హైదరాబాద్

బహుముఖ ప్రజ్ఞాశాలి సినారె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: తెలుగులో అనేక గ్రంథాలు వ్రాసిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి.నారాయణరెడ్డి కవీశ్వరుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. రసమయ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం రవీంద్రభారతిలో సుశీల నారాయణరెడ్డి అవార్డును మాజీ గవర్నర్ రోశయ్య ప్రముఖ రచయిత్రి జలంధరకు ప్రదానం చేశారు.
సినారె తన సతీమణి సుశీల పేరుతో అవార్డు స్థాపించి ఆమె మరణించిన క్రమం తప్పకుండా ముప్పైమూడు సంవత్సరాలుగా ఎంపిక చేసిన రచయత్రులకు ప్రదానం చేయడం విశేషం. సినారె గురించి తెలియని వారుండరు. ఎంతో కీర్తిప్రతిష్టలు సంపాదించారని, అస్వస్థత కారణంగా కార్యక్రమానికి రాలేకపోయినా సినారెకు రోశయ్య అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సినారె మనవరాలు సమన్వయ రచయిత్రి జలంధర్‌కు పూలమాల వేయగా వరేణ్య జ్ఞాపికను ప్రదానం చేయగా మనస్విని పురస్కారంకు సంబంధించిన యాభైవేల రూపాయల చెక్కు ప్రదానం చేశారు. సన్మాన పత్రాన్నిరోశయ్య ప్రదానం చేశారు.
కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కెవి రమణాచారి అధ్యక్షత వహించారు. ముకనుమ పండగలా జలంధర సన్మానం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. రచయిత్రి సి.మృణాళిని సన్మానితురాలు జలంధరను సభకు పరిచయం చేస్తూ ఆమె వ్రాసిన ‘పున్నాగపూలు’ నవల విశేష ఆధరణ పొందిందని అన్నారు. తొలుత రసమయి ఎంకె రాము స్వాగతం పలుకగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి రచయిథ్రి జలంధర రచనా చాతుర్యాన్ని ప్రశంసించారు. కార్యక్రమం ప్రారంభంలో లండన్ నృత్య కళాకారిణి సంతోషి జి. నాయర్ భరతనాట్యం ప్రదర్శించారు. ‘నీ పాదమే కదా...’ రాగమాళికా రాగంలో అన్నమాచార్య కీర్తనను నర్తిస్తూ వామనావతారం, గజేంద్ర మోక్షం అంశాలను అద్భుత విన్యాసాలతో ప్రదర్శించి మాజీ గవర్నర్ రోశయ్య సత్కారం అందుతుంది.

జలమండలి ఇంజనీర్స్ సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

హైదరాబాద్, జనవరి 16: హైదరాబాద్ జలమండలి ఇంజనీర్స్ ఆసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన డైరీ, టెబుల్ క్యాలేండర్‌ను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ ఆవిష్కరించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎండి డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించి ప్రసంగించారు. బోర్డు మనుగడకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు ఎం.ఎల్లస్వామి, డి.శ్రీ్ధర్‌బాబు, ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు ఎంబి.ప్రవీణ్‌కుమార్, ప్రతినిధులు రఘు, రాజశేఖర్ పాల్గొన్నారు.