హైదరాబాద్

నెలాఖరు కల్లా వసూళ్ల లక్ష్యం రూ. 100 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: జలమండలి ఆదాయాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించిన మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ ఈ నెలాఖరుకల్లా రూ. వంద కోట్ల కనీస లక్ష్యానికి తగిన విధంగా వసూళ్లు చేయాలని టార్గెట్ విధించారు. గురువారం కూడా ఆయన ఆపరేషన్, మెయింటనన్స్ సర్కిల్ 2,4,5లలో నిర్వహణ పనులు, రెవెన్యూ కలెక్షన్ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు నెలలుగా వరుసగా వాటర్ బిల్లు చెల్లించని కనెక్షన్లను కట్ చేయాలని సూచించారు. ఆరు నెలలుగా బిల్లులు చెల్లించని వారిని గుర్తించి, దీర్ఘకాలంగా పెద్ద మొత్తంలో బకాయిపడ్డ వారిని గుర్తించి వారి ఆఫీసులు, ఇళ్ల ఆవరణలో రెడ్ కార్నర్ నోటీసులు అంటించాలని అధికారులను ఆదేశించారు. బిల్లుల కలెక్షన్‌లో చూపే చొరవను ప్రజలకు మెరుగైన సేవలు అందించటంలోనూ చూపాలని చెబుతూ, తరుచుగా మురుగునీరు ప్రవహించే ప్రాంతాలు, సీవరేజీ వాటర్ లీకేజీ కాలుష్య సంబంధిత ఫిర్యాదులు అధికంగా వస్తున్న ప్రాంతాల్లో తగిన మరమ్మతులకు ప్రతిపాదనలు, అంచనాలను తమకు పంపితే వెంటనే మంజూరు చేస్తామన్నారు. అన్ని సర్కిళ్లకు సంబంధించి వచ్చే మార్చి నెలాఖరుకల్లా అన్ని కమర్షియల్ సంస్థల వాటర్ బిల్లులు వసూలు చేయాలని జనరల్ మేనేజర్లను ఆదేశించారు.
అప్పటికీ వ్యాపార సంస్థల వినియోగదారులు స్పందించని పక్షంలో జిహెచ్‌ఎంసిని సమన్వయం చేసుకుని, వారి ట్రేడ్ లైసెన్సులను రద్దు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బిల్లులు చెల్లించని నల్లా కనెక్షన్ల తొలగింపు ప్రక్రియ స్థితిని తెలుసుకునేందుకు ప్రధాన కార్యాలయం నుంచి ఒక ఆడిట్ బృందం తనిఖీ చేయాలని ఆదేశించారు. అలాగే వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని, నీటి కష్టాలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంతో ప్రణాళికలను సిద్దం చేయాలని ఆదేశించారు.