హైదరాబాద్

ఉపాధ్యాయ ఉద్యోగ భద్రతకు అందరూ సంఘటితం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవ ప్రధమైనదని, ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు తారతమ్య బేధాలుండరాదని, ఉద్యోగ భద్రతకు అందరూ సంఘటితం అవ్వాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. శ్రీనివాస రామానుజ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఉత్తమ ప్రైవేటు అధ్యాపకులకు అబ్దుల్‌కలామ్ అవార్డులు, గురుబ్రహ్మ అవార్డులు ప్రదానోత్సవ కార్యక్రమంలో హరీష్‌రావు విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఇప్పటివరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకే అవార్డులు ఇచ్చామని, ఇక నుండి ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తామని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి చాలెంజీ ఉద్యోగమని, తల్లిదండ్రుల తరువాత గురువు దైవంతో సమానమని అన్నారు. రాబోయే పది సంవత్సరాలలో బ్రహ్మాండమైన అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో చూపిస్తామని సమస్యలన్ని పరిష్కరిస్తామని అన్నారు. హోంశాఖ మంత్రి నాయని నర్సింహారెడ్డి మాట్లాడుతూ కార్మిక చట్టం ప్రకారం ప్రైవేటు అధ్యాపకులకు పిఎఫ్ విషయం కేంద్ర కార్మికశాఖ మంత్రితో సంప్రదిస్తామని అన్నారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యం అధ్యాపకుల జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేసారు. అధ్యాపకులు సంతోషంగా వుండే విధంగా న్యాయపరమైన మార్పులు చేపడతామని అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ పి.సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యయులు శ్రీనివాసగౌడ్, ప్రొ. గణపతి శర్మ, ప్రధాన కార్యదర్శి రవికిరణ్, పి.సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

అంధులకు ‘మైక్రో సాఫ్ట్‌వేర్’ ప్రత్యేక స్టిక్‌లు
హైదరాబాద్, జనవరి 29: అంధులకోసం మైక్రో సాఫ్ట్‌వేర్ సహకారంతో స్వేచ్ఛగా తిరగడానికి వీలుగా ప్రత్యేక స్టిక్‌లను తయారు చేయించడానికి ఆలోచన చేసామని, స్టిక్ నేలకు తగలగానే దీపం వెలిగేటట్లుగా ఆపిల్ కంపెనీ తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. అంధుల కోసం ప్రత్యేక లిపిని రూపొందంచిన లూరుూస్ బ్రెయిల్ జయంతి ఉత్సవాన్ని ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించారు. స్వామిగౌడ్ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించి కన్నులు లేకపోయినా ప్రపంచాన్ని చూడగలిగిన జ్ఞానులని అన్నారు. కళ్లుండి చూడలేని అజ్ఞానులెందరో వున్నారు. ఉద్యోగ రిజర్వేషన్‌ల విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సంప్రదించి ఆమోదింప చేస్తానని హామీ ఇచ్చారు. అంధుల కష్టాలు తెలుసుకోవాలని గతంలో శాసనమండలి కార్యాలయం నుండి రవీంద్ర భారతి వరకు కళ్లకు గంతలు కట్టుకొని నడిచి వారి సమస్యలు అర్థం చేసుకున్నానని అన్నారు. అంధుల సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తామన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ వికలాంగుల కార్పొరేషన్‌కు చైర్మన్‌గా అంధులనే నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలేజి ప్రిన్సిపల్ గంగాధర్, తెలంగాణ ఎన్‌జిఓ సంఘం అధ్యక్షులు దేవి ప్రసాద్, గౌరవ అధ్యక్షులు రవీంధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లాలు లూయిస్ బ్రెయిలి పేరుతో భవనం నిర్మించడానికి ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి ఆడిటోరియానికి వచ్చి కార్యక్రమం ప్రారంభం కాలేదని వెళ్ళిపోయారు.