హైదరాబాద్

మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లకుంట, ఫిబ్రవరి 12: మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తద్వారా దేశ భవిష్యత్తుకు భంగం కలుగుతుందని అంబర్‌పేట ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం అంబర్‌పేట మహంకాళి ఆలయం వద్ద భారతీయ జనతాయువమోర్చా ఆధ్వర్యంలో ముస్లింలకు మతం పేరిట 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్లు కల్పించవద్దని రాజ్యాంగం సూచిస్తున్నప్పటికీ రాష్ట్రప్రభుత్వ0 కావాలనే రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన రిజర్వేషన్లపై రాజకీయంగా న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ముస్లిం రిజర్వేషన్లు 4 శాతం అమలు చేస్తే కెసిఆర్ ప్రభుత్వం ఏకంగా 12శాతం పెంచడం శోచనీయం అన్నారు. రిజర్వేషన్లు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోని యెడల వచ్చే మార్చి, ఏప్రిల్ నెలలలో తెలంగాణ వ్యప్తంగా ఇంటింటికీ వెళ్ళి సంతకాల సేకరణ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మొండివైఖని అవలంబిస్తే రాష్టవ్య్రాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని అన్నారు. యువమోర్చా గ్రేటర్ కార్యదర్శి మూల రవీందర్ గౌడ్, యువమోర్చా అసెంబ్లీ కన్వీనర్ పి.నాగరాజు చారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువమోర్చా నాయకులు నాయకులు యశ్వంత్, రంజిత్, ఎ.మహేష్, గోవింద్ అర్జున్, ఎస్.రాజేష్, మహిచంద్ర గౌడ్, కె.రవీందర్, శంకర్, కాంత్రి, బిజేపి నాయకులు గౌతమ్, ఎక్కాల నందు, కన్నా రమేష్ యాదవ్, సరళ చరేందర్ చుక్కా జగన్, ఎం.శ్యాంరాజ్, ఎస్.నర్సింగ్‌రావు, మధుయాదవ్‌లు పాల్గొన్నారు.

బిసిలకు చట్టసభల్లో
రిజర్వేషన్లు కల్పించాలి
ఖైరతాబాద్, ఫిబ్రవరి 12: దేశ జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ఎల్లాపువిశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ రావు మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా బిసిలు తీవ్ర వెనుకబాటును అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిసిలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్న పార్టీలు ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న అనంతరం విస్మరిస్తున్నాయని ఆరోపించారు. చట్టసభల్లో ప్రవేశించక పోవడమే బిసిలకు శాపంగా మారిందని, ఇప్పటికి అసెంబ్లీ, పార్లమెంట్ గడప తొక్కని బిసి కులాలు వందల్లో ఉన్నాయంటే ఆశర్యపోనక్కర్లేదన్నారు. సంచార జాతులుగా జీవిస్తున్న వారు కూడు, గూడుకు తపించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదా అని ప్రశ్నించారు. ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి బిల్లు పెట్టేలా ఒత్తిడి చేయాలని కోరారు. సమావేశంలో జనార్ధన్, నర్సింగ్‌రావు, రామచందర్ రావు, జీవన్‌రావు, రాఘవేంద్ర పాల్గొన్నారు.