హైదరాబాద్

తీరని కరెన్సీ కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, మార్చి 5: ఏటిఎంల్లో మారని సాఫ్ట్‌వేర్.. పనిచేసే ఏటిఎంలలో నోక్యాష్‌బోర్డులు.. పెద్ద మొతం విత్‌డ్రాలతో గంటల్లో నగదు ఖాళీ అవుతున్న నేపధ్యంలో నగర ప్రజలకు ఇంకా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. ప్రధాన రహదారులు, వ్యాపార, వాణిజ్య పరిసర ప్రాంతాల ఏటిఎంలలో మినహా బస్తీలు, శివారు ప్రాంతాల్లోని ఏటిఎంలలో నగదు నేటికి అందుబాటులోకి రాలేదు. ఇక కొన్ని ప్రాంతాల్లోని ఏటిఎంలలో వారానికోసారి మాత్రమే నగదు నింపే దుస్థితి నెలకొంది. వారం రోజులుగా నగర ప్రజలను కరెన్సీ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ, కార్పోరేట్ ఉద్యోగుల వేతనాలు నేరుగా బ్యాంకు అకౌంట్లలోనే పడుతుంటాయి. నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు ఎత్తివేయడంతో ఉద్యోగులు ఏటిఎంలలో నుంచి పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేస్తున్నారు. దీంతో రెండు గంటల్లోపే నగదు ఖాళీ అవుతుంది. దీంతో సామాన్య, మద్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. నిన్నమొన్నటి వరకు 2వేల నోటుకు చిల్లర దొరక ఇబ్బంది పడ్డ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో తిరిగి నగదు కొరత ఏర్పడటంతో ఆందోళనకు గురవుతున్నారు. నగరంలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఏటిఎంలు అందుబాటులోకి రాలేదు. మరోవైపు ఉన్న ఏటిఎంలలో నగదు అందుబాటులో ఉండక పోవడంతో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు వర్ణనాతీతం, నగరంలో దాదాపు 50 శాతం పై చిలుకు ఏటిఎం కేంద్రాల వద్ద నోక్యాష్, ఔట్ ఆఫ్ ఆర్డర్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. చాలా వరకు ఏటిఎంలలో ఇంకా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. ఆన్‌లైన్ లావాదేవీలను మెరుగు పరిచేందుకే ఉద్దేశపూర్వకంగా కృత్రిమ నగదు కొరతను సృష్టిస్తున్నారని పలువురు ఖాతాదారులు వాపోతున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చార్జీల మొతకు సిద్ధమైంది. నగదు డిపాజిట్లు, ఏటిఎంల నుంచి నగదు విత్‌డ్రాలపై అంక్షలు విధించనుంది. మినిమం అకౌట్ బ్యాలెన్స్ ఉండని పక్షంలో చార్జీల మోత మోగించనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోనికి రానుండటంతో ఆన్‌లైన్ లావాదేవీల వైపు ప్రజలు ఇప్పటి నుంచే మొగ్గుచూపుతున్నారు. బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలపై అంక్షలు అమలు కానున్నాయి. విత్‌డ్రాలు నెలకు ఐదు సార్లు దాడితే, డిపాజిట్లు మూడు సార్లు దాటితే ఆపై చార్జీల మోత మోగనుంది.