హైదరాబాద్

నేడు ‘శైవ సిద్ధాంత దర్శిని’ గ్రంథావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: యం. వీరేశలింగశాస్ర్తీ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీ శైవమహాపీఠ పూర్వ పీఠాధిపతులు ముదిగొండ విరేశలింగశాస్ర్తీ ‘జీవితము-రచనలు-కృతులు’ పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథంలోని మూడవ భాగం ‘శైవ సిద్దాంత దర్శిని’ గ్రంథావిష్కరణ కార్యక్రమం నేడు నిర్వహించనున్నట్లు ట్రస్టు అధ్యక్షులు, మేనేజింగ్ ట్రస్టీ ఎంవి నాగరాజ్, కార్యదర్శి ఎస్.పి.అంబాప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సోమవారం సాయంత్రం అయిదున్నర గంటలకు న్యూ నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర మఠములో జరిగే సభను ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించనున్నట్లు తెలిపారు. నవలా చక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్ సభాధ్యక్షతన జరిగే కార్యక్రమానికి ఋషిపీఠం వ్యవస్థాపకులు, అధ్యక్షులు, ప్రముఖ ప్రవచనకారులు సామవేదం షణ్ముఖశర్మ ముఖ్య అతిధిగా విచ్చేసి గ్రంథావిష్కరణ గావించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల(వరంగల్) ప్రిన్సిపల్ డా.ఇవటూరి రామకృష్ణ చిత్రపటాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు గ్రంథావిష్కరణ అనంతరం తొలి ప్రతిని కందుకూరి బసవరాజు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. శ్రీ శైవమహాపీఠ పండిత మండలి సభ్యులు ముత్యంపేట గౌరీశంకర్ గ్రంథపరిచయం చేయగా, ఆంధ్రోపన్యాసకులు, శ్రీ శైవమహాపీఠ పండిత మండలి సభ్యులు ముదిగొండ అమరనాథశర్మ గ్రంథాన్ని సమీక్షించనున్నట్లు వెల్లడించారు. ఆవిష్కరించిన గ్రంథంపై ముదిగొండ భవాని స్పందన తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు.