హైదరాబాద్

అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: భవనాల క్రమబద్ధీకరణ స్కీం కింద స్వీకరించిన దరఖాస్తులు వాటి తాజా స్ధితిపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధను ఆదేశించింది. అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకోకుండా ఉండేందుకు కారణాలేమిటని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు తీసుకుంటున్న చర్యలను సవాలు చేస్తూ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సంస్ధ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపస్తి చాలా మంది ఇండ్ల యజమానాలు తమ ఇండ్లు ఇంకా నిర్మాణంలో ఉన్నా, భవన క్రమబద్ధీకరణ స్కీం కింద దరఖాస్తు చేశారన్నారు. జిహెచ్‌ఎంసి తరఫున న్యాయవాది కేశవరావు వాదనలు వినిపిస్తూ, 2015 అక్టోబర్ 25 కంటే ముందు నిర్మాణమైన వాటికే ఈ స్కీం వర్తిస్తుందని చెప్పారు. అక్టోబర్ 25 కంటే ముందున్న ఇండ్లను గుర్తించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీ సహకారం తీసుకోనున్నట్లు చెప్పారు. జిహెచ్‌ఎంసి ఇంతవరకు బిఆర్‌ఎస్ కింద 1,39,095 దరఖాస్తులు స్వీకరించిందన్నారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకునేందుకు మరింత సమయం అవసరమవుతుందన్నారు. అనంతరం అఫిడవిట్ దాఖలు చేసేందుకు హైకోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది.

సర్కారుకు ఓటమి భయం
జిహెచ్‌ఎంసి యూనియన్ గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి
ధర్నాచౌక్ వద్ద కార్మిక సంఘం ధర్నా

హైదరాబాద్, ముషీరాబాద్, జనవరి 17: జిహెచ్‌ఎంసి కార్మిక సంఘాలకు వెంటనే గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని భాగ్యనగర్ మున్సిపల్ జిహెచ్‌ఎంసి ఎంప్లాయిస్ (బిఎంఎస్) యూనియన్ డిమాండ్ చేసింది. టిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం గెలవదనే కారణంతోనే ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించింది. జిహెచ్‌ఎంసి కార్మిక సంఘం ఎన్నికల్లో సర్కారు జోక్యాన్ని నిరసిస్తూ మంగళవారం ఇందిరాపార్కు వద్ద యూనియన్ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు కె.శంకర్ మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి గుర్తింపు సంఘం కాలవ్యవధి 2014 సెప్టెంబర్‌లోనే ముగిసిందని అన్నారు. నాలుగు వారాలలో ఎన్నికలు నిర్వహించాలని 2015 ఎప్రిల్‌లో హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించినా ప్రభుత్వం ఖాతరు చేయటం లేదని ఆరోపించారు. కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణలో రాజకీయ జోక్యం తగదని, కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుంలదర్నీ వెంటనే పర్మినెంటు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సూచించారు. జిహెచ్‌ఎంసి పార్కుల విభాగంలో పనిచేసే సుమారు 600 మంది కాంట్రాక్టు కార్మికుంలదరికి ప్రభుత్వం నిర్ణయించిన రూ. 12వేల వేతనాలు అందరికీ అందేలా సక్రమంగా అమలు కావాలని డిమాండ్ చేశారు. జిహెచ్‌ఎంసిలో సుమారు ఆరు వేల మంది పర్మినెంటు ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన పే కమీషన్ వేతనాలు, తదితర భత్యాలు లభిస్తున్నాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందే హెల్త్‌కార్డు ఇంకా అందలేదని వాపోయారు. అంతేగాక, జిహెచ్‌ఎంసి రోజుకి సుమారు 4500 మెట్రిక్ టన్నుల చెత్తను రవాణా చేస్తుందని, ఇందుకు గాను పర్మినెంటు వాహనాలు కేవలం 300 వరకు మాత్రమే ఉన్నాయని, వందల కొద్ది ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకుంటున్నందున ఎక్కడి చెత్త అక్కడే పడి ఉంటుందన్నారు. నగరంలో పేరుకుపోయే చెత్తను తొలగించేందుకు సుమారు వెయ్యి వాహనాలు అవసరమవుతాయని, ప్రభుత్వం వెంటనే తగినన్ని వాహనాలను సమకూర్చాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బిఎంఎస్ రాష్ట్ర నాయకులు ఎస్. మల్లేశం, ప్రధాన కార్యదర్శి రవిశంకర్, సంఘటన కార్యదర్శి రాధాకృష్ణ, ఖాదర్ సుభానీ, జిఎస్‌ఐ నాయకులు ఎం. సుధాకర్‌రావు, సింగరేణి నాయకులు పిల్లి రాజిరెడ్డితో పాటు యూనియన్ నాయకులు మోహన్‌దాస్, దిలీప్‌కుమార్, జి. శంకర్, శ్రీనివాస్‌గౌడ్, నర్సింగ్‌రావు, రాజు, పోచయ్య, శ్యామలమ్మ, శ్రావణ్, సంఘటన కార్యదర్శి ఎ.శంకర్ తదితరులు పాల్గొన్నారు.