హైదరాబాద్

సినిమాకు వెళ్లారో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రతి సినిమా థియేటర్‌లోనూ సినీమా ప్రారంభానికి ముందు న్యూస్ రీల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే లఘు చిత్రాలను ప్రసారం చేయించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్లు భద్రత నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ఫ్యాబ్ రీగల్ రాప్టర్ క్రూసర్ చాపర్ కంపెనీ తయారు చేసిన మోటారు సైకిల్ (బైక్)ను శుక్రవారం మంత్రి పరిశీలించారు. ప్రమాదాల నివారణకు సామాజిక కార్యకర్తల ప్రతాప్ రాణా రూపొందించిన మిస్టర్ రైడో డాక్యుమెంటరీ సినీమాను పరిశీలించి, సిడీ, ప్రతిజ్ఞ చిత్రాన్ని విడుదల చేశారు.
మితిమీరిన వేగం, నిర్లక్ష్యం కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి ఏడాది లక్షా 47 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, రాష్ట్రంలో ఏటా 7 వేల మంది మృత్యువాత పడుతున్నారని మంత్రి చెప్పారు.

ఆలిండియా రాజీవ్ గాంధీ అండర్-19
జాతీయ టి-20 క్రికెట్ లీగ్ ప్రారంభం
తెలంగాణ, తమిళనాడు జట్ల గెలుపు

హైదరాబాద్, జనవరి 20: క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న ఆలిండియా రాజీవ్ గాంధీ అండర్-19 జాతీయ టి-20 డే అండ్ నైట్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో తెలంగాణ, తమిళనాడు జట్లు గెలుపొందాయి. శుక్రవారం మూడో రోజు నగరంలోని వివిధ ప్లేగ్రౌండ్‌లలో జరిగిన మ్యాచ్‌ల్లో తెంలగాణ 20 పరుగుల తేడాతో ప్రత్యర్థి మాలేషియాపై, తమిళనాడు జట్టు ప్రత్యర్థి కర్నాటక, ఎపిపై విజయం సాధించింది. తెలంగాణ- మాలేషియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన తెలంగాణ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 138 పరుగులు సాధించింది. మాలేషియా జట్టు బౌలర్లు అర్వీన్, మాలాయిసీయాలు చే మూడేసి వికెట్లు తీసుకున్నారు. అందుకు జవాబుగా బ్యాటింగ్ చేసిన మాలేషియా జట్టు నిర్ణీత ఓర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసి ఓటమి పాలైంది. మరో మ్యాచ్‌లో తమిళనాడు ఐదు వికెట్ల తేడాతో కర్నాటకపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన కర్నాటక 17.4 ఓవర్లలో 86 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన తమిళనాడు 15.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసి విజయలక్ష్యాన్ని అధిగమించింది. తృతీయ మ్యాచ్‌లో తమిళనాడు ఐదు పరుగుల తేడాతో ఎపిపై నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 9వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎపి 18.4 ఓవర్లలో 85 పరుగులు చేసి ఆలౌట్ అయ్యి ఓటమి పాలైంది.