హైదరాబాద్

మరో స్వైన్ ఫ్లూ బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లకుంట, ఫిబ్రవరి 28: నగరంలో రోజురో జుకూ స్వైన్ ఫ్లూ భయపెడుతుంది. వేసవి రాగానే అదుపులోకి వస్తుందనకున్న స్వైన్ ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. ఈనెల 24న జ్వరంతో గాంధీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందింది. దోమల్‌గూడకు చెందిన మహిళ(60) చికిత్సపొందుతూ మంగళ వారం ప్రాణం వదిలింది. జనవరి 1 నుంచి గాంధీ ఆస్పత్రిలో ఇప్పటి వరకూ చికిత్స పొందుతూ 13 మంది స్వైన్ ఫ్లూ బాధితులు మృతి చెందారు. ప్రస్తుతం 8 మంది స్వైన్‌ఫ్లూతో గాంధీలో చికిత్స పొందుతున్నారు. మరో ఆరుగురి స్వైన్ ఫ్లూ లక్షణాలు వున్నట్లు వైద్యులు గుర్తించినట్లు సమాచారం.

వెతుకులాట
డబుల్ బెడ్ రూం ఇళ్లకు స్థలాల కరవు
గుర్తించటంలో రెవెన్యూ అలసత్వం
త్వరలో కేంద్ర ప్రభుత్వ స్థలాల వివరాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 28: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం. ప్రతిపాదనల స్థాయి నుంచి ఇళ్లను నిర్మించాల్సిన స్థలాలు, ఆ తర్వాత పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ల కోసం, ఆ తర్వాత పనులు పూర్తి చేసేందుకు నిధుల కోసం వెతులాటగా మారింది. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా, ఏ ప్రభుత్వం చేపట్టిన తరహాలో తెలంగాణ రాష్ట్ర సిద్ధించిన తర్వాత స్వపరిపాలనలో ప్రభుత్వం 30 నెలల క్రితం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ హౌజింగ్ స్కీం కేవలం సికిందరాబాద్ ఐడిహెచ్‌కాలనీ నిర్మాణానికే పరిమితమైంది. ముఖ్యంగా ప్రభుత్వం 2019 సంవత్సరంలోపు రాష్టవ్య్రాప్తంగా 2లక్షల ఇళ్లను, ఒక్క జిహెచ్‌ఎంసి పరిధిలో లక్ష వరకు ఇళ్లను నిర్మించేందుకు సిద్దంగా ఉంది. ఇందుకు స్థలాల గుర్తింపు బాధ్యతను రెవెన్యూ అధికారులకు అప్పగించగా, వారు భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కూడా ప్రభుత్వ స్థలాలు కన్పించటం లేదు. సమైక్యాంధ్రలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రభుత్వం భూములను అమ్ముకోవటమే ఇందుకు కారణమన్న ఆరోపణల్లేకపోలేవు. ఈ ఇళ్ల స్థలాల గుర్తింపుకు సంబంధించి ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి వత్తిళ్లు రావటంతో అధికారులు పలు స్థలాలను గుర్తించినా, వాటికి సంబంధించి కోర్టుల్లో కేసులుండటంతో ఆ స్థలాల్లో నిర్మాణం చేపట్టేందుకు జిహెచ్‌ఎంసి, ఆ బాధ్యతను తీసుకునే కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన స్థలాల్లో వీటి నిర్మాణం చేపట్టాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి సికిందరాబాద్, నాంపల్లి ప్రాంతాల్లో ఖాళీగా పడి ఉన్న రైల్వే భూములను తమకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు మంత్రి కెటిఆర్ సిద్దమైంది. ఇందుకు సంబంధించి స్థలాలను గుర్తించే బాధ్యతను జిహెచ్‌ఎంసికి అప్పగిస్తూ స్థలాల నివేదికను వారంలోపు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివాదాల్లేని స్థలాలను మాత్రమే గుర్తించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు అధికారులు ఎంత వెతికినా ప్రభుత్వ స్థలాలు లేకపోవటంతో ఇక ఉన్న మురికివాడల్లోనే ఈ ఇళ్లను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దీనినకి కూడా అక్కడి స్థానికులు తొలుత అంగీకరించి, ఆ తర్వాత నిరాకరించే అవకాశముండటంతో జిహెచ్‌ఎంసి అధికారులు తొలుత వారికి కౌనె్సలింగ్ నిర్వహించి, వారు సిద్దంగా ఉన్నట్లు లిఖితపూర్వకంగా రాయించుకుంటున్నారు. ఈ రకంగా అష్టకష్టాలు పడి ఓ అరడజను ప్రాంతాల్లో ఈ ఇళ్ల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించగా, ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రావటం లేదు. పైగా నగరంలో చిన్న చిన్న ఇళ్లను నిర్మించేందుకు ప్రైవేటు కాంట్రాక్టర్లు ఒక చరదపు అడుగు నిర్మాణానికి రూ. 1100లకే ముందుకొస్తుండగా, ఈ ఇళ్లకు ప్రభుత్వం రూ. 1400లను కేటాయించినా ముందుకు రాకపోవటం గమనార్హం. దీంతో సర్కారు చిన్న కాంట్రాక్టర్లు కూడా ముందుకు వచ్చేందుకు వీలుగా టెండర్ విధానాన్ని సరళీకృతం చేయటంతో మరీ పనులు ప్రారంభించేందుకు మొబలైజేషన్ నిధుల్లేని కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారు. ఈ రకంగా స్థలాల గుర్తింపు మొదలుకుని కాంట్రాక్టర్లు, ఆ తర్వాత పనులు పూర్తి చేసేందుకు టెండర్ల కోసం వెతుకులాటలోనే ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రతిపాదన మగ్గుతోంది.