హైదరాబాద్

గిర్మాపూర్‌లో టిఎస్‌ఐఐసి ఇండస్ట్రీస్ పార్కు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 4: మేడ్చల్ మండలంలోని గిర్మాపూర్ గుట్టల్లో గల వందలాది ఎకరాల ప్రభుత్వ స్థలాలను ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్టు టిఎస్‌ఐఐసి ఎండి నర్సింహారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. శనివారం వారు గిర్మాపూర్ గుట్టల్లోని సర్వే నంబరు 345లో గల 399.11 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే నంబరు 345లో గల ప్రభుత్వ భూమిని గుర్తించి వాటికి సంబంధించిన పూర్తి వివరాలను స్థానిక రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గిర్మాపూర్ గుట్టల్లో గల ప్రభుత్వ భూమికి ఎటునుండి ఏఏ రహదారులు ఉన్నాయని ప్రధాన రహదారి ఎంత దూరంలో ఉంటుందని చుట్టుపక్కల ఎటువంటి పరిశ్రమలు వెలిసాయని ఇక్కడి నుండి జిల్లా సరిహద్దు ఎంత దూరంలో ఉంటుందని రైల్వేలైను ఎక్కడ ఉంది తదితర వివరాలను వారు సవివరంగా అడిగి తెలుసుకున్నారు. పూర్తి భూమి ప్రభుత్వ అధీనంలోనే ఉందా క్వారీలకు ఎంత భూమిని కేటాయించారు తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. సర్వే నంబరు 345లో కొంత భూమిని క్వారీలకు మరో 5 ఎకరాలు మిషన్ భగీరథకు కేటాయించినట్లు తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి ధ్రువీకరించగా వెంటనే స్పందించిన కలెక్టర్ క్వారీలకు లీజుకు ఇచ్చిన భూమిని అవసరమైతే వెనక్కు తీసుకోవచ్చునని స్పష్టం చేశారు.
భూమికి సంబంధించిన పూర్తి వివరాలను గూగుల్‌లో పొందుపర్చాలని టిఎస్‌ఐఐసి ఎండి నర్సింహ్మరెడ్డి తహశీల్దార్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి మాట్లాడుతూ గిర్మాపూర్ గుట్టలో ఉన్న ప్రభుత్వ భూమిని దేనికి అనుకూలంగా ఉంటే దానికి ఉపయోగిస్తామని వివరించారు. చుట్టు పక్కల విత్తనాల పరిశ్రమలు అధికంగా విస్తరించి ఉండటంతో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ గాని లేక ఫుడ్ ఇండస్ట్రీస్ గాని లేదా హౌసింగ్ కోసం గాని ఉపయోగిస్తామని పేర్కొన్నారు. ఈ అంశం ఇంకా పరిశీలన దశలోనే ఉన్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రాథమిక అంచనా కోసం భూమిని పరిశీలించినట్లు తెలిపారు. కాగా గిర్మాపూర్ గుట్ట సర్వే నంబర్ 345లో టిఎస్‌ఐఐసి ఇండస్ట్రీస్ పార్కు ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే టిఎస్‌ఐఐసి ఎండి భూమిని స్వయంగా పరిశీలించి అన్ని వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. కార్యక్రమంలో కీసర డివిజన్ ఆర్డీఓ హన్మారెడ్డి, గిర్ధావర్ నాగజ్యోతి, విఆర్‌ఎ భారత, గ్రామస్థులు ఆనంద్, రాజిరెడ్డి, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.