హైదరాబాద్

పారిశుద్ధ్యంలో మనమే బెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: దేశంలోని సుమారు నాలుగు వేల పై చిలుకు ఉన్న మహానగరాలు, పట్టణాల్లో ఎక్కడా లేని విధంగా ఒక్క హైదరాబాద్ నగరంలోనే చెత్తను తడి,పొడిగా వేరు చేస్తున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. అంతేగాక, ఇతర మహానగరాలతో పోల్చితే శానిటేషన్‌లో మనమే బెస్ట్ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. గురువారం ప్రధాన కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంట్లో తడి,పొడి చెత్తను వేరు చేసేందుకు గాను 44లక్షల డస్ట్‌బిన్లను ఉచితంగా పంపిణీ చేయటంతో పాటు 2వేల స్వచ్ఛ ఆటో టిప్పర్లను అందించినట్లు తెలిపారు. అయినా క్షేత్ర స్థాయిలోనే చెత్తను తడి,పొడిగా వేరు చేయటంపై ఆశించిన ఫలితాలు దక్కటం లేదని మేయర్ వ్యాఖ్యానించారు. ఇందుకు గాను నగరంలోని కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలతో పెద్ద ఎత్తున కార్యచరణ ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతి నుంచి సేకరించిన చెత్తను తడి,పొడిగా వేర్వేరుగా ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు తరలించాల్సిన బాధ్యత ఇటీవలే స్వచ్ఛ ఆటో టిప్పర్లు తీసుకున్న డ్రైవర్లదేనని ఆయన వ్యాఖ్యానించారు. గత 2016 సంవత్సరంలో హైదరాబాద్ ఎన్నో సంక్షోభాలను, సమస్యలను ఎదుర్కొందని, అయినా జిహెచ్‌ఎంసి అధికారులు, సిబ్బంది ఇతర శాఖల సమన్వయంతో సమర్థవంతంగా అధిగమించారని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా గత సంవత్సరం ప్రథమార్థంలో నగరానికి నీరందించే రిజర్వాయర్లు ఎండిపోవటం వల్ల నీటి సమస్య ఏర్పడినా, పక్కా ప్రణాళికతో సమస్యను అధిగమించామని తెలిపారు. అంతేగాక, గత సెప్టెంబర్ మాసంలో భారీ వర్షాల వల్ల వరదలు సంభవించి భారీగా రోడ్లు ధ్వంసం కావటంతో యుద్దప్రాతిపదికన రోడ్లను పునరుద్దరించగలిగామని వివరించారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ మాట్లాడుతూ బల్దియా అందిస్తున్న పౌరసేవలకు సంబంధించి గతంలో కన్నా పారిశుద్ద్య కార్యక్రమాలు, వౌళిక సదుపాయాల కల్పన మెరుగైందని పేర్కొన్నారు. ఈ విషయంలో నగర ప్రజల నుంచి ఎంతో సానుకూలమైన స్పందన కూడా వస్తోందని ఆయన వివరించారు.

ఊపందుకున్న తడి,పొడి చెత్త తరలింపు
నగరంలోని 22 లక్షల కుటుంబాలకు జిహెచ్‌ఎంసి ఉచితంగా పంపిణీ చేసిన డస్ట్‌బిన్లలో స్వీకరిస్తున్న తడి,పొడి చెత్తను తరలించే ప్రక్రియ ఊపందుకుంది. పక్షం రోజుల క్రితం ఒక్క లారీతో ప్రారంభమైన ఈ తడి,పొడి చెత్త తరలింపు ఇపుడు 75 ట్రాలీలకు పెరిగిందని కమిషనర్ జనార్దన్ రెడ్డి వివరించారు. పారిశుద్ద్య వ్యర్థాల నియంత్రణ చట్టం 2016 నిబంధనలను అమలు చేయటంలోనూ జిహెచ్‌ఎంసి దేశంలో మొదటి స్థానంలో ఉందని మేయర్ వివరించారు. ఇదిలా ఉండగా, నగరానికి ప్రస్తుతం అందిస్తున్న సేవలను మరింత మెరుగ్గా, వేగంగా అందించేందుకు ఆర్థిక వనరులు చాలా ముఖ్యమని, ఇందుకు గాను జిహెచ్‌ఎంసికి అంతర్గతంగా ఉన్న ఆర్థిక వనరులను పెంపొందించేందుకు ప్రత్యేకంగా కృషి చేయల్సిన అవసరముందని సూచించారు.

క్రికెట్ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన
జలమండలి ఎండి ఎలెవెన్ జట్టు

హైదరాబాద్, జనవరి 26: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలో గురువారం నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌లో జలమండలి ఎండి ఎలెవెన్ జట్టు విజేతగా నిలిచింది. అంబర్‌పేట్‌లోని వాటర్ వర్క్స్ మైదానంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఒక పరుగు తేడాతో ఎండి ఎలెవెన్ జట్టు, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎలెవెన్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎండి ఎలెవెన్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 78 పరుగులు చేసింది. అందుకు జవాబుగా బ్యాటింగ్ చేసిన ఇడి ఎలెవెన్ జట్టు నిర్ణీత 12ఓవర్లలో 77 పరుగులు చేసి ఒటమి పాలైంది. ఎపుడు విధుల్లో బిజీగా ఉండే అధికారులు ఒకచోట చేరి ఆటవిడుపు చేశారు. బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు రెండు క్రికెట్ జట్లుగా ఏర్పాడి మ్యాచ్ అడారు. స్వయంగా జలమండలి ఎండి దానకిషోర్ క్రికెట్ డ్రెస్ ధరించి బ్యాటింగ్‌లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు. అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జలమండలి ఎండి దానకిషోర్ ఇరు జట్లకు ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో జలమండలి డైరెక్టర్లు జి.రామేశ్వరరావు, బి.శ్రీ్ధర్‌బాబు, రఘు, రవీందర్‌రెడ్డి, ఆనంద్ స్వరూప్ పాల్గొన్నారు.