హైదరాబాద్

కేంద్ర బడ్జెట్‌లో పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ 2017-18తో హైదరాబాద్ నగరానికి రూ. వంద కోట్లు కేటాయించటంతో ఇప్పటి వరకు నగరంలో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులకు మోక్షం కల్గిందని బిజెపి గ్రేటర్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణి, వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. నగరానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం మంజూరైన ప్రాజెక్టులకు సరిపడేలా నిధులు మంజూరు చేసిన మోది ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిధులతో ఎంఎంటిఎస్ రెండో దశ పనుల మొదలవుతాయని, అలాగే చెర్లపల్లి, యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ పొడిగింపు కోసం కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించటం హైదరాబాద్ నగరాభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా, చివరకు నరేంద్రమోది ప్రభుత్వ హయంలో ఆ ప్రతిపాదనలు ఫలించాయని వివరించారు. అలాగే పటాన్‌చెరువ, ఘట్‌కేసర్, ఉందానగర్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం శివార్లను కలుపుతూ 2013లో ఆరు మార్గాల్లో చేపట్టిన రెండో దశ ఎంఎంటిఎస్ పనులు ఇపుడు కేటాయించిన నిధులతో వేగవంతమయ్యే అవకాశముందని పేర్కొన్నారు. అంతేగాక, ప్రస్తుతం నడుస్తున్న 121 ఎంఎంటిఎస్ సర్వీసుల సంఖ్య రెండో దశ పూర్తయి, ప్రజలకు అందుబాటులోకి వస్తే రెండు వందలు దాటే అవకాశమున్నట్లు తెలిపారు. దీనికి అధికంగా సుమారు 5లక్షల మందికి ఎంఎంటిఎస్ సేవలు విస్తరిస్తాయని రామచందర్‌రావు తెలిపారు. చెర్లపల్లి టెర్మినల్‌ను అభివృద్ధి చేసేందుకు రూ. 5 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో ఈ టెర్మినల్ అభివృద్ధి చెందితే సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌పై వత్తిడి తగ్గుతోందన్నారు.

142 కిలోల గంజాయి స్వాధీనం
ఆరుగురు అరెస్టు
సికిందరాబాద్, ఫిబ్రవరి 4: సికిందరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సీతాఫల్‌మండి చౌరస్తా వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు 142 కిలోల గంజాయిని ఇన్నోవా కారులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ. 7.40 లక్షల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. విశాఖ, తూర్పుగోదావరి, నల్గొండ జిల్లాలకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గోపాలపురం ఏసిపి శ్రీనివాసరావు, చిలకలగూడ ఇన్స్‌పెక్టర్ కావేటి శ్రీనివాసులు అధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. కాగా నిందితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.