హైదరాబాద్

కౌంటర్ పర్మిట్లను అనుమతించకుంటే ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ పర్మిట్లను అనుమతించకపోతే నిరసనలను ఉద్ధృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో అసోసియేసన్ నాయకులు నందారెడ్డి, బాల్‌రెడ్డి, యాదగిరిగౌడ్ మాట్లాడారు. ఏపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కౌంటర్ పర్మిట్లను అనుమతించకుండా ఇక్కడి యజమానులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లపాటు పర్మిట్లను అనుమతించే అవకాశం ఉన్నా ఏపీ ప్రభుత్వం మొండిగా ఇక్కడి పర్మిట్లను నిరