హైదరాబాద్

తప్పుల తడకలుగా నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కల్గిన మహానగర ప్రజలకు పౌరసేవలు, అభివృద్ధి పనులు చేపట్టే జిహెచ్‌ఎంసి ప్రధాన ఆర్థిక వనరు ఆస్తిపన్ను. ఈ ఏటా రూ. 1500 కోట్ల పన్నును లక్ష్యంగా పెట్టుకున్న కనిష్ఠంగా రూ. 1250 కోట్లనైనా వసూలు చేసుకోవాలన్న లక్ష్యంతో ఈ ఆర్థిక సంవత్సరం అధికారులు కాస్త ముందుగానే వసూళ్లను ప్రారంభించారు. గత ఆర్థిక సంవత్సరం వెయ్యి కోట్ల పై చిలుకు వసూలు చేసుకున్న అధికారులు ఈ ఏట కనీసం రూ. 1250 కోట్ల నుంచి రూ. 1500 కోట్ల మధ్య పన్ను వసూలు చేయాలని భావించారు. కానీ నవంబర్ 8వ తేదీన కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత పాత నోట్లతోనే జిహెచ్‌ఎంసి పన్ను బకాయిలను స్వీకరించేందుకు సిద్దం కావటంతో అప్పట్లోనే రూ. 371 కోట్ల వరకు పన్ను వసూలైంది. అంతకు ముందు అన్ని సర్కిళ్లలోని డిప్యూటీ కమిషనర్లు, వ్యాలుయేషన్ ఆఫీసర్లు, ట్యాక్సు ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్ల వరకు ఆయా స్థాయిలో అధికారులకు టార్గెట్లు విధించారు. అంతేగాక, వసూళ్లను పెంచుకునేందకు మరో సారి సెల్ఫ్ అసెస్‌మెంట్‌కు కూడా అనుమతించారు. అయితే స్వీయ నిర్థారణ చేస్తూ పన్ను స్వీకరించేందుకు సిద్దంగా ఉన్న దరఖాస్తుదారుడి ఆస్తిని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసేందుకు వెళ్తున్న క్షేత్ర స్థాయి ట్యాక్స్ సిబ్బంది లేనిపోని నిబంధనలను చూపుతూ వారికి అధిక మొత్తంలో పన్ను వడ్డించి, దాన్ని కుదించేందుకు యజమానుల నుంచి అమ్యామ్యాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే ఇప్పటి వరకు పన్ను చెల్లింపు పరిధిలో లేని గృహాలు, వ్యాపార సంస్థలను కూడా గుర్తించి, వాటిని ఆస్తిపన్ను చెల్లింపు పరిధిలోకి తీసుకురావాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఈ ఆదేశాలను అడ్డం పెట్టుకుని పలు సర్కిళ్లలో ట్యాక్సు ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు యజమానులకు భవనం ఎపుడు నిర్మించారని తెల్సుకుని, అయిదారు ఏళ్లు, మరికొన్ని సందర్భాల్లో పదేళ్ల నుంచి పన్ను వర్తింపజేస్తూ అధిక మొత్తంలో వడ్డిస్తున్నారు. దీంతో బెంబేలెత్తుతున్న బకాయిదారులు పన్ను కుదించాలని కోరగా, బేరం కుదుర్చుకుని నిబంధనల ప్రకారం రెండేళ్లకు పన్ను విధిస్తూ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అంతేగాక, కొత్తగా ప్రారంభిస్తున్న కమర్షియల్ కాంప్లెక్సులు, వ్యాపార సంస్థలకు సంబంధించి ఆస్తిపన్ను వసూళ్లలో ఈ సిబ్బంది పెద్ద ఎత్తన అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బడా వ్యాపార సంస్థల యుసేజ్ ఏరియాను రికార్డుల్లో తక్కువగా చూపించటం, పాష్ ఏరియాలోని వ్యాపార సంస్థలను సేమీ పాష్ ఏరియాల్లో చూపించటం వంటి సర్దుబాట్లు చేస్తూ యజమానులతో బేరం కుదుర్చుకుని జిహెచ్‌ఎంసికి అదనంగా రావల్సిన వందల కోట్ల రూపాయలు ఖజానాకు చేరకుండా అడ్డుపడుతున్నట్లు ఆరోపణలున్నాయి.
జిహెచ్‌ఎంసి పరిధిలో ఇప్పటి వరకు రూ. 932 కోట్ల వరకు ఆస్తిపన్ను వసూలు చేసినట్లు గ్రేటర్ వ్యాలుయేషన్ ఆఫీసర్ గీతారాధిక తెలిపారు. కొన్ని సర్కిళ్లలో ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన ఆస్తిపన్నును ఆయా శాఖలు అక్కడ చెల్లిస్తుంటాయని, అవి ఇంకా ప్రధాన కార్యాలయానికి లెక్కలు రాలేవని, అన్ని రకాల చెల్లింపులను కలుపుకుంటే వసూళ్లు వెయ్యి కోట్ల పై చిలుకు ఉంటాయని ఆమె వివరించారు. లక్ష్యానికి తగిన విధంగా వసూళ్లను మెరుగుపర్చుకునేందుకు మొండి బకాయిదారులకు వారెంట్లు జారీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. బకాయి పడ్డ మొత్తం విలువకు సరిపోయే సామాగ్రి వంటివి అటాచ్ చేసి ఈ వారెంట్లు జారీ చేస్తారని ఆమె వివరించారు.

గులాబీకి
గుచ్చుకుంటున్న ‘ముళ్ళు’

టిఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు రంగారెడ్డిలో రగులుతున్న రాజకీయం
ఉద్యమకారులు.. నేతల మధ్య వివాదం

హైదరాబాద్, మార్చి 20: పూర్వ రంగారెడ్డి జిల్లాలో రోజురోజుకూ తెరాస నేతల మధ్య అంతర్గత విభేదాలు జోరందుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో నేరుగా పోట్లాటలకే సిద్ధమవుతున్నారంటే పార్టీలో అంతర్గతంగా ఏ మేరకు విభేదాలున్నాయో అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకులను కాదని, పార్టీ అధిష్టానం వలస నేతలకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం నాటి నుండి పార్టీలో పనిచేస్తున్న కేడర్‌ను విస్మరించే కార్యక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకునే దిక్కులేదంటూ ఆందోళనకు గురవుతున్నారు. అలాగే పార్టీ అధిష్టానం ఇటీవల కొనసాగిస్తున్న నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో కూడా ఉద్యమకారులకు అవకాశం ఇవ్వడంలేదన్న విమర్శలు జోరందుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం తెరాస పార్టీలోకి వలస వచ్చి అధికారాన్ని అందిపుచ్చుకున్న నాయకుల కనుసన్నల్లో పనిచేయలేక కుమిలిపోతున్న నాటి ఉద్యమకారులు ప్రస్తుతం వారి నోరును మెదిపే పరిస్థితి కనబడటం లేదు. దీనికి ఇటీవల పరిగిలో సీనియర్ నాయకుడు హరీశ్వరెడ్డి తన నియోజకవర్గంలోని ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టలేక ఆయనపై వచ్చే వత్తిళ్లను తట్టుకోలేక భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్న సంఘటనే ఉదాహరణగా చెప్పవచ్చు. చేవెళ్ళ నియోజకవర్గంలో తెరాస పార్టీ నుండి పోటీచేసి ఓటమికి గురైన మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం పరిస్థితి కూడా పార్టీలో తననెవరూ గుర్తించడం లేదంటూ కాంగ్రెస్ పార్టీనుండి తెరాసలో చేరి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే యాదయ్య చేసే కార్యక్రమాలకు గైర్హాజరవుతూ తనదైన శైలిలో అంతర్గత గ్రూపును కొనసాగిస్తూ అసమ్మతిని వెళ్లగక్కుతున్న తీరు చేవెళ్ల పార్టీలో కలకలం రేపుతోంది. ఆమనగల్లులో ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యకర్తల బాహాబాహీ అలాగే ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వైఖరిని నిరసిస్తూ తమ ఓటమికి కారకులైన వారికి నిధులు ఎలా కేటాయిస్తారంటూ జైపాల్ యాదవ్, మంద జగన్నాథం అన్యాయాలు చేస్తున్న అసహనం ఇంతా అంతా కాదు. ఇటీవల రంగారెడ్డి జిల్లా పరిషత్‌లో జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి జడ్పీటిసిల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని కొందరు నాయకులు అంతర్గతంగా చేసిన విమర్శలు దుమారం లేపిన విషయం తెలిసిందే. ఇదే తంతు కొనసాగిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి స్వయంగా ఉద్యమకారులంటే తరిమి కొడతామంటూ ఏకంగా పోలీసులకు ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేయిస్తే పట్టించుకునే దిక్కులేదంటూ ఆ పార్టీలో నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వలస వచ్చిన నాయకులకు ఉద్యమ సమయంలో కార్యకర్తలు తిన్న దెబ్బలు, ఆకలి చావుల గురించి ఎలా తెలుస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటినీ గమనించి పార్టీ మనుగడ దెబ్బతినకుండా సమన్వయంతో కొనసాగించే నాయకత్వం లోపించడంతోనే తక్కువ సమయంలో పార్టీ కుప్పకూలే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరి ఇలాగే కొనసాగితే తెరాస పార్టీకి భారీ నష్టం చవిచూడక తప్పదన్నారు.