హైదరాబాద్

ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్ధమవుతున్న కౌన్సిల్ హాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రెండో పాలక మండలి ఎన్నిక కావటంతో అధికారులు కౌన్సిల్ హాల్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఈ నెల 11వ తేదీన ఉదయం పదకొండు గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక, అదే రోజు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకరోత్సవానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మేయర్ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ప్రిసైడింగ్ అధికారిగా నియమితులైన హైదరాబాద్ కలెక్టర్ రాహూల్ బొజ్జ ఈ నెల 11వ తేదీన జరగనున్న మొట్టమొదటి పాలక మండలి సమావేశం, మేయర్ ఎన్నికకు సభ్యులు హాజరుకావాలని నోటీసులు పంపారు. మేయర్ ఎన్నికకు మూహర్తం దగ్గరపడుతుండటంతో అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. 2014 నవంబర్ నుంచి ఖాళీగా ఉన్న కౌన్సిల్ హాల్‌ను శుభ్రపర్చటం, రంగులు వేయటం, మేయర్ సీటు, కార్పొరేటర్ల సీటును ఏర్పాటు చేసే పనులు చేపట్టారు.
ముఖ్యంగా గతంలోనే ఆధునిక హంగులతో నిర్మించిన ఈ కౌన్సిల్ హాల్‌లో ఈ సారి పబ్లిక్ అడ్రస్ సిస్టం ను పూర్తి స్థాయిలో ఆధునీకరించే పనులు చేపట్టినట్లు, ఈ పనులన్నీ పూర్తి చేసి ఈ నెల 10వ తేదీలోపు హాల్‌ను అందుబాటులకో తెస్తామని అధికారులు చెబుతున్నారు.
అయిదు వారాల తర్వాత మళ్లీ..!
జిహెచ్‌ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి అయిదు వారాల తర్వాత అధికారులు సోమవారం నిర్వహించారు. దీనికి నగర ప్రజల నుంచి చక్కటి స్పందన వచ్చిందని కార్యక్రమాన్ని నిర్వహించిన అదనపు కమిషనర్(పరిపాలన) రామకృష్ణరావు, రవికిరణ్(హెల్త్,శానిటేషన్), సిటీ చీఫ్ ప్లానర్ దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఇకపై ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.
మేయర్ వోఎస్డీగా సత్యనారాయణ
ఈ నెల 11న ఎన్నుకోనున్న మేయర్‌కు అధికారులు సోమవారం వోఎస్డీని నియమించారు. సోమవారం కమిషనర్ జనార్దన్‌రెడ్డి పలువురు డిసిలకు స్థానం చలనం కల్గిస్తూ జారీ చేసిన ఆదేశాల్లో భాగంగా ఈ నియామకం జరిగింది. ప్రస్తుతం కాప్రా సర్కిల్‌లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణను కొత్త మేయర్ వోఎస్డీగా నియమించారు. ప్రధాన కార్యాలయంలో ఎస్టేట్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తున్న సరోజను ఆయన స్థానంలో కాప్రా డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. సత్యనారాయణ గతంలో 2002 నుంచి 2007 వరకు మేయర్‌గా వ్యవహారించిన తీగల కృష్ణారెడ్డికి వోఎస్డీగా వ్యవహారించిన సత్యనారాయణను కొత్త మేయర్‌కు మరోసారి వోఎస్డీగా నియమిస్తూ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ బి. గీతారాధికను ప్రధాన కార్యాలయంలోని సుపరిపాలన విభాగానికి జాయింట్ కమిషనర్ నియమించారు. గీతారాధిక స్థానంలో నళినీ పద్మావతిని డిసిగా నియమించారు. చీఫ్ వాల్యుయేషన్ ఆఫీసర్‌గా ఉన్న సుధాంశ్‌కు ఎస్టేట్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు.
డివిజన్ అభివృద్ధికి బస్తీబాట
ఆదరించిన
ప్రజలను మరవద్దు
ఎంత ఎదిగినా
ఒదిగి ఉండాలి
హోం మంత్రి నాయిని
ఉప్పల్, ఫిబ్రవరి 8: ప్రభుత్వ అండతో డివిజన్ అభివృద్ధికి భర్తతో కలిసి బస్తీబాట పట్టాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఉప్పల్ డివిజన్ కార్పోరేటర్ మేకల అనలా హన్మంత్‌రెడ్డికి నిర్వహించిన అభినంద సభలో నాయిని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆదరించిన ప్రజలను మరవకుండా బస్తీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం శ్రమించాలని పేర్కొన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి పనిచేస్తూ ప్రజావిశ్వాసాన్ని చూరగొనాలే తప్ప గర్వంగా ఉండవద్దన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ ఉప్పల్‌ను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన నేపధ్యంలో అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని తెలిపారు.
మేడ్చల్ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి, ఎంఎల్‌సి పల్ల రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అహర్నిశలూ పని చేయాలన్నారు. డివిజన్ కార్పొరేటర్ మేకల అనలారెడ్డి మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను తుచ తప్పకుండా నెరవేరుస్తానని పేర్కొన్నారు. తన విజయానికి సైనికుల్లా పని చేసిన పార్టీ శ్రేణులను మరవనని, డివిజన్ బస్తీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. టిఆర్‌ఎస్ నాయకుడు అరటికాయల భాస్కర్ అధ్యక్షతన జరిగిన సభలో టిఆర్‌ఎస్ ఇంచార్జి బేతి సుభాష్‌రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గంలోని ఎంపిలు, జడ్పీటిసి, ఎంపిటిసిలు, నేతలు పాల్గొన్నారు.

సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి
తాండూరు, ఫిబ్రవరి 8: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి ఉద్ఘాటించారు. సోమవారం పెద్దెముల్ మండలంలోని పలు గ్రామాల్లో రూ.కోటీ ఇరవై లక్షల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు. అనంతరం కోట్‌పల్లి, మారేపల్లి, జనగాం, రుక్మాపూర్ గ్రామాల సభల్లో మంత్రి ప్రసంగిస్తూ, గతంలో తెలంగాణలో ఏ ప్రభుత్వాలు చేయని బృహత్తరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నది తమ ప్రభుత్వమే అన్నారు. దీంతో అన్ని ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని, ప్రజల రుణం తీర్చుకోడానికి సిఎం కెసిఆర్, మంత్రివర్గం కట్టుబడి వున్నామని అన్నారు. మన రాష్ట్రం, మన అభివృద్ధి, మన సంక్షేమం లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. అన్ని పథకాలు అమలు చేయడం తమ బాధ్యతని, ఈ నెలాఖరుకు రాష్ట్రం అంతటా రెండవ విడత మిషన్ కాకతీయ పనులకు శ్రీకారం చుడతామని మంత్రి వెల్లడించారు. మంత్రితోపాటు మండల ఎంపిపి, తహశీల్దార్, ఎంపిడిఓ, జడ్పీటిసి ఇతర నేతలు పాల్గొన్నారు.

గెలుపు మరింత బాధ్యతను పెంచుతుంది
ఎంపి నర్సయ్యగౌడ్
సైదాబాద్, ఫిబ్రవరి 8: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో గెలుపు ప్రజాభివృద్ధి పట్ల నాయకుల బాధ్యతను మరింత పెంచుతుందని భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. సోమవారం సైదాబాద్ ఎల్‌సిహెచ్‌కాలనీ కమ్యూనిటీహాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతా శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో డివిజన్ ఇంచార్జ్‌గా వ్యవహరించి సైదాబాద్‌ను దత్తత తీసుకుంటానని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఎర్రగుంట శ్మశానవాటిక సమస్య ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టిలో ఉన్నదని ఎర్రగుంట సమాగ్రాభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సైదాబాద్ డివిజన్‌లో మంచినీరు, రహదారులు, డ్రైనేజీల వంటి వౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ప్రతి నెలలో ఒకరోజు డివిజన్‌లో పర్యటిస్తానని హామీ ఇచ్చారు.
కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలుపునిచ్చిన డివిజన్ వాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాని అన్నారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ నాయకులు సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, లింగాల హరిగౌడ్, కె.్భమేశ్వర్, కె.్ధర్మరాజు. పొదిళ్ళ శ్రీ్ధర్, బాలకృష్ణగౌడ్, నిమ్మల నరేందర్‌గౌడ్ పాల్గొన్నారు.

ఇక న్యాయపోరాటం
ఓడినా ప్రజల వెంటే ఉంటాం
టిడిపి అభ్యర్థి కందికంటి మంజుల
ఉప్పల్, ఫిబ్రవరి 8: గ్రేటర్ ఎన్నికల్లో ఈవీఎంలలో జరిగిన అన్యాయాలపై న్యాయపోరాటం చేస్తామని ఉప్పల్ టిడిపి అభ్యర్థి కందికంటి మంజుల అశోక్‌గౌడ్ అన్నారు. సోమవారం ఇక్కడ పార్టీ నేతలు కల్లూరి వేణు, పబ్బతి శేఖర్‌రెడ్డి, ప్రకాష్, మహేందర్, బిక్షపతి, చిలకమ్మతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ డివిజన్‌లో టిడిపికి బలమైన ఓటుబ్యాంక్ ఉందన్నారు.
గత టిడిపి ప్రభుత్వ హయాంలో అప్పటి హోంశాఖ మంత్రి టి.దేవేందర్‌గౌడ్ వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలు, క్రిస్టియన్లు, కాలనీ సంక్షేమ, యువజన, మహిళా, కుల సంఘాల ప్రజలు టిడిపి వైపు ఉన్నారని పేర్కొన్నారు. ఓటింగ్ సరళిని బట్టి టిడిపికి అనుకూలంగా ఓట్లు వచ్చాయని భావిస్తే తీరా పోలింగ్ ఫలితాలు ఈవీఎంలలో మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులను పక్కనబెట్టి టిడిపి, బిజెపి, కాంగ్రెస్ ఓట్లను కొల్లగొట్టి టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చేలా ఈవీఎంలను టాంపరింగ్ చేసినట్లు అనుమానం కల్గుతుందన్నారు. పథకం ప్రకారం ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌తో కుమ్ముక్కై టిఆర్‌ఎస్‌కు అధికంగా ఓట్లు వచ్చేలా ఈవీఎంలను గోల్‌మాల్ చేసినట్లు స్పష్టమవుతుందన్నారు. టిడిపి, బిజెపి అభ్యర్థులపై నిఘాపెట్టి ప్రజల్ని బెదిరిస్తూ అవసరమైతే డబ్బులు పంపిణీ చేసి ఓటర్లను అనుకూలంగా ఉండేలా మంత్రులు, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులను దింపారని ఆరోపించారు. తమ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లు ఎక్కడపోయాయని ధ్వజమెత్తారు. ఈవీఎంలలో జరిగిన గోల్‌మాల్‌పై ప్రజల మద్ధతుతో కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఓడినా ప్రజల వెంటే ఉంటూ సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు.
అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికే
కుమారుడికి మరో మంత్రి పదవి ఇచ్చారా?
మంద కృష్ణమాదిగ
సికింద్రాబాద్, ఫిబ్రవరి 8: తెలంగాణలో సమర్ధులైన నాయకులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుమారుడు కెటిఆర్‌కు మరో మంత్రిత్వ శాఖను అప్పగించి అధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నాడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. సోమవారం సికింద్రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఆగ్రస్థానంలో ఉండి కీలకంగా పని చేసిన దళిత నాయకులను సిఎం కెసిఆర్ పక్కన బెట్టారని ఆరోపించారు. స్వయంగా సమావేశంలో కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్‌కు మంత్రి పదవులు కేటాయిస్తామన్న సిఎం ఎందుకు పదవులను కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సిఎం కడియం శ్రీహరికి సాంఘిక శాఖను ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి, బిజెపి కొట్టుకపోవడం సరే మరి ఎంఐఎం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఎంఐఎంకు ఉన్న స్థానాల్లో గెలుపొందడమంటే వారితో కెసిఆర్‌కు ఉన్న రహస్య ఒప్పందమేనని పేర్కొన్నారు. కెసిఆర్ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఎమ్మార్పీఎస్ పోరాడిన ఫలితాలేనని మంద కృష్ణ సగర్వంగా ప్రకటించుకున్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్ల కోసం తాము రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలేనని గుర్తుచేశారు. దళిత ఉద్యమకారులను కేసిఆర్ గుర్తించాలని డిమాండ్ చేశారు.