హైదరాబాద్

మిలియన్ డాలర్ల ప్రాజెక్టు అంటూ మోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఆస్ట్రేలియాలో ఓ పెద్ద పరిశ్రమను స్థాపించబోతున్నామని పెట్టుబడులు పెడితే దండిగా లాభాలు గడించొచ్చంటూ.. నైజీరియన్లు హైదరాబాదీలకు కుచ్చుటోపీ పెట్టారు. సుమారు 55 వేల మిలియన్ డాలర్ల ప్రాజెక్టు అంటూ హైదరాబాద్ హఫీజ్‌పేట్‌కు చెందిన ఓ వ్యాపారిని కోటి రూపాయల మేరకు రాబట్టారు. అంతే కాకుండా ఈ వ్యాపారం ఫ్రాంచైజ్‌తో కూడుకుందని కూకట్‌పల్లి, టోలిచౌక్ ప్రాంతాలకు చెందిన దాదాపు వంద మంది దగ్గర మరో కోటి రూపాయల వరకు వసూలు చేశారు. గత రెండు నెలల క్రితం ఢిల్లీ కేంద్రంగా ఇద్దరు నైజీరియన్లు పక్కా ప్లాన్‌తో హైదరాబాద్ వ్యాపారులను మోసగించారు. నైజీరియన్లు సూచించిన ఖాతాలో డబ్బులు జమ చేసిన బాధితులు నైజీరియన్ల ఫోన్ నెంబర్లు స్విచ్చ్ఫా చేసి ఉండడంతో తాము మోసపోయామంటూ గత నెల 18న బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీ కేంద్రంగా సాగుతోన్న సైబర్ నేరస్థులను పసిగట్టారు. జోసెఫ్ ఇఫ్రా, వాజభ్‌విసా అనే ఇద్దరు నైజీరియన్లను సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిసింది. అయితే వీరిని ఢిల్లీ నుంచి ట్రాన్సిస్ట్ ఆర్డర్‌పై బుధవారం హైదరాబాద్‌కు తీసుకు వచ్చే అవకాశం ఉందని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

బిటెక్ విద్యార్థినితో అసభ్య ప్రవర్తన

హైదరాబాద్/హయత్‌నగర్, ఫిబ్రవరి 27: హైదరాబాద్ నగర శివారులోని ఓ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని పట్ల కళాశాల ప్రిన్సిపల్‌తోపాటు ఇద్దరు సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. విద్యార్థినుల పట్ల కళాశాల సిబ్బంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాల సిబ్బంది గత కొద్ది రోజులుగా ఓ బిటెక్ విద్యార్థిని పట్ల మానసికంగా, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సోమవారం ఉదయం పెద్దఎత్తున విద్యార్థులు ధర్నాకు దిగారు. దీంతో కళాశాల ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిటెక్ విద్యార్థిని పట్ల ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తించాడని, స్కాలర్‌షిప్‌ల విషయంలో ఫ్యాకల్టీ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్టు విద్యార్థులు ఆరోపించారు. బ్రిలియంట్ కళాశాలలో విద్యనభ్యసించి విద్యాసంవత్సరాన్ని పూర్తిచేసుకున్న సీనియర్లను యాజమాన్యం ఇదే కళాశాలలో ఎగ్జామినేషన్ విభాగంలోనూ టెక్నిషియన్, ల్యాబ్ అసిస్టెంట్‌గా నియమించుకుంది. కాగా వీరు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు ఫీజుల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. లెక్చరర్లు వారికి ఇష్టం ఉన్న విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేస్తున్నారని, ఇష్టం లేనివారికి తక్కువ మార్కులు వేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. ప్రభుత్వం స్కారల్‌షిప్‌లను విడుదల చేయకపోతే.. ఆ కోపాన్ని విద్యార్థులపై చూపిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో భోజనం సరిగ్గాలేదని, కళాశాలలో చేరే ముందు కనీస అవసరాలపై ఇచ్చిన హామీ ఏదీ అమలు కావడంలేదని విద్యార్థులు మండిపడ్డారు. బస్సు సౌకర్యం ఉచితం.. అని చెప్పి సంవత్సరం తర్వాత డబ్బులు కట్టాలని వేధిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు ఎగ్జామినేషన్ విభాగంలో పనిచేస్తున్న గోపి, సైదారెడ్డి, సుమన్‌లను హయత్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. సమాచారం తెలుసుకున్న కళాశాల చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి కళాశాలను సందర్శించారు. దీంతో విద్యార్థులు పెద్దఎత్తున నిరశన తెలియజేస్తూ విద్యార్థులను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కళాశాల చైర్మన్ స్పందిస్తూ, తమకు విద్యార్థులే ముఖ్యమని, విద్యార్థినులను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటానని, విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇదిలావుండగా కళాశాల సిబ్బంది, విద్యార్థుల మధ్య రాజీ కుదుర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.