హైదరాబాద్

కవి సామ్రాట్ నోరి నరసింహశాస్ర్తీ చిరస్మరణీయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఫిబ్రవరి 6: సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో రచనలు చేసిన కవి సామ్రాట్ నోరి నరసింహశాస్ర్తీ చిరస్మరణీయుడని ప్రముఖ రచయిత అక్కిరాజు రమాపతిరావు అన్నారు. కవి సామ్రాట్ నోరి నరసింహశాస్ర్తీ 117వ జయంతి సందర్భంగా నోరి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అక్కిరాజు రమాపతిరావు పాల్గొన్నారు. సాహితీరత్న డా.మంగళగిరి ప్రమీలాదేవి, శతావధావి డా.రాంభట్ల పార్వతీశర్మకు నోరి పురస్కార ప్రదానం చేశారు. నోరి నరసింహశాస్ర్తీ వైవిధ్యమైన సాహిత్యాన్ని అందించారని పేర్కొన్నారు. అయన చేసిన రచనలు ఎంతో ప్రజాదరణ పొందయాని తెలిపారు. ముందుగా నూకల సేతుమాధవి ఆలపించిన కర్ణాటక సంగీత గానం అందరిని అలరించాయి. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటి తెలుగు శాఖ మాజీ అధ్యక్షుడు కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ, నోరి శివసేనాని, నోరి కళ్యాణసుందర్ పాల్గొన్నారు.

సాంస్కృతిక కళా ప్రదర్శనలతో
తెలంగాణ కశ్మీర్‌ల అవినాభావ సంబంధాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 6: తెలంగాణ గడ్డపై ప్రప్రథమంగా కశ్మీర్ కళకారులు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి పలువురిని అకట్టుకున్నారు. నృత్యాలతో సాంస్కృతిక సంబంధాలకు బాటలు వేశారడానికి నిదర్శనంగా సోమవారం సాయంత్రం 115 మంది కళాకారులు పాల్గొన్నారు. ముందుగా మంత్రి అజ్మీరా చందులాల్ జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు. భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలతో సాంస్కృతిక సంబధాలు పెంచుకుందామని అన్నారు. ప్రభుత్వ సలహాదారు కెవి రమణచారి మాట్లాడుతూ రవీంద్ర భారతి వేధికపై కళ్లకు కట్టిన్నట్లుగా కశ్మీర్ అందాలను కళాకారులు చూపిస్తున్నారని అన్నారు. మే నెలలో తెలంగాణ రాష్ట్ర కళకారులు కశ్మీర్‌లో ప్రదర్శనలివ్వడానికి ప్రయాత్నలు సాగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర సాంస్కతిక కార్యదర్శి బోర్ర వెంకటేశం మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల కళరూపాలు కేవలం నగరానికే పరిమితం కాకుండా జిల్లాలో కూడా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జమ్ముకశ్మీర్ ప్రభుత్వ కార్యదర్శి ఆజీజ్ హజీని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంతో సాంస్కృతిక సంభందాలు పెంచుకోవడానికి ఇరు ప్రభుత్వలు అంగీకరించడం సుభసూచకమని అన్నారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు నర్సింగ్‌రావు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

వ్యవసాయ కార్మిక సంఘం
రంగారెడ్డి జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

హైదరాబాద్, ఫిబ్రవరి 6: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా క్యాలెండర్‌ను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డి.ప్రశాంత్‌కుమార్ ఆవిష్కరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు డి.రాంచందర్, కె.జగన్ మాట్లాడుతూ క్యాలెండర్ వల్ల వ్యవసాయ కార్మికుల జీవితాలు ఏవిధంగా ఉన్నాయనే విధంగా మంచి ఆకర్షణతో ఉందన్నారు. జిల్లాలో కూలీల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.