హైదరాబాద్

మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రథమ స్థానంలో రంగారెడ్డి ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా మరుగుదొడ్ల నిర్మాణంలో మొదటి స్థానంలో నిలవాలని కలెక్టర్ ఎం.రఘునంధన్‌రావు అన్నారు. బుధవారం ఎంపిడిఓలతో వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు రెండు లేక మూడు గ్రామాలు ఎంపిక చేసి పనులను నిర్వహిస్తున్నారని, ఇప్పటి నుంచి తప్పనిసరిగా ఐదు గ్రామాలను ఎంపిక చేసి మిగిలిన గ్రామాల 100 శాతం లబ్ధిదారులను నివేదిక ఒకే వారంలోగా సమర్పించి పరిపాలన పరమైన అనుమతులను తీసుకుని వెంటనే పనులను ప్రారంభించాలని ఆదేశించారు. జరిగే పనులను మరుగుదొడ్ల నిర్మాణమే కాక పనుల నాణ్యతను పరిశీలించి, నాణ్యత పనుల ఫొటోలను సమగ్ర నివేదికను వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని తెలిపారు. నివేదిక ఆధారంగానే లబ్థిదారునికి రావలసిన నిధులను ఆన్‌లైన్ ద్వారా లబ్ధిదారుని ఖాతాలో జమచేయబడుతాయని, లబ్ధిదారునికి బ్యాంకు ఖాతా ఉండేటట్లు చూడాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు సంతృప్తికరంగా లేవని, ఇక నుంచి ఎంపిక చేసిన ఐదు గ్రామాల పనులు నాణ్యతాపరమైన నిర్మాణాలు చేపట్టాలని, రాబోయే రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.