హైదరాబాద్

28న పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: ఆటోనగర్ జిఎల్‌ఎస్‌ఆర్ 1000ఎంఎం డయా ఇన్‌లెట్‌కు ఇంటర్ కనెక్షన్ పనుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 28వ తేదీన మంచినీటి సరఫరా ఉండబోదని జలమండలి అధికారులు తెలిపారు. నీటి సరఫరా ఉండని ప్రాంతాల వివరాలిలా ఉన్నాయి. వనస్థలిపురం ప్రాంతంలోని హిల్ కాలనీ, హుడాకాంప్లెక్సు, హుడా ఏ,బి, సి టైప్ క్వార్టర్స్, వనస్థలిపురం హిల్స్, క్రాంతిహిల్స్ ప్రాంతాలు, అలాగే ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లోని రైతుబజార్, ఇఎల్‌ఎస్‌ఆర్ ఏరియా, హైకోర్టు కాలనీ, భూలక్ష్మీనగర్, రాజప్పనగర్, కమలానగర్, ఎల్బీనగర్ ప్రాంతం పరిఋధిలోని మొత్తం మన్సూరాబాద్ డివిజన్, వడ్డెరబస్తీ, రాక్‌టౌన్‌కాలనీ, సాయినాథ్‌కాలనీ, సరస్వతినగర్, నువ్వుల బండా, సర్వే నెంబర్ 58, మారుతీనగర్ ఏరియాలోని మోహన్‌నగర్ విలేజి, ఎస్‌బిహెచ్‌కాలనీ, సిటివో కాలనీ, రాఘవేంద్రకాలనీ, సమతాపురికాలనీ, అలకాపురి ఏరియాలోని ఎన్టీఆర్ నగర్, రాజీవ్‌గాంధీనగర్, కృష్ణానగర్, శివమ్మనగర్, ఎల్బీనగర్ విలేజ్, భారతీనగర్, గ్రీన్‌హిల్స్‌కాలనీ, వాసనీ కాలనీ, లక్ష్మీనగర్, సరూర్‌నగర్ ప్రాంతంలోని భగత్‌సింగ్‌నగర్, లింగోజిగూడ, దానాపుర్, ఎస్‌బిహెచ్‌కాలనీ, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలోని హుడాకాలనీ, ఉప్పల్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని ప్రజలు తమ అవసరాలకు తగినన్ని నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.