హైదరాబాద్

నేటి నుంచి పండుగ ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చాదర్‌ఘాట్, జనవరి 8: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా నగరం నుండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నేరుగా ఎంజిబిఎస్ బస్టాండ్‌కు రాకుండా నగర కూడళ్లలోని వివిధ ప్రాంతాలను ఆర్టీసీ అధికారులు గుర్తించి అక్కడి నుండి బస్‌లను నడుపుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు పూర్తిగా సహకరించి వారికి దగ్గరగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగా సందర్భంగా 3180 ప్రత్యేక బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ నగరం నుండి వివిధ ప్రాంతాలకు నడుపుతోంది. వీటిలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతాలకు 2430, ఆంధ్రాకు 750 ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసారు.
మహత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకుగాను స్వైప్ మిషన్‌లను కూడా అందుబాటులోకి తెచ్చారు.
9 నుంచి 12వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి అవసరమైతే మరిన్ని బస్సులను ఏర్పాటు చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 250 కిలోమీటర్ల దూరానికి పైబడి ఉండే ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేక బస్సులలో యాభై శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తారు. సిబిఎస్, ఉప్పల్, ఎల్‌బినగర్, జూబ్లిబస్టేషన్ ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకుగాను ప్రత్యేక బస్సులు సిద్ధంగా ఉంటాయని పేర్కొన్నారు. పండుగా రద్దీని దృష్టిలో పెట్టుకుని నగరంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని బస్సులు ఎంజిబిఎస్ నుండి రాకపోకలు సాగించకుండా చర్యలు తీసుకుంటున్నారు.
కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపూర్, ఒంగోలు, నెల్లూరు వెళ్లే బస్సులు పాత బస్‌డిపో నుండి బయలుదేరతాయి. నల్గొండ, కోదాడ, మిర్యాలగూడ ప్రాంతాలకు వెళ్లే బస్సులను దిల్‌సుఖ్‌నగర్ నుండి నడుపుతారు.
కరీంనగర్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట వెళ్లే బస్సులు సికింద్రాబాద్ జూబ్ల్లీబస్టేషన్ నుంచి నడుపుతారు. హన్మకొండ, వరంగల్, నర్సంపేట, పరకాల, జనగాం, యాదగిరిగుట్ట వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్‌రోడ్డు నుండి నడుస్తాయని ఇడి తెలిపారు.
విజయవాడ, గుంటూరు బస్సులు ఎల్‌బినగర్ క్రాస్ రోడ్డు నుంచి గమ్యాలకు చేరుకుంటాయన్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకార్యార్ధం సిద్దిపేట, జూబ్ల్లీబస్టేషన్, ఎంజిబిఎస్‌లలో స్వైపింగ్ మిషన్‌ల నిర్వహణ ఉంటుందన్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నేరుగా ఎంజిబిఎస్ వచ్చిన వారికి ప్రత్యేకించి వారి పాయింట్లకు సిటీ బస్సును నడిపే వీలు కలిగిస్తున్నామన్నారు. వివరాలకు 8330933419, 9959226245, 8330933537 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు. ప్రయాణికులు ఎంజిబిఎస్ బస్టేషన్‌కు రాకుండా వారికి అందుబాటులో ఉన్న ప్రాంతాల నుండి వారి ప్రాంతాలకు బస్సుల్లో క్షేమంగా బయలుదేరి వెళ్లాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.