హైదరాబాద్

ధర్నా చౌక్ తరలిస్తే ఉద్యమమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిక్కడపల్లి, మార్చి 16; తెలంగాణ ఉద్యమవేదిక అయిన ధర్నా చౌక్ ను తరలిస్తే మరో ఉద్యమం చేపడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ హెచ్చరించారు. గురువారం బిజెపి శాసనసభ్యులతో కలసి ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌లో విధించిన నిషేధాన్ని నిరసిస్తూ ధర్నాచౌక్ నుండి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి వినిపించేందుకు ధర్నా చౌక్‌కు వస్తూ ఉంటే కెసిఆర్ నియంతృత్వ ధోరణిలో ఒంటెద్దు పోకడ పోతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు నిరసనలు తెలియచేయకుండా అడ్డుకోవటం దారుణమని అన్నారు. బిజెపి శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి బీజం వేసిన ధర్నాచౌక్‌ను తరలిస్తే అన్ని ప్రజాసంఘాలను, పార్టీలను, ప్రజలను కలుపుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని అన్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి రామచందర్ రావు, స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.

ముస్లిం కుటుంబాల స్థితిగతులపై
బిసి కమిషన్ అధ్యయనం

హైదరాబాద్, మార్చి 16: వెనుకబడిన ముస్లిం కుటుంబాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర బిసి కమిషన్ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో నివసించే పేద ముస్లిం స్థితిగతులను మెరుగుపరిచేలా ప్రభుత్వానికి సిఫార్సులు చేయనున్నట్లు రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ బి.ఎస్. రాములు వెల్లడించారు. ఈ నెల 10 నుంచి రాష్టవ్య్రాప్తంగా అధ్యయనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. తమతో పాటు కమిషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్, ఈడిగ ఆంజనేయగౌడ్‌లు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి వివరాలను సేకరించినట్లు తెలిపారు. ఈ శ్యాంపిల్ సర్వేలో భాగంగా కమిషన్ రూపొందించిన 14 అంశాలతో కూడిన ప్రొఫార్మతో ఇంటింటి వివరాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. సుధీర్ కమిషన్ బిసి-ఈ గ్రూప్ కోసం ఇపుడున్న నాలుగు శాతం రిజర్వేషన్‌ను కలుపుకుని 12 శాతం వరకు పెంచాలంటూ చేసిన ప్రతిపాదనపై సంబంధిత వర్గాల అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం బిసి కమిషన్ సభ్యులు డా.ఈడిగ ఆంజనేయ గౌడ్, జూలూరి గౌరీశంకర్ గురువారం నగరంలోని ఆసిఫ్‌నగర్, అంబర్‌పేట, నాంపల్లి, గోల్కొండ, చార్మినార్ రెవెన్యూ మండల్లాలోని ప్రాంతాల్లో విస్తత్రంగా పర్యటించారు. ఆంజనేయ గౌడ్‌తో పాటు బిసి సంక్షేమ శాఖ అధికారి తహసిల్దార్‌ను కలిసి నగరంలోని ఆసిఫ్‌నగర్ మండలంలోని కార్వాన్, మెహిదీపట్నం, గోల్కొండ మండలంలోని టోలీచౌకీ, ఫాతిమాకాలనీ, హకీంపేట తదితర ప్రాంతాల్లో సందర్శించి పేద ముస్లిం స్థితిగతులను అడిగి తెల్సుకున్నారు.
ఇప్పటి వరకు 31 రెసిడెన్షియల్ పాఠశాలను పేద ముస్లిం విద్యార్థుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వెనుకబాటు తనానికి ముఖ్య కారణమైన అవిద్యను నిర్మూలించేందుకు ముస్లింలంతా తమ పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలకు పంపాలని సూచించారు. కమిషన్ రూపొందించిన ప్రశ్నావళి పత్ర నమూనాతో ఆయా కుటుంబాల వివరాలను నమోదు చేసుకున్నారు. జూలూరి గౌరీశంకర్ నేతృత్వంలో నాంపల్లి మండలంలోని ఏక్‌మినార్, మజీద్ బస్తీ, తేలిబాడా, చార్మినార్ మండలంలోని ఆమన్‌గల్, ఖిల్వత్‌గూడ, మీరాలం మండి ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనల్లో ఆర్డీవో చంద్రకళ, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మాన్య, మాజీద్, తహసిల్దార్లు చంద్రకళ, జానకి, జుబేదాబేగంతో పాటు ఆయా ప్రాంతాల స్థానిక కార్పొరేటర్లు కూడా పాల్గొన్నారు.