హైదరాబాద్

మహిళలకు ఆదర్శం సావిత్రీబాయి పూలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: మహిళలు అన్ని రంగాలలో ముందడుగు వేసినప్పుడే సమగ్రాభివృద్ధి జరుగుతుందని, సావిత్రీబాయిని ఆదర్శంగా తీసుకొని మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర బిసి మహిళా సమాఖ్య రాష్ట్ర సదస్సు ఆదివారం ఉదయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ పెళ్లి చేసుకుని భార్యను హింసించే పురుషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలను అసభ్యకరంగా చూపించే సినిమాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. బిసిలలో ఇంకా చాలామంది చదువుకు దూరంగా ఉన్నారని, మొదట స్ర్తిలు బాగా చదువుకొని హేళన చేసే వారికి బుద్ధి చెప్తూ స్ర్తి ఆదిశక్తి అని నిరూపించాలి. ప్రస్తుతం బిసిలలో 78 శాతం నిరక్షరాశ్యులున్నారని, ఏ సమస్య పరిష్కారానికైనా విద్య చాలా అవసరమని అన్నారు. ఆత్మరక్షణ కోసం మహిళలు కరాటే నేర్చుకోవాలని, కుటుంబం సవ్యంగా సాగాలంటే మహిళలే ప్రధానపాత్ర అని అన్నారు. స్వయం ఉపాధి కోసం ముందుకువచ్చే మహిళలందరికి తగిన సహకారం అందిస్తానని బండారు దత్తాత్రేయ అన్నారు. సామాజికంగా కృషి చేసిన 186 మంది మహిళలకు పురస్కారాలు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో తెలంగాణాను బంగారుబాటలో నడిపించడానికి మహిళలు ప్రధాన పాత్ర వహించాలని అన్నారు. బిసిలు నిరుత్సాహపడకూడదని, వారి పిల్లలు చదువుకుంటేనే భవిష్యత్తులో ఉపయోగపడతారని అన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని బిసిలకు కూడా ప్రభుత్వం వర్తింప చేసిందని అన్నారు. దళారులను నమ్మి మోసమోకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. కళ్యాణలక్ష్మి పథకం క్రింద యాభై ఒక్క వేల రూపాయలు, ఆర్థిక సహాయం అందిస్తున్నామని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ‘అమ్మవొడి’ పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నామని అన్నారు. బిసిలు కేవలం నగరాలకే పరిమితం కాకుండా కమిటీలు వేసుకొని తెలంగాణ మొత్తం పర్యటిం మారుమూల గ్రామాల వారిని కూడా చైతన్యపరచాలని శ్రీనివాస యాదవ్ అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ రాష్ట్ర బిసి మహిళా సమాఖ్య చైర్‌పర్సన్ ఎం.్భగ్యలక్ష్మి మాట్లాడుతూ 70 సంవత్సరాల స్వతంత్ర దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై అత్యాచారాలు, అక్రమాలను అరికట్టడంలో విఫలమైనాయని అన్నారు. బిసి బాలికల గురుకులం పాఠశాలలకు సావిత్రిబాయిపూలె పేరు పెట్టాలని అన్నారు. భూమిలేని నిరుపేదలకు మూడు ఎకరాల సాగుభూమిని ఇవ్వాలని అన్నారు. వకుళాభరణం కృష్ణమోహన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.కవిలత, లక్ష్మీబాయి పాల్గొన్నారు.