హైదరాబాద్

సెలైన్ కల్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, ఫిబ్రవరి 7: గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి సాయిప్రవల్లిక మృతి చెందింది. గత రెండు నెలలుగా న్యూరో సంబంధిత వ్యాధితోచిన్నపిల్లల ఐసియులో చికిత్స పొందుతున్న జనగామ జిల్లాకు చెందిన ఈ చిన్నారి మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో మృతి చెందింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని హుటాహుటిన ఆమె స్వగ్రామానికి తరలించారు. గత యేడాది డిసెంబర్ 15న పురుగు అవశేషంతో కూడిన సెలైన్‌ద్రావణాన్ని చిన్నారి సాయిప్రవల్లికకు ఎక్కించారని పెద్దయెత్తున వివాదం చెలరేగిన విషయం విదితమే. అయితే సెలైన్‌బాటిల్‌ను అందులో ద్రావణాన్ని వైద్యులు ల్యాబ్‌కు పంపించారు. మూడు నెలల తర్వాత రిపోర్టులు వస్తాయి. రిపోర్టు వస్తేగాని అసలు విషయం తేలిపోతుంది. అదే సమయంలో సదరు సెలైన్‌బాటిల్స్‌ను గాంధీ ఆసుపత్రికి సరఫరా చేస్తున్న ప్రెసినీయస్ జర్మనీకి చెందిన కంపెనీ, ఈ కంపెనీ ప్లాంట్ పుణెలో ఉంది, సంఘటన జరిగిన సమయంలో జర్మనీ నుంచి కంపెనీ వైస్‌చైర్మెన్ క్రిష్టన్‌చీర్ బృందం గాంధీ ఆసుపత్రికి వచ్చి సూపరింటెండెంట్ జెవి రెడ్డితో గతంలో సమావేశమై సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. పుణెలో ఉన్న ప్లాంట్‌లో సెలైన్‌బాటిల్ ద్రావణం 120 డిగ్రీల వద్ద నింపుతారని, అందులో ఎలాంటి పురుగు అవశేషాలు వచ్చే అవకాశం లేదని వివరించారు. తాము ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని, ఎప్పుడు పిలిచినా విచారణకు రానున్నట్లు తెలిపి వెళ్లిపోయారు. ఈ సంఘటనపై ముగ్గురు వైద్యులతో కూడిన వైద్యబృందం విచారణ చేపట్టింది. వారు సెలైన్‌బాటిల్‌లోని ద్రావణాన్ని పరీక్షల నిమిత్తం పంపించారు. రిపోర్డు వచ్చిన తర్వాతే అసలు విషయం వెల్లడవుతుంది. ఇదిలా ఉండగా చికిత్స పొందుతున్న చిన్నారి ప్రవల్లిక మృతి చెందడంతో పురుగు అవశేషంతో కూడిన సెలైన్‌ద్రావణాన్ని ఎక్కించారన్న కేసు ఉండడంతో పోస్టుమార్టం చేయడానికి వైద్యులు సిద్ధమయ్యారు. మృతురాలి తల్లిదండ్రులు తమ కూతురి మృతిపై ఎలాంటి ఫిర్యాదులు లేవని చెప్పడంతోపాటు రాతపూర్వకంగా వైద్యులకు రాసి ఇచ్చి చిన్నారి మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు. దీంతో గాంధీ ఆసుపత్రి వైద్యుల వివాదం గుట్టుచప్పుడు కాకుండా సద్దుమణగడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు బల్దియా ఏర్పాట్లు
వచ్చే నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ 9న పోలింగ్...15న కౌంటింగ్
మూడు జిల్లాల్లో 126 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
వీడియో కాన్ఫరెన్స్‌లో జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 7: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్(అవిభక్త)జిల్లా లు, కొత్తగా ఏర్పాటైన వాటితో కలిపి మొత్తం ఎనిమిది జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసిన శాసన మండలి ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎన్నికలు నిర్వహించేందుకు జిహెచ్‌ఎంసి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 18వ తేదీలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు జిహెచ్‌ఎంసి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 13న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్‌లో అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఈ నెల 20వరకు అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. 21న నామినేషన్ల పరిశీలన చేట్టనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు 23వరకు గడువునిస్తున్నట్లు జిహెచ్‌ఎంసి పేర్కొంది. వచ్చే నెల 9వ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించి, 15వ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నిక సందర్భంగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని తెలిపారు. అంతేగాక, ప్రజాప్రతినిధుల చట్టం 1951లో ఇటీవల చేసిన సవరణల ప్రకారం శాసన మండలి ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి పోటీ చేయదల్చిన అభ్యర్థులు రూ. పదివేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. అయిదు వేలను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
మొత్తం ఓటర్లు 23వేల 13 మంది
శాసన మండలి ఉపాధ్యాయుల నియోజవర్గం పరిధిలో టీచర్స్ ఓటర్లు మొత్తం 23వేల 13 మంది ఉన్నారని జిహెచ్‌ఎంసి కమిషనర్ తెలిపారు. ఈ మేరకు మండలి ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్ మాట్లాడుతూ మొత్తం ఓటర్లలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 6675 మంది ఓటర్లు, అలాగే రంగారెడ్డి జిల్లాలో 11వేల 832 మంది, హైదరాబాద్‌లో 4501 ఓటర్లున్నట్లు తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా మూడు జిల్లాల్లో కలిపి 126 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో హైదరాబాద్‌లో 22, మహబూబ్‌నగర్‌లో 57, రంగారెడ్డి జిల్లాలో 47 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటిల్లో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వౌలిక సదుపాయాలను సమకూర్చనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణకు గాను జోనల్ కమిషనర్లు, అసిస్టెంటు రిటర్నింగ్ ఆఫీసర్, పోలంగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్ల నియామకానికి చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు.

