హైదరాబాద్

సంక్రాంతి సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: మహానగరంలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. శనివారం మకర సంక్రాంతిని పురస్కరించుకుని శుక్రవారం నగరంలో గాలిపటాల విక్రయాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే గచ్చిబౌలీ స్టేడియం, నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాల్లో పలు ప్రైవేటు, స్వచ్చంద సంస్థలు నిర్వహిస్తున్న కైట్ ఫెస్టివల్ నగరవాసుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులు పోటీలు జరిగాయి. వరుసగా మూడురోజుల పాటు సెలవులు రావటంతో కొన్ని బహుళజాతి కంపెనీలు సైతం అందులో పనిచేసే మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలను నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో శనివారం గాలిపటాల పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా గాలిపటాలు, వీటిని కొట్లాడించే మాంజాలు, ధారం, చెర్కాలను తయారు చేసే దూల్‌పేట, బేగంబజార్, హుస్సేనీ ఆలంతో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హోటల్ సేల్ దుకాణాల ముందు కొనుగోలుదార్ల రద్దీ కన్పించింది. గతంలో కన్నా ఈ సారి గాలిపటాలు, మాంజాలు, చర్కాలు విక్రయించే షాపులు ఘనంగా తగ్గినా, ప్రతి ఏటా గాలిపటాలు ఎగురవేస్తూ మర్చిపోలేని మధురానుభూతి పొందే వారిలో ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని వ్యాపారులంటున్నారు. గాలిపటాల తయారీ, విక్రయంలోనూ టపాసులు, రాకీలు, వినాయక విగ్రహాల తరహాలో పెద్దగా పెట్టుబడి అవసరం లేదని, అలాగే ఆదాయం కూడా అంతంతమాత్రమే వస్తోందని తయారీదారులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ రోజున గాలిపటాలు ఎగురవేయటం ఆనవాయితీగా వస్తున్నందున ఒక్కపుడు కేవలం దూల్‌పేట, బేగంబజార్‌తో పాటు పాతబస్తీలోని హుస్సేనీ ఆలం మరికొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇవి తయారయ్యేవి. ఇపుడు నగరంలోని వివిధ ప్రాంతాల్లో యువకులే గాలిపటాలు, మాంజాలు, చర్కాలను తయారు చేసుకుంటున్నారు. ఇందుకు అతి తక్కువ పెట్టుబడితో ఇవి తయారు కావటమేనని తయారీదారులంటున్నారు. గతంతో పోల్చితే ఈ సారి గాలిపటాలు ధరలు స్వల్పంగా పెరిగాయని కొనుగోలుదార్లు అంటున్నారు. డొరేడార్ గాలిపటం ఒక్కటి రూ. 10 ఖరీదు చేస్తుండగా, అంతకన్నా పెద్ద సైజుల్లో ఉండే అద్దా గాలిపటాలు రూ. 25 నుంచి రూ. 50వరకు వివిధ రకాల్లో అందుబాటులో ఉన్నాయి. శనివారం మకర సంక్రాంతి సందర్భంగా ఆకాశంలో భారీగా గాలిపటాలు ఎగురుతూ దర్శనమివ్వనున్నాయి.
శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు
గచ్చిబౌలి: శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బసవన్నల విన్యాసలు, జంగందేవరులు సంభావనలు, హరినామస్మరణలో ఆకట్టుకుంటుండగా, బుడబుక్కల వారు కనువిందు చేస్తున్నారు. కోతలరాయుడు పిట్టల దొర కితకితలు సందర్శకులను ఆనందసాగరంలో ముంచేస్తున్నాయి. టికెట్లు దొరక్క సొంత ఊళ్లకు వేళ్లలేకపోయిన వారు శిల్పారామంలో ఆనందంగా గడిపారు. పల్లె వాతావరణాన్ని తలపించే శిల్పారామానికి గంగిరెద్దులు, జంగందేవరలు, హరిదాసులు, బుడబుక్కల వారు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఉదయం భోగిమంటలు వేసి సంక్రాంతి పండుగను ప్రారంభించారు. రంగురంగుల రంగవల్లులతో శిల్పారామం అంతా సుందరంగా తయారు చేశారు. ఉదమం 10గంటల నుండే సందర్శకుల తాకిడి మొదలైంది. సంప్రదాయబద్ధంగా తయారైన గంగిరెద్దులు, బుడబుక్కల వారు, హరిదాసులు, డప్పు కళాకారులు సందర్శకులకు స్వాగతం పలికారు. హరిదాసులు జంగందేవరులు, బుడబుక్కల వారు, సృష్టికి కారుకులైన ఆదిదేవుళ్లను కొలుస్తూ సందడి చేశారు. హరిలోరంగ హరి అంటూ సందడి చేస్తుంటే అయ్యవారికి దండంపెట్టు...అమ్మగారికి దండం పెట్టు అంటూ బసవన్న చేసిన విన్యాసాలు ప్రతేక అకర్షణగా నిలిచాయి. గంగిరెద్దును కడుపుపై నిలబెటుకుని నాట్యం చేయిస్తుంటే సందర్శకులు ఆనందంతో కేరింతలు కొట్టారు. నాట్యం చేయడమే కాకుండా యజమాని మెడ కొరుకుతూ బసవన్న చేసిన విన్యాసాలు అందరినీ అకట్టుకున్నాయి. సందర్శకులు హరిదాసులు సంభావనలు సమర్పించుకుని దీవెనలు అందుకునేందుకు పోటీపడ్డారు. శిల్పారామం అంత చక్కర్లుకొడుతూ మాటలతో కోటలను దాటించే పిట్టలదొర తన హాస్యపు కోతలతో కడుపుబ్బ నవ్వించాడు. జానపద కళాకారులు సందర్శకులను ఆనంద సాగరంలో ముంచేశారు. వరంగల్‌కు చెందిన డప్పు కళాకారుడు అద్భుత విన్యాసాలతో అలరించాడు. సాయంత్రం అరుబయట రంగస్థలంపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం శిల్పారామం అధికారులు కళాకారులను ఘనంగా సన్మానించారు.
దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి
హైదరాబాద్: మకర సంక్రాంతి పండగను జరుపుకుంటూ, దేశ సస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని కేంద్ర కార్మిక, ఉపాధికల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం అంబర్‌పేటలో జరిగిన భోగి వేడుకలో పాల్గొన్నారు. బిజెపి నగర నాయకులు ఏర్పాటు చేసిన గాలి పటాలను ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ, పండుగలు దేశ సంస్కృతిలో ఒక భాగమని, సంప్రదాయ బద్ధంగా పండుగలను నిర్వహించుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఏడెల్లి అజయ్‌కుమార్, చింతల శ్రీనివాస్ ముదిరాజ్, కెంచె చంద్రశేఖర్, ఆచ్చిని రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

28న తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ ఆవిర్భావం

ఖైరతాబాద్, జనవరి 13: యుకెలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలను ఐక్యం చేయడంతోపాటు ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలను రక్షించేందుకు ఈనెల 28న తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్)ను ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ ప్రతినిధి నవీన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇందుకు సంబందించిన బ్రోచర్‌ను ప్రముఖ కవి నందిని సిద్దారెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్టక్రోసం జరిగిన ఉద్యమంలో ఎన్‌ఆర్‌ఐలు కీలక పాత్ర పోషించారని అన్నారు. దేశం కాని దేశంలో నివసిస్తూ ఇక్కడి ప్రజల ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటేందుకు వారు ఎంతో శ్రమించారని చెప్పారు.
ఈ నేపధ్యంలో తెలంగాణ సంస్కృతిని యుకేలో చాటేందుకు, సాధించిన తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటునందించేందుకు టాక్ ఏర్పాటు కానుండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈనెల 28న యుకెలో జరిగే కార్యక్రమంలో అసోసియేషన్ పురుడు పోసుకుంటుందని, ఆ కార్యక్రమంలో అసోసియేషన్ లక్ష్యాలు, కార్యక్రమాలను వెల్లడిస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో పోచారం సురేందర్ రెడ్డి, కరాటే రాజు, వసుందర దేవి, మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.