హైదరాబాద్

వాటర్ కనెక్షన్ల తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: ఆర్థిక సంవత్సరం ముగింపు ముంచుకురావటంతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జలమండలి, జిహెచ్‌ఎంసిలు రెవెన్యూ పెంచుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా నగరంలో ఉన్న సుమారు 9లక్షల 8వేల వాటర్ కనెక్షన్లను ప్రతి ఒక్కదాన్ని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసేందుకు జలమండలి సిద్దమైంది. ఇందుకు గాను జిహెచ్‌ఎంసి వినియోగించిన చిట్కాను వినియోగించేందుకు సిద్దమైంది. జిహెచ్‌ఎంసి పరిధిలో కూడా సుమారు 13లక్షల పై చిలుకు ఆస్తిపన్ను ఖాతాలున్నా, వాటిలో రెసిడెన్షియల్ భవనాలే ఎక్కువ ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కొంతకాలం క్రితం జిహెచ్‌ఎంసి అధికారులు విద్యుత్, కమర్షియల్ ట్యాక్సు విభాగాల నుంచి డేటా తెప్పించుకుని, దాని ప్రకారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించగా, లక్షల సంఖ్యలో భవనాలు కమర్షియల్‌గా వినియోగమవుతూ, జిహెచ్‌ఎంసికి రెసిడెన్షియల్ పన్ను చెల్లిస్తున్న విషయం బయట పడింది. ఇలాంటి ప్రయోగానే్న మళ్లీ వ్యాపార సంస్థలపై చేయగా, ట్రేడ్ లైసెన్సుల్లేని సంస్థలెన్నో వెలుగుచూశాయి. ఇపుడు జలమండలి కూడా ఇదే బాటను పట్టేందుకు, అలాంటి చిట్కాను ప్రయోగించేందుకు సిద్ధమైంది.
ఇందుకు గానుప్రతి వాటర్ కనెక్షన్‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఎండి దాన కిషోర్ ఇప్పటికే ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించారు. ప్రస్తుతమున్న 9.08లక్షల వాటర్ కనెక్షన్లలో 30వేల 589 కనెక్షన్లు నాన్ డొమెస్టిక్, కమర్షియల్ కనెక్షన్లున్నట్లు అధికారులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తే ఈ కమర్షియల్, నాన్ డొమెస్టిక్ కనెక్షన్లు మరిన్ని బయటపడే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు గాను ఇప్పటికే ఇతర శాఖల నుంచి సేకరించిన డేటాబేస్, జలమండలి వద్దనున్న డేటా బేస్ ఎంత వరకు మ్యాచ్ అవుతుందన్న విషయాన్ని తేల్చేందుకు తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ సేవలను వినియోగించుకోనుంది. త్వరలోనే బంజారాహిల్స్‌లో కూడా ఇలాంటి క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఒక్కరోజు నిర్వహించిన తనిఖీల్లోనే 19 మంది అధికారులు 425 తనిఖీలు నిర్వహించి, ఇందులో 136 కనెక్షన్లను (32 శాతం) డొమెస్టిక్ నుంచి కమర్షియల్‌కు మార్చాల్సి ఉన్నట్లు గుర్తించారు.