హైదరాబాద్

కాస్త ముందుగానే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి..వాతావరణంలో విచిత్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు అప్రమత్తంగా ఉండటం అవసరమని సమన్వయ కమిటీ ఉన్నతాధికారుల బృందం నిర్ణయించింది. విపత్తుల సమయంలో అన్ని విభాగాలు కలిసి మరింత సమన్వయంతో పనిచేయటంతో పాటు తాము నిర్వర్తించాల్సిన పాత్రను స్పష్టంగా నిర్దారించుకోవాలని కూడా పేర్కొంది. సైబరాబాద్ పోలీస్ కమిషర్నేట్‌లో కన్వర్జెన్సీ సమావేశం జరిగింది. ప్రస్తుత వేసవికాలంలో, రానున్న వర్షాకాలంలో ఎదురుకానున్న విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తక్షణమే స్పందించి నివారణ చర్యలు చేపట్టడానికి స్పష్టమైన విధి విధానాలను రూపొందించుకోవాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇప్పటికే అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రధానంగా అగ్నిప్రమాదాలు జరగటానిక అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, ప్రమాద నివారణ చర్యలను చేపట్టాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచించారు. గత భారీ వర్షాల కారణంగా 2793 ప్రాంతాల్లో నీరు నిల్వం వంటి ఫిర్యాదులు అందాయని తెలిపారు. అయితే జిహెచ్‌ఎంసి పరిధిలో 27 ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచే అవకాశమున్నట్లు గుర్తించామని, వీటిలో 12 పాయింట్లకు నీరు నిల్వకుండా తగిన చర్యలు చేపట్టినట్లు, మిగిలిన ప్రాంతాల్లో కూడా పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, ట్రాఫిక్ అదనపు జాయింట్ కమిషనర్ జితేందర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, రంగారెడ్డ జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు,మేడ్చల్ కలెక్టర్ ఎం.వి.రెడ్డిలతో పాటు వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో భాగంగా వాతావరణ శాఖ, జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో విపత్తుల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది.
జిహెచ్‌ఎంసి ప్రత్యేక ‘పోర్టల్’
విపత్తుల కాలంలో ఎపుడు ఎలాంటి పరిస్థితులు సంభవించినా తక్షణమే స్పందించేందుకు వీలుగా వాట్సప్ గ్రూప్‌లను ఏర్పాటు చేశామన్నారు. విపత్తులకు సంబంధించి వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య చక్కటి సమన్వయం కోసం ప్రత్యేక కన్వర్జెన్సీ పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు, దీన్ని ప్రతి శాఖ కూడా వినియోగించుకోవాలన్నారు. ఇటీవల నానక్‌రాంగూడలో బహుళ అంతస్తు భవనం కూలిన ఘటనను గుర్తుచేస్తూ ఇలాంటి ఘటనలు జరిగినపుడు ఎలా స్పందించాలన్న విషయం అన్ని ప్రభుత్వ శాఖలకు ఓ పాఠంగా నిల్చిందన్నారు.
నగరంలో భూ క్రమబద్దీకరణ, భవన నిర్మాణ అనుమతుల మంజూరు, ప్రభుత్వ, ప్రభుత్వేతర భూములకు సంబంధించి వివరాల సమాచారాన్ని రెవెన్యూ, జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ విభాగాలు పరస్పరం అందజేసుకోవాలన్నారు.
వెయ్యి 50కి.మీ.ల మేర
హడ్కో ప్రాజెక్టు పూర్తి
శివార్లకు తాగునీటిని అందించేందుకు జలమండలి హాడ్కో నిధులతో చేపట్టిన ప్రాజెక్టు పనులు మొత్తం 1700 కిలోమీటర్ల మేర చేపట్టగా, ఇప్పటి వరకు వెయ్యి 50 కిలోమీటర్ల మేరకు పూర్తయినట్లు సమావేశంలో జలమండలి అధికారులు వెల్లడించారు. వర్షాకాలం సందర్భణగకా నగరంలో నీటి నిల్వలు ఏర్పడే 700 ప్రాంతాలను గుర్తించామని, సీవరేజీ, పైప్‌లైన్ల నిర్వాహణకు 78 ఎయిర్‌టెక్ మిషన్లను కొత్తగా సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు.