎస్, మజ్లిస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ తర్వాత ఇంకా కాసేపట్లో పోలింగ్ ముగిస్తుందనుకునే సమయంలో లంగర్‌హౌస్‌లో మజ్లిస్ రిగ్గింగ్‌కు యత్నించటంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అడ్టుకోవటంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు తీవ్ర గాయాలు పాలయ్యారు. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌లో భాగంగా ఉదయం పావుగంట మాక్ పోలింగ్ నిర్వహించినానంతరం ఏడు గంటల నుంచి అధికారికంగా పోలింగ్ ప్రారంభమైంది. ప్రారంభంలోనే 9 వివిధ డివిజన్లలోని తొమ్మిది పోలింగ్ బూత్‌లలో ఇవిఎంలు మొరాయించటంతో ఇసిఐఎల్ ఇంజనీర్లు అక్కడకు చేరుకుని వాటిని మార్చారు. 3వేల ప్రాంతాల్లో చేపట్టిన వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రారంభమైన మొదటి అరగంటలోనే ఆసిఫ్‌నగర్, శాలిబండ, రాజేంద్రనగర్, శాస్ర్తీపురం, లంగర్‌హౌజ్‌లలోని పలు బూత్‌లలో ఎక్కువ మంది ఓటర్లుండటం, స్వల్ప సంఘటనలు జరుగుతున్న విషయాన్ని గుర్తించి, ఆయా ప్రాంతాలకు జిహెచ్‌ఎంసి సీనియర్ అధికారులను పంపి పరిస్థితులను చక్కదిద్దారు. ఉదయం ఏడు నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు సజావుగానే సాగింది. ఆ తర్వాత జాంబాగ్, పురానాపూల్‌లలో కాంగ్రెస్, మజ్లిస్, ఆజంపురాలో టిఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణలు చోటుచేసుకోవటం, డిప్యూటీ సిఎం మహమూద్ అలీ కుమారుడిపై ఎమ్మెల్యే బలాలా చేయి చేసుకోవటం, భారతినగర్‌లో డబ్బులు పంచుతున్న టిఆర్‌ఎస్ అభ్యర్థిపై ఫిర్యాదు చేసినా, పట్టించుకోవటం లేదని బిజెపి ఆందోళన చేయటం, అలాగే కూకట్‌పల్లి వివేకానందనగర్ డివిజన్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఏకంగా 60 మంది ఓటర్ల పేర్లు గల్లంతు కావటంతో ఓటర్లు పోలింగ్ బూత్ ముందే ఆందోళనకు దిగడం వంటి ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఎల్బీనగర్ చింతల్‌కుంటలో టిఆర్‌ఎస్ నేత డబ్బు పంపిణీ చేస్తుండగా, పోలీసులు పట్టుకుని, నలుగుర్ని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చివరి నిమిషంలో ఓటింగ్ శాతం భారీగా తగ్గి ఉండటంతో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ పుకార్లు రావటంతో పలు చోట్ల టిడిపి, టిఆర్‌ఎస్‌ల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఎన్టీఆర్ నగర్‌లో సోమవారం జరిగిన సంఘటనకు ప్రతీకారంగా నేతలు హల్‌చల్ చేశారు. నాలుగు గంటల వరకు 42.56 శాతం పోలింగ్ నమోదు కాగా, అన్ని పోలింగ్ స్టేషన్లలో అయిదు గంటల్లోపు క్యూలో నిల్చున్న ఓటర్లను ఓటింగ్ కోసం లోనికి అనుమతించారు.