హైదరాబాద్

మాటలతో మభ్యపెడుతున్న తెరాస ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, జనవరి 24: తెరాస ప్రభుత్వం కేవలం మాటల గారఢీతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తుందని టిడిపి నగర కన్వీనర్ ఎంఎన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం నగర టిడిపి కార్యాలయంలో కోకన్వీనర్ మేకల సారంగపాణితో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన పలు అంశాలను వెల్లడించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల ముందు సికిందరాబాద్ ఐడిహెచ్ కాలనీలో కూలిపోయిన ఇళ్ల స్థానంలో కొత్తవి నిర్మించి రాష్టల్రో మొత్తం లక్షలాది ఇళ్లను నిర్మిస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. నగరంలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం కోసం రెండు లక్షల దరఖాస్తులు వస్తే అందులో 9వేల మంది మాత్రమే అర్హులుగా పేర్కొంటున్న ప్రభుత్వం వారిని ఏ ప్రాతిపధికన ఎంపిక చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
నగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి స్కైవే నిర్మాణాన్ని చేపడుతామని భూమి కూడ చేశారని, జిహెచ్‌ఎంసి ఎన్నికలు పూర్తయి సంవత్సరం గడుస్తున్నా చేసిన హామీల్లో ఎక్కడా పురోగతి లేదని అందుకే శిలాఫలకాలు వేసిన ప్రదేశాల్లో ఆయా నియోజకవర్గ నేతలతో ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఎంఎన్ శ్రీనివాస్ వివరించారు. అసెంబ్లీ కార్యక్రమాల్లో ప్రతిపక్షాల గొంతులు నొక్కి కెసిఆర్ ఆయన తనయుడు తమ ఉపన్యాసాలకు వాడుకున్నారని ప్రజల సమస్యలు గాలికి వదిలివేశారన్నారు. కేవలం హామీలు ప్రకటనలతోనే కాలం వెల్లదీస్తున్న తెరాస ప్రభుత్వానికి కళ్లు తెరిపించడానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. నగరంలో వందలాది మురికివాడలు ఉంటే కేవలం తొమ్మిదివేల రెండు పడకల గదుల ఇళ్లు ఏ విధంగా సరిపోతాయని ప్రశ్నించారు. ఫిబ్రవరి 11వతేదికి జిహెచ్‌ఎంసి ఎన్నికలు జరిగి సంవత్సరమైన సందర్భంగా ప్రభుత్వ హామీలు నెరవేర్చనందకు నిరసనగా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో పి.సాయిబాబ, వనంరమేశ్, నల్లెల కిశోర్, బద్రీనాధ్ యాదవ్, ప్రదీప్ చౌదరి పాల్గొన్నారు.

రసాభాసగా మారిన అంబర్‌పేట ఫ్లైఓవర్ నిర్మాణ గ్రామసభ
నల్లకుంట, జనవరి 24: అంబర్‌పేట ఫ్లైఓవర్ నిర్మాణంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఆస్తులు కోల్పోతున్న నిర్వాసితులతో జిహెచ్‌ఎంసి అధికారులు, స్ధానిక రాజకీయ నాయకులు నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. మంగళవారం అంబర్‌పేటలోని మహారాణ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సభలోడిప్యూటీ కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ గోల్నాక చౌరస్తా నుంచి అంబర్‌పేట ఇరానీ హాటల్ వరకు 1.5 కిలోమీటర్లలో ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు విస్తరణలో భాగంగా మార్కింగ్ చేశారు. సుమారు 281 ఆస్తులు పాక్షికంగా, పూర్తిగా కోల్పోనున్నాయని వివరించారు. ఎస్సార్‌డిపి క్రింద అధ్యాయన కార్యక్రమాన్ని ఈనెల 25 నుంచి చేపడుతున్నామని, కమిటీ సభ్యులు రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న వారి ఇంటికి వచ్చి వారి అభిప్రాయములు సేకరించనున్నట్లు తెలిపారు. అధ్యాయనం పూర్తి అయ్యాక నివేదికను కలెక్టర్‌కు అందజేస్తరని ఆపై చివరి నోటిఫికేషన్ వస్తుందన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. గ్రామసభలో హాజరైన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తే వాటిని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళతామని హామీ ఇచ్చారు. ఇపిపిఆర్‌ఐ అధికారి సురేంద్ర మాట్లాడుతూ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తాము నిర్వహించబోయే అధ్యాయనం విధివిధానాలను వివరించారు. కార్యక్రమానికి హాజరైన అంబర్‌పే కార్పొరేటర్లు పులిజగన్, గరిగింటి శ్రీదేవి, కె.పద్మావతి, కాలేరు పద్మలు మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్ నిర్మాంలో ఆస్తులు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం నుంచి సరైన నష్టపరిహారాన్ని అందేలా కృషి చేస్తామన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ట్రాఫిక్ సమస్యతో బాధపడుతున్న అంబర్‌పేట ప్రజలు ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించడానికి చేపడుతున్నారని, అందరూ సహకరించాలని కోరారు. నిర్మాణ సమయంలో కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపడతున్నట్లు పేర్కొన్నారు.ప్రజల పక్షానే ఉండి వారికి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత తమదేనని తెలపారు. అనంతరం తమ అభిప్రాయాలను తెలపాలని ఆస్తులు కోల్పోతున్న వారిని కోరగా తమకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఇష్టం లేదని ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం విస్తరణ కాదని మూసి పరివాహక ప్రాంతం గుండా రోడ్డు నిర్మాణం చేపడితే నిర్వాసితులకు డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదని అన్నారు. మరికొందరు మార్కెట్ ధరకు రెండింతలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లతో వాగ్వివాదానికి దిగడంతో డిప్యూటీ కలెక్టర్ చంద్రయ్య సభను ముగిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన నలుగురు కార్పొరేటర్లు హాజరయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే, బిజెపి శాసనపక్షనేత జి.కిషన్ రెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయంశంగా మారింది.