హైదరాబాద్

ఒక అడుగు ముందుకి..రెండడుగులు వెనక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: నగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్, రద్దీ కారణంగా రోడ్డెక్కితే చాలు గమ్యం ఎపుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో నిత్యం రద్దీగా ఉండే పలు మెయిన్‌రోడ్లు, జంక్షన్లలో ఎలాంటి ఆటంకాల్లేకుండా సిగ్నల్స్ లేకుండా ప్రయాణించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి) కింద చేపట్టిన పనులు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్టు తయారయ్యాయి. జరిగే చోట్ల పనులు శరవేగంగా జరుగుతుండటంతో పాటు ప్రారంభం కాని చోట పనులకు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగటం లేదు. ఈ పనుల్లో భాగంగా కెబిఆర్ పార్కు చుట్టు ఆరు జంక్షన్లు, ఎల్బీనగర్‌లో నాలుగు జంక్షన్లు, ఉప్పల్ నుంచి రసూల్‌పురా మధ్యలో రెండు జంక్షన్లు, మైండ్ స్పేస్ టు జెఎన్‌టియు మధ్య నాలుగు జంక్షన్లతో మొత్తం 16 జంక్షన్ల అభివృద్ధికి అయిదు ప్యాకేజీలుగా టెండర్లను చేపట్టారు. ఇందులో కెబిఆర్ పార్కు చుట్టు చేపట్టాల్సిన పనులకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు ఉంది. మార్చి 1న మరోసారి విచారణకు రానున్నట్లు, ఈ సారి ట్రిబ్యునల్ తీర్పు జిహెచ్‌ఎంసి పనులు చేపట్టేందుకు అనుకూలంగా ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మైండ్ స్పేస్ నుంచి జెఎన్‌టియు వరకు అండర్ పాస్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు పనులు ఇంకా ప్రారంభించని బహద్దూర్‌పురా మల్టీలెవెల్ ఫ్లై ఓవర్ పనులను, ఎల్బీనగర్‌లో నాలుగు జంక్షన్ల అభివృద్ధి వంటి పనులను కూడా అధికారులు వచ్చే సంవత్సరం జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్పుకొస్తున్నారు.
త్వరలో పూర్తి కానున్న అయ్యప్ప సొసైటీ అండర్ పాస్
హైటెక్ సిటీ చౌరస్తాలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ఈ చౌరస్తా మీదుగా అయ్యప్ప సొసైటీ వైపు వెళ్లే వాహనాల కోసం అండర్‌పాస్‌ను ఏర్పాటు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. మొత్తం 750 మీటర్ల పొడువున నిర్మిస్తున్న ఈ అండర్ పాస్ ఇప్పటి వరకు 450 మీటర్ల మేరకు పూర్తయింది. అటు శిల్పారామం, అటు అయ్యప్ప సొసైటీ వెళ్లే దారిలోని హైటెన్షన్ టవర్లను తొలగిస్తే పనులు మరింత ఊపందుకోనున్నాయి. వీటిని ఇతర చోటుకు మార్చేందుకు ఇప్పటికే ట్రాన్స్‌కో రూ. 31 కోట్లను జమా చేసినట్లు అధికారులు తెలిపారు. ఎస్‌ఆర్‌డిపిలో ఈ అండర్ పాస్ అన్నింటి కన్నా ముందు, వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
స్థల సేకరణే ప్రధాన సమస్య
ఎల్బీనగర్‌లో ప్రధాన అడ్డంకిగా మారిన విగ్రహాలు
అయిదు ప్యాకేజీలుగా 16 జంక్షన్లను అభివృద్ధి చేయాలన్న ఎస్‌ఆర్‌డిపి పనులకు స్థల సేకరణే ప్రధాన అడ్డంకిగా మారింది. బయోడైవర్శిటీ పార్కు జంక్షన్‌లో నిర్మించే మల్టీలెవెల్ ఫ్లై ఓవరకు 15 ఆస్తుల నుంచి, ఓవైసీ ఆసుపత్రి జంక్షన్ వద్ద 11 ఆస్తులు, బహద్దూర్‌పురా ఫ్లై ఓవర్ కోసం 58 ఆస్తులు, ఎల్బీనగర్ బైరామల్‌గూడ జంక్షన్ అభివృద్ధి కోసం 31 ఆస్తుల నుంచి స్థలాలను సేకరించాల్సి ఉన్నా, వీటిలో బయోడైవర్శిటీ పార్కు జంక్షన్ స్థల సేకరణ కోసం గ్రామ సభను నిర్వహించారు. మిగిలిన వాటి స్థల సేకరణ ఇంకా ప్రారంభమే కాలేదు. ఎల్బీనగర్‌లో స్థల సేకరణకు ప్రముఖుల విగ్రహాలు ప్రధాన అడ్డంకిగా మారాయి. నాలుగో ప్యాకేజీ అయిన ఉప్పల్ నుంచి రసూల్‌పురా వరకు రెండు జంక్షన్ల అభివృద్ధి పనుల కోసం టెండర్లను ఆహ్వానిస్తే అసలు ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే ఈ కారిడార్‌లో సేకరించాల్సిన స్థలం మొత్తం కేంద్ర ప్రభుత్వానిది కావటంతో నిర్మాణ సంస్థలు ముందుకు రాలేదు. అలాగే కంచన్‌బాగ్‌లో కూడా జంక్షన్ అభివృద్ధి, మల్టీలెవెల్ ఫ్లై ఓవర్లకు స్థల సేకరణకు ప్రత్యామ్నాయ మార్గాలు అనే్వషించాలని మజ్లిస్ శాసన సభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఇక్కడ చేపట్టాల్సిన పనుల తాలుకూ టెండర్లను ఇప్పటికే ఖరారు చేసినా, పనులను అప్పగించకపోవటంతో నిర్మాణ సంస్థ కోర్టుకెళ్లే అవకాశం సైతం లేకపోలేదు.