నిలొఫర్‌లో ఆగిన ఆపరేషన్లు
రక్తశ్యాంపిల్స్ సేకరణ
పరీక్షల కోసం ఐపిఎం, ఉస్మానియాకు నమూనాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 7: నిలొఫర్ ఆసుపత్రిలో వరుసగా అయిదుగురు బాలింతలు మృతి చెందిన ఘటనతో ఆసుపత్రిలో వైద్యులు కొన్ని రోజుల వరకు శస్తచ్రికిత్సలను నిలిపేశారు. ముఖ్యంగా సిజేరియన్ ఆపరేషన్లు వికటించి రోగులు మృతి చెందారన్న మృతుల బంధువుల ఆరోపణల నేపథ్యంలో ఆసుపత్రి వైద్యులు బాలింతల మరణానికి కారణాలేమిటీ? అన్న కోణంలో పరిశీలన ప్రారంభించారు. ముఖ్యంగా ఆపరేషన్ ధియేటర్లలో ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పరిశీలనలు కొనసాగించాలని ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు నిర్ణయించారు. ఇప్పటికే ఆపరేషన్ ధియేటర్లలోని గోడలు, టేబుళ్లు, శస్తచ్రికిత్సకు వినియోగించే పరికరాల నుంచే కాకుండా, రోగుల రక్త నమూనాలు తీసుకుని ఐపిఎంకు పంపారు. మరికొన్నింటిని ఉస్మానియా ఆసుపత్రికి పింపించారు. బాలింతల మృతికి ఔషధాలు పనిచేయకపోవటం కారణం కాదని భావిస్తున్న వైద్యులు రోగులకు ఎక్కించే సెలైన్‌లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వరుసగా అయిదుగురు బాలింతలు మృతి చెందక ముందు శస్తచ్రికిత్సలు చేయించుకున్న వారికి కూడా ప్రస్తుతమున్న మందులనివ్వటంతో పాటు ఇప్పటి వరకున్న సెలైన్లను ఎక్కించటం, వారు క్షేమంగా ఆరోగ్యంగానే ఉండటంతో వాటిల్లో ఇన్‌ఫాక్షన్ ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. అయితే వరుసగా అయిదుగురు బాలింతలు మృతి చెందిన ఘటనకు సంబంధించి వైద్యులు నిర్లక్ష్యం ఉందా? ఒక్కో బాలింతకు పది మంది జూనియర్ వైద్యులు శస్తచ్రికిత్సలు చేశారని కొందరు మృతుల బంధువులు ఆరోపించిన నేపథ్యంలో ఏ బాలింతను ఏ ఏ జూనియర్ డాక్టర్ పరిశీలించాడన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ప్రత్యామ్నాయ ఆసుపత్రులకు రోగులు
వరుసగా నిలోఫర్ ఆసుపత్రిలో బాలింతలు మృతి చెందటం పట్ల మెటర్నిటీ సేవల కోసం వచ్చే రోగులు ప్రత్యామ్నాయంగా ఇతర ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడి నుంచి సమీపంలో ఉన్న నాంపల్లి ఏరియా ఆసుపత్రితో పాటు మెటర్నిటీలో రాష్టవ్య్రాప్తంగా పేరుగాంచిన జజిఖానాకు రోగులు వస్తున్నారు. అయితే నిలోఫర్ ఆసుపత్రి శస్తచ్రికిత్సలను నిలిపివేయటంతో రోగులు ప్రత్యామ్నాయంగా సుల్తాన్‌బజార్ మెటర్నిటీ ఆసుపత్రి, పెట్లబురుజులోని జజిఖానా ఆసుపత్రులకు వెళ్తున్నారు.
పలువురి సందర్శన
వరుసగా బాలింతలు మృతి చెందిన నిలోఫర్ ఆసుపత్రిని మంగళవారం జస్టిస్ చంద్రకుమార్, ఇతర కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా సందర్శించారు. సర్కారు ఆసుపత్రుల్లో వైద్యం మెరుగుపడాల్సిన అవసరముందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. మృతి చెందిన బాలింతల కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ. పది లక్షల ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎల్లమ్మబండలో బడుగుల ఇళ్లు

కూల్చివేత.. ఉద్రిక్తత
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ, మైనంపల్లి

కెపిహెచ్‌బి కాలనీ, ఫిబ్రవరి 7: కూకట్‌పల్లి మండలం శంషీగూడ గ్రామం మహంకాళి నగర్ సర్వేనంబరు 57లో నివసిస్తున్న 80 గజాల ప్రభుత్వ స్థలంలో నివాసముంటున్న పేద కుటుంబంపై స్థానిక భూకబ్జాదారులు కూల్చివేసిన విషయం తెలుసుకున్న గ్రేటర్ హైదరాబాద్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు మాట్లాడుతూ తన భర్త లేని సమయంలో తనపై అసభ్యకరంగా ప్రవర్తించి భౌతిక దాడికి పాల్పడి ఇళ్లును కూల్చివేశారని కన్నీరు మున్నీరైంది. న్యాయం చేయాలని బాధితురాలు శ్యామల బోరున విలపించింది. స్థానిక జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి గతంలో సదరు ప్రైవేటు వ్యక్తులపై పలు కేసులు ఉన్నప్పటికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. అదే సమయంలో పోలీసు ఉన్నతాధికారులైన సిపి, డిసిపిలకు జరిగిన సంఘటన విషయాలను ఫోన్ ద్వారా ఎమ్మెల్యే గాంధీ వివరించారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని భూకబ్జా దారుల నుండి ప్రభుత్వ భూమిని రక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, నాయకులు కపిల్‌రాజు, సురేశ్‌రెడ్డి, సంజీవరెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.

సుల్తాన్ బజార్‌లో
భారీ అగ్నిప్రమాదం
విద్యుత్ షాక్‌తోనే ప్రమాదం
స్తంభించిన ట్రాఫిక్

హైదరాబాద్, ఫిబ్రవరి 7: హైదరాబాద్ నడిబొడ్డున గల సుల్తాన్ బజార్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం రాంకోఠిలోని ఓ భవనం మొదటి అంతస్తులో ఉన్న ‘ఏ వన్ గ్లాస్ వర్క్ ఫొటో స్టూడియో గోదాములో అగ్నిప్రమాదం సంభవించడంతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుంది. భవనం చుట్టూ మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఫొటోస్టూడియోకు సంబంధించిన సామగ్రి మొత్తం కాలి బూడిదైంది. సుల్తాన్‌బజార్-రాంకోఠి రద్దీ ప్రదేశం కావడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. రాంకోఠి వైపు వెళ్లే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో కాస్సేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ షాక్ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు సుల్తాన్ బజార్ పోలీసులు తెలిపారు.