హైదరాబాద్

కాస్త ముందు నుంచే భగభగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ప్రచండభానుడు ఈ సారి కాస్త ముందుగానే ప్రతాపాన్ని చూపుతున్నాడు. గడిచిన పక్షం రోజుల నుంచి నగరంలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత సెప్టెంబర్ మాసంలో కూడా అతి భారీ నుంచి భారీగా వర్షాలు కురిసిన మాదిరిగానే ఈ సారి ఎండాకాలంలోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం మరుసటి రోజుతో చలికాలం ముగిసి ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగేవని, ఈ సారి కాస్త ముందుగానే ఎండలు మండిపోతున్నాయని, ఫిబ్రవరిలోనే గరిష్ఠంగా 36 నుంచి 38 డిగ్రీల మధ్య, కనిష్ఠంగా 18డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువుతన్నాయంటే మున్ముందు ఎండలు మరింత మండిపోతాయోనంటూ నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచే ఎండ బారిన పడుకుండా పలువురు వాహనదారులు, పాదచారులు పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఉదయం ఏడు, ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు వాతావరణం కాస్త చల్లగా, ఆహ్లాదకరంగానే ఉంటున్నా, ఆ తర్వాత ఎండ మండిపోతోంది. కొద్దిరోజులుగా నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలిలా ఉన్నాయి. ఈ నెల 22న మధ్యాహ్నం ఉష్ణోగ్రత 38 డిగ్రీలుగా నమోదు కాగా, 4 గంటలకు 34 డిగ్రీలకు తగ్గింది. ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు 31 డిగ్రీలు, అలాగే రాత్రి పదకొండు గంటలకు 27 డిగ్రీలకు తగ్గింది. గురువారం ఉదయం పదకొండు గంటలకు 29 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం రెండు గంటల కల్లా 34 డిగ్రీలకు పెరిగింది. సాయంత్రం అయిదు గంటలకు 36 డిగ్రీలకు పెరిగింది. మున్ముందు ఎండలు మరెంత మండిపోతాయో వేచి చూడాలి!

కాచిగూడ రిలయన్స్ డిజిటల్‌లో అగ్నిప్రమాదం
కాచిగూడ, ఫిబ్రవరి 23: కాచిగూడలోని రిలయన్స్ డిజిటల్‌లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో విలువైన టివిలు(ఎల్‌సిడి) కంప్యూటర్స్, వాషింగ్ మిషన్స్‌తో పాటు పలు ఎలాక్ట్రానిక్ వస్తువులు కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని పోలీసులు అంచన వేస్తున్నారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
సంఘట వివరాలు స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడలో ఉన్న రిలయన్స్ డిజిటల్ స్టోర్ మేనేజర్ వెంకటరమణతో పాటు సెక్యూరిటీ గార్డ్ యాదవ్, వర్కర్లు మెహరాజ్, స్వాతి, రాఘవేంద్ర కలిసి రిలియన్స్ డిజిటల్ షాపును ఎప్పటిలాగే గురువారం ఉదయం 10 గంటల సమయంలో తెరిచారు. స్టోర్ రూమ్‌లో ఉన్న విద్యుత్ ఆన్ చేయగా ఒక్కసారి షార్ట్ సర్క్యూట్ సంభవించి దట్టమైన పొగాలు అలుముకున్నాయి. వెంటనే షాపులో ఉన్నవారు అంత ఒక్కసారి బయటకు వచ్చి జరిగిన విషయాన్ని అధికారులకు ఫోన్ ద్వారా వివరించారు. సమాచారం తెలుసుకున్న కాచిగూడ పోలీసులు హుటహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగల్లోకి దిగినా అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అర్పివేయడంతో పెనుప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంపై రిలయన్స్ డిజిటల్ యాజమాన్యన్ని వివరణ కోరగా దాటివేశారు. సంఘటన స్థలానికి జిహెచ్‌ఎంసి ఉప కమిషనర్ శైలజ, విద్యుత్ శాఖ అధికారి వేణు, బిజెపి నాయకుడు కనె్న రమేష్ యాదవ్, టిఆర్‌ఎస్ నాయకుడు రాజుగుప్త చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
షార్ట్ సర్క్యూట్ పై అనుమానం
రిలయన్ డిజిటల్‌లో సంభవించిన అగ్నిప్రమాదంపై ఫైర్ డిస్టిక్ట్ అఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మంటలు ఆర్పిన తరువాత మీడియాతో మాట్లాడుతూ రిలియన్ డిజిటల్ బిల్డింగ్‌లో ఫైర్ సేఫ్టీకి ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. అగ్నిప్రమాదంలో ఎటువంటి మంటలు రాలేదని కేవలం షార్ట్ సర్క్యూట్‌లో వచ్చిన పోగవల్లే ఆస్తి నష్టం జరిగిందన్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని తెలిపారు.