హైదరాబాద్

సర్వేక్షణ్‌తో సం‘క్రాంతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: దేశవ్యాప్తంగా 500 నగరాల్లో కొనసాగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంక్ సాధించుకునేందుకు జిహెచ్‌ఎంసి సంక్రాంతి పండుగను కూడా ఎంతో చాకచక్యంగా సద్వినియోగం చేసుకుంటుంది. స్వచ్ఛతపై నగరవాసుల్లో అవగాహనను పెంపొందించటం, స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే గురించి తెలియజేసేందుకు సంక్రాంతి పండుగ సందర్భంగా వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇదివరకే జనవరి 1న నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని నగరంలో తరుచూ చెత్త పడే వెయ్యి 16 బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తొలగించి, అదే చోట నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. కానీ వీటిలో కొన్ని ప్రాంతాల్లో నేటికీ చెత్త పడుతుండటంతో సంక్రాంతి సెంటిమెంట్‌తో అధికారులు ఆయా ప్రాంతాల్లో చెత్తను తొలగించి అక్కడ అందమైన సంక్రాంతి ముగ్గులు వేయించారు. నిన్నమొన్నటి వరకు చెత్తాచెదారం పడి ఉన్న ప్రాంతంలో ముగ్గులు వేసేందుకు స్థానికులు ముందుకు రాకపోవచ్చునన్న విషయాన్ని ముందుగానే గుర్తించిన అధికారులు అలాంటి వారిని ప్రోత్సహించేందుకు బహుమతులను ప్రకటించారు. ఇందులో భాగంగా శుక్రవారం భారీగా చెత్తాచెదారం పడి ఉన్న పలు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టిన జిహెచ్‌ఎంసి అధికారులు, సిబ్బంది సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ గాలిపటాలు, దారం చర్కాలను అందజేశారు. రేపటి నుంచి ఈ ప్రాంతంలో చెత్త పడకుండా చూడటంతో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ్భారత్ మిషన్ నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రతి ఒక్కరు విధిగా పాల్గొని, నగరానికి మెరుగైన ర్యాంక్‌ను తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసింది. సుమారు 1500 అడుగుల ఎత్తులో నుంచి పది నిమిషాల పాటు నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్, బుద్ద విగ్రహం, లుంబినీపార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, బిర్లామందిర్, ఐమాక్స్ ధియేటర్, సంజీవయ్యపార్కు, స్నో వరల్డ్‌లను తిలకించవచ్చు. ప్రస్తుతం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తుంబీ ఏవియేషన్ ఆధ్వర్యంలో ట్విన్ ఏంజిల్ బెల్ 412 అనే ఒక్క హెలికాప్టర్‌ను మాత్రమే అందుబాటులో ఉంచారు. ఈ అరుదైన అవకాశం కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తుంబీ ఏవియేషన్ అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక డిస్కౌంట్లు
హెలికాప్టర్ ద్వారా సాగర తీరం, పరిసర ప్రాంతాల అందాలను వీక్షించాలనుకునే నగరవాసులకు తుంబీ ఏవియేషన్ ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా ప్రకటించారు. ప్రస్తుతం పనె్నండు సీట్లు కల్గిన ఈ హెలికాప్టర్‌లో నగరాన్ని చూసేందుకు ఒక్కోక్కరికి 10 నిమిషాలకు రూ. 3500 ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
అలాగే నాలుగు అంతకంటే ఎక్కువ టికెట్లు కొనుగోలు చేస్తే ఒక్కో టికెట్‌పై రూ. 500 వరకు తగ్గింపునివ్వనున్నట్లు, ఇక 12 సీటర్ల హెలికాప్టర్‌లో మొత్తం 12 సీట్లను( ఒక్కోదానికి రూ. 3500) కొనుగోలు చేస్తే ఒక్కో టికెట్‌పై రూ. వెయ్యి అంటే రూ. 1200 వరకు డిస్కౌంటు ఇవ్వనున్నట్లు తుంబీ ఏవియేషన్స్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ గోవింద్ నాయర్ తెలిపారు.
స్పందన వస్తుందా?
సాగర తీరంపై కేవలం పది నిమిషాల పాటు విహారించే హెలికాప్టర్ రైడ్‌కు రూ. 3500 ఛార్జీగా నిర్ణయించటంతో నగరవాసుల నుంచి స్పందన ఏ మాత్రం వస్తుందోన్న చర్చ లేకపోలేదు.
విమాన ఛార్జీలు హైదరాబాద్-దిల్లీకి రూ. 3500, అలాగే హైదరాబాద్-విశాఖపట్నంకు రూ. 1600 వర్తింపజేస్తుండగా, అంతెందుకు శ్రీశైలం అందాలను రూ. 2500లకే హెలికాప్టర్ ఛార్జీలు వర్తింపజేస్తుండగా, సాగర తీరాన్ని చూసేందుకు ఏకంగా రూ. 3500 పెద్ద మొత్తం వెచ్చించేందుకు నగరవాసులు ముందుకొస్తారా? అన్న చర్చ లేకపోలేదు.

పార్కింగ్ వివాదంతో దాడి
ఖైరతాబాద్, జనవరి 13: పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదంతో ఓ వ్యక్తిపై దాడి చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఫిలింనగర్‌లో నివాసం ఉండే కమలాకర్ గౌడ్ సచివాలయంలో విధులు నిర్వహిస్తుంటాడు. ఇతని ఇంటికి ఎదురుగా రాజశేఖర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గురువారం కమలాకర్ ఇంటి ఎదురుగా ఉన్న రాజశేఖర్ నివాసానికి సమీపంలో తన ద్విచక్రవాహనాన్ని పార్కింగ్ చేశాడు. ఇది గమనించిన రాజశేఖర్ వాహనాన్ని వెంటనే ఇక్కడి నుంచి తీసివేయాలని ఆదేశించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర కోపోద్రిక్తుడైన రాజశేఖర్ తన అనుచరులతో కలిసి కమలాకర్‌పై దాడి చేశాడు. దాడిచేసే సమయంలో తాను ఎమ్మెల్యే సోదరుడిని అని అంటూ హెచ్చరించాడని బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజశేఖర్‌పై కేసు నమోదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.