హైదరాబాద్

పాతబస్తీలో జోరుగా తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: పాతబస్తీలో గురువారం చార్మినార్ డివిజన్ పరిధిలోని కాలపత్తర్ పోలీస్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. దక్షిణ మండలం డిసిపి సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన తనిఖీలో దక్షిణ మండలం పరిధిలోని వివిధ పోలీస్టేషన్‌లకు చెందిన మొత్తం 275 పోలీసులు పాల్గొన్నారు.
గురువారం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంలవరకు జరిగిన ఈ తనిఖీల్లో 17 మంది రౌడీషీటర్లు, జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు అనుమానితులతో పాటు మరో ముగ్గురిని కలిపి మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన ధృవ పత్రాలు లేని 66 ద్విచక్ర వాహనాలు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొవ్వులతో నిల్వ ఉన్న గోదాముపై దాడి చేసి సీజ్ చేశారు. దీని యజమాని పరారీలో ఉన్నాడు.
విదేశీ పక్షులు, జంతువులు పెంచుతున్న ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో దక్షిణ మండలం డిసిపి సత్యనారాయణతో పాటు అదనపు డిసిపి బాబురావు, ఎసిపి, ఇన్స్‌పెక్టర్లు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ పాతబస్తీలో రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణివేస్తామన్నారు. పాతబస్తీ ప్రజల రక్షణకు సంబంధించి నిర్బంధ తనిఖీలు కొనసాగిస్తామని చెప్పారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు కాలపత్తర్ పోలీస్టేషన్ పరిధిలో నిర్బంధ తనిఖీలు నిర్వహించామన్నారు.

ఆర్టీసి కార్మికులకు ఆహార భద్రతాకార్డులు
హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం వుంటే ఆ గ్రామాలు పట్టణాలతో సంబంధం కలిగి అభివృద్ధి చెందగలవని తెలంగాణ ఆర్టీసి చైర్మన్ సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసి రిటైర్డ్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉదయం రవీంద్రభారతిలో ఆయన నూతన డైరీని ఆవిష్కరించచారు. ఆర్టీసి కార్మికులకు ఆరోగ్య భద్రత కార్డులు, పెన్షన్ ఇప్పించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సంప్రదించి న్యాయం చేస్తానని అన్నారు. ప్రస్తుతం ఆర్టీసి నష్టాల్లో వున్నదని, ఆర్టీసికి ఆదాయం పెంచడానికి అందరూ కలిసి కృషి చేయాలని అన్నారు. లాభాలు రావాలంటే ఖర్చు తగ్గించే ఆశగా పనిచేయాలి. సంఘం కార్యాలయానికి ఎంజిబిఎస్‌లో ఒక గది ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తానని అన్నారు. బస్సులు తిరగడానికి రోడ్లపైన డెడికేట్ లైన్ నగర పాలక సంస్థ ఏర్పాటు చేయగలిగితే బస్సులు చాలా వేగంగా వెళ్ళగలవని, తద్వారా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని చైర్మన్ సత్యనారాయణ అన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమణారావు మాట్లాడుతూ ఆర్టీసి వినూత్న ఆలోచనలతో క్రియాశీలకంగా పనిచేయాలని అన్నారు. కార్మికుల సమస్యలను ఈ నెలాఖరులోగా పరిష్కరిస్తామని అన్నారు. అంతర్గత సమస్యలతో కొంత ఆలశ్యమైన కోర్కెలు తప్పక నెలవేరుస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసిలోని పేద కార్మికులకు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ మంజూరు విషయంలో అధికారికంగా దరఖాస్తు చేస్తే, ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సంప్రదించి మంజూరు చేయడానికి ప్రయత్నిస్తానని అన్నారు. ఆర్టీసిని బలోపేతం చేయడంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, రిటైర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎ. రెహమాన్, జైస్వాల్, ధామస్‌రెడ్డి పాల్గొన్నారు.