హైదరాబాద్

ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: స్వచ్ఛ్భారత్ సాధనలో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500పై చిలుకు నగరాల్లో కొనసాగతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో మెరుగైన ర్యాంక్‌ను సాధించేందుకు జిహెచ్‌ఎంసి ఇప్పటికే విశ్వప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగానే మహానగరంలో కూడా బహిరంగ మల,మూత్ర విసర్జనను నివారించటంలో భాగంగా ప్రీ ఫ్యాబ్రికెటెట్ టాయిలెట్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రస్తుతం నగరంలోని ఫుట్‌పాత్‌లు, బస్టాపులకు పక్కన, రోడ్లకిరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో శాశ్వత ప్రాతిపదికన టాయిలెట్లు నిర్మించి ఉన్నా, అవి సులాభ్ ఆధీనంలో ఉన్నాయి. అంతేగాక, వీటిని వినియోగించుకునేందుకు వచ్చే పౌరుల నుంచి ఛార్జీలు వసూలు చేయటం కూడా బహిరంగ మలమూత్ర విసర్జన పెరిగేందుకు ఓ ప్రధాన కారణంగా గుర్తించిన బల్దియా ప్రీ ఫ్యాబ్రికెటెడ్ టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చి, వాటిని నగర పౌరులు ఉచితంగా ఉపయోగించుకునేలా చేస్తే కొంతమేరకైనా బహిరంగ మల,మూత్ర విసర్జన తగ్గుతోందని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని ప్రీ ఫ్యాబ్రికెటెడ్ టాయిలెట్లను తయారు చేయించిన బల్దియా తొలి దశగా ఈస్ట్‌జోన్‌లో ఇరవై టాయిలెట్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. తాత్కాలికంగా ఎక్కడంటే అక్కడ అమర్చుకునేలా వీటిని తయారు చేశారు. ఒకచోట దీన్ని ఏర్పాటు చేసినా, అక్కడ వినియోగం ఆశించిన స్థాయిలో లేని పక్షంలో దాన్ని అక్కడి నుంచి సమీపంలోని మరో చోట మళ్లీ అమర్చుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేగాక, శాశ్వత ప్రాతిపదికన నిర్మించే టాయిలెట్ల కన్నా, ప్రీ ఫ్యాబికెటెడ్ టాయిలెట్ల ఏర్పాటుకు అయ్యే వ్యయం తగ్గువగా కావటంతో పాటు కాస్త ఆకర్షణీయంగా కూడా కన్పించనున్నందున వీటి ఏర్పాటు వైపే జిహెచ్‌ఎంసి మొగ్గుచూపుతోంది. వీటి ఆపరేషన్, మెయింటనెన్స్ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే మెరుగైన ఫలితాలుంటాయని గుర్తించారు. ఇందులో భాగంగా ఈ ఇరవై టాయిలెట్ల ఆపరేషన్, మెయింటనెన్స్ చేపట్టేందుకు ఎజెన్సీలను ఆహ్వానించాలని గురువారం జరిగిన స్థారుూ సంఘం తీర్మానం చేసింది. అయితే వీటి ఆపరేషన్, మెయింటనెన్స్ చేపట్టేందుకు ముందుకొచ్చే ఏజెన్సీలకు చెల్లింపులెలా ఉండాలి? ఈ బాధ్యతను భుజాన వేసుకున్నందుకు వీటిపై అడ్వర్‌టైజ్‌మెంట్ల కేటాయింపు బాధ్యతను ఎజెన్సీలకు అప్పగించాలా? లేక ఈ కేటాయింపుల బాధ్యత బల్దియానే చేపట్టి, నామమాత్రం ఛార్జీలు చెల్లించాలా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది. వచ్చే నెల 4వ తేదీ వరకు జరగనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో భాగంగా చివరి మూడురోజుల పాటు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత నాణ్యత నియంత్రణ మండలికి చెందిన బృందం నగరంలో పర్యటించనున్నందున, వీలైనంత త్వరగా ఈ ప్రీ ఫ్యాబ్రికెటెడ్ టాయిలెట్లను అందుబాటులోకి తెస్తే సర్వేలో మెరుగైన ర్యాంక్‌కు అవసరమైన మార్కులు దక్కించుకోవచ్చునని బల్దియా భావిస్తోంది.
సినిమాల పైరసీ ముగ్గురి అరెస్టు

హైదరాబాద్, జనవరి 5: తెలుగు సినిమాలను పైరసీ చేస్తున్న ముగ్గురిని సిసిఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్, వినయ్, వీరేందర్ తెలుగు సినిమాలను అక్రమంగా పైరసీ చేస్తున్నారు. తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి ల్యాప్‌టాప్, సిపియు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సిసిఎస్ పోలీసులు తెలిపారు.