హైదరాబాద్

క్యారమ్‌లో శిక్షణ, టోర్నమెంట్‌లపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కేంద్ర బింధువుగా ఏర్పాటైన హైదరాబాద్ క్యారమ్ ఆసోసియేషన్ (హెచ్‌సిఎ) 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. హెచ్‌సిఏ ఎంతో మంది యువ క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చి దిద్దడమే కాకుండా ప్రంపంచ స్థాయి క్యారమ్ పోటీలో పాల్గొని పతకాలు సాధించిన సంఘంగా ప్రత్యేకతను సంతరించుకుంది. 1969వ, సంవత్సరంలో ఎల్‌ఐసి స్పోర్ట్స్ రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బోగరాజు కుసుమహరనాథ్ తాత్కలికంగా హైదరాబాద్ క్యారమ్ సంఘాన్ని ఏర్పాటు చేసి పలు క్యారమ్ టోర్నమెంట్‌లను నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 36 క్యారమ్ క్లబ్‌లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ క్యారమ్ సంఘానికి అనుబంధంగా ఉన్న క్లబ్‌లతో కలిసి 1972 జనవరి 9వ తేదీన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సంఘం నూతన కమిటీ నియామకం కోసం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కమిటీ అధ్యక్షునిగా కెఆర్ నందగోపాల్, ప్రధాన కార్యదర్శిగా బికె.హరనాథ్, కోశాధికారిగా మహ్మద్ తాజుద్దీన్‌లు ఎన్నికయ్యారు.
తెలంగాణలోని జిల్లాలకు అనుగుణంగానే హైదరాబాద్ క్యారమ్ సంఘం ఆవిర్భావమైంది. హైదరాబాద్ క్యారమ్ సంఘానికి ప్రస్తుతం అధ్యక్షునిగా హరనాథ్, ప్రధాన కార్యదర్శిగా ఎస్.మదన్‌రాజ్ వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ క్యారమ్ సంఘం ప్రతి సంవత్సరం సీనియర్స్ పురుషులు, మహిళలు, బాలబాలికలు జూనియర్స్, సబ్ జూనియర్స్ విభాగంలో వివిధ టోర్నమెంట్‌లను నిర్వహించి తెలంగాణ క్యారమ్ క్రీడాకారులను ప్రోత్సహిస్తోంది. తెలంగాణ పరిధిలోని అన్ని జిల్లాలో టోర్నమెంట్‌లను తరచూ నిర్వహించి ప్రతిభ కనపర్చిన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తిర్చీదిద్దుతోంది. లాల్‌బహదూర్ ఇండోర్ స్టేడియంలో రీజినల్ స్థాయి క్యారమ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ప్రారంభించింది అసోసియేషన్. రాష్ట్రం తరఫున హైదరాబాద్ క్యారమ్ సంఘం అన్ని విభాగాల్లో క్రీడాకారులను తయారు చేసింది. హైదరాబాద్ స్టేట్ జట్టు దేశంలోని వివిధ రాష్ట్రాలలో నిర్వహించిన జాతీయ స్థాయి క్యారమ్ చాంపియన్‌షిప్‌లో అనేక పతకాలు సాధించింది. దీంతో అఖిల భారత క్యారమ్ సమాఖ్యలో హైదరాబాద్ క్యారమ్ సంఘం చెరగని ముద్ర వేసుకుంది. హైదరాబాద్ క్యారమ్ సంఘం ప్రతినిధులు చేపడుతున్న సంస్కర్ణలు మంచి ఫలితాలిస్తున్నాయని ఫెడరేషన్ దృష్టి హైదరాబాద్ క్యారమ్ సంఘంపై పడింది. అఖిల భాతర క్యారమ్ సమాఖ్యలో తెలంగాణ ప్రాంతం నుండి హైదరాబాద్ క్యారమ్ సంఘం ప్రతినిధులకు చోటు కల్పించారు. దీంతో హైదరాబాద్ క్యారమ్ సంఘం సేవలు మరింత విస్తరించిన్నట్లయింది.
గత సంవత్సరం నవంబర్‌లో బర్మింగ్ హామ్‌లో నిర్వహించిన ప్రపంచ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారిణి అపూర్వ చక్కటి ప్రతిభను కనపర్చి మహిళల విభాగంలో సింగిల్స్ టైటిల్‌ను గెల్చుకుంది.
ఫైనల్లో తమిళనాడుకు చెందిన పర్మిళ దేవిపై విజయం సాధించి ట్రోఫిని సొంతం చేసుకుంది. అందుకు ప్రోత్సహకంగా తమిళనాడు ప్రభుత్వం పర్మిళకు రూ.12లక్షల నగదు పారితోషికాన్ని అందించింది. కాని తెలంగాణకు చెందిన ఆపూర్వ ప్రపంచ స్థాయి టైటిల్ గెల్చుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకపోవడం విశేషం. ఈ మేరకు హైదరాబాద్ క్యారమ్ సంఘం అపూర్వ ప్రపంచ స్థాయి టైటిల్‌ను సాధించిందని, తగిన పారితోషికం ఇవ్వాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని, నూతన క్రీడా పాలసీని తీసుకువస్తున్నామని మంత్రులు, ఉన్నాతాధికారులు చెపుతున్నా..వారి మాటలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని పలువురు క్రీడాకారులు పేర్కొంటున్నారు. యుఎస్ గ్రాండ్‌స్లామ్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన ఆర్‌డి.దినేష్ సింగిల్స్ టైటిల్‌ను గెల్చుకోగా, డబుల్స్ టైటిల్‌ను అనిల్‌కుమార్, సందీప్‌కుమార్ గెల్చుకున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి క్యారమ్ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ క్యారమ్ సంఘం కొనసాగుతున్న అసోసియేషన్‌ను త్వరలో తెంలగాణ క్యారమ్ సంఘంగా మారుస్తామని హరనాథ్ తెలిపారు. హైదరాబాద్ క్యారమ్ సంఘానికి అనుగుణంగా ఉన్న పది జిల్లాలతో కలుపుకుని ప్రభత్వం ప్రకటించిన మొత్తం 31 జిల్లాలో అసోసియేషన్‌లను ఏర్పాటు చేసి నూతన కమిటీలను నియమిస్తామని తెలిపారు.
క్యారమ్ క్రీడాకారుడిగా ఉంటూ, క్యారమ్‌లో యువ క్రీడాకారులకు శిక్షణనిస్తూ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఎస్.మదన్‌రాజ్ హైదరాబాద్ క్యారమ్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేసి తనకు చేదోడు వాదోడుగా ఉంటూ క్యారమ్ క్రీడా అభివృద్ధికి విశేషంగా సేవలు అందించారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో క్యారమ్ క్రీడాభివృద్ధి కోసం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ(శాట్స్) తగిన ప్రోత్సహం అంధించాలని హరనాథ్, మధన్‌రాజ్‌లు కోరుతున్నారు. లాల్‌బహదూర్ ఇండోర్ స్టేడియంలో మూతపడిన రీజినల్ క్యారమ్ సెంటర్‌ను తిరిగి ప్రారంభించి, ఇక్కడ ప్రత్యేక క్యారమ్ బోర్డులను ఏర్పాటు చేసి పలు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.