హైదరాబాద్

ఎంజిబిఎస్‌లో ప్రయాణికుల రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చాదర్‌ఘాట్, జనవరి 13: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజిబిఎస్), జూబ్లీబస్టేషన్‌లతో పాటు నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. నగరంతో పాటు శివారు ప్రాంతాల వాసులు తెల్లావారుజాము నుంచే తమ ఊర్లకు వెళ్లేందుకు బారులుతీరారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఎర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా నగరం నుండి ఉమ్మడి తెలుగురాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నేరుగా ఎంజిబిఎస్ బస్టాండ్‌కు రాకుండా నగర కూడళ్లలోని వివిధ ప్రాంతాలను ఆర్టీసీ అధికారులు గుర్తించి అక్కడి నుండి బస్‌లను నడుపుతున్నారు. సంక్రాంతి పండుగా సందర్భంగా 3180 ప్రత్యేక బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నగరం నుండి వివిధ ప్రాంతాలకు నడుపుతోంది. వీటిలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతాలకు 2430, ఆంధ్రాకు 750 ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయని ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ఆర్‌ఎం గంగాధర్ తెలిపారు. శుక్రవారం రోజు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు 70 అదనపు బస్సులను, ఏపికి మరో 90 అదనపు బస్సులను నడిపినట్టు ఆర్‌ఎం తెలిపారు. ప్రయాణికులు రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను కూడా పెంచుతున్నామని చెప్పారు. పండుగ సందర్భంగా మొత్తం 3670 బస్సులు నడుస్తున్నాయని, ఇందులో కేవలం తెలంగాణ జిల్లాలకు 2430 బస్సులు నడుస్తున్నాయని గంగాధర్ తెలిపారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రద్దీకి అనుగుణంగా శని, ఆదివారాల్లోనూ బస్సులు నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు గంగాధర్ చెప్పారు. ఈ వారంలో ఏపికి 750 బస్సులకు ప్రణాళికలు రూపొందించిన్నప్పటికీ రద్దీ పెరగటంతో 1200 బస్సుల వరకు నడిపించినట్టు ఆర్‌ఎం పేర్కొన్నారు.
మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ప్రత్యేక ఎర్పాట్లు చేసిన అధికారులు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకుగాను స్వైప్ మిషన్‌లను కూడా అందుబాటులోకి తెచ్చారు. సిబిఎస్, ఉప్పల్, ఎల్‌బినగర్, జూబ్లీబస్టేషన్ ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు సిద్ధంగా ఉంచారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని నగరంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని బస్సులు ఎంజిబిఎస్ నుండి రాకపోకలు సాగించకుండా చర్యలు తీసుకున్నారు ఆర్టీసి ఆధికారులు. నగరం నుండి దూర ప్రాంతాలకు వెళ్లే రైల్వే ప్రయాణికులతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి(హైదరాబాద్) రైల్వేస్టేషన్‌లు రద్దీగా మరాయి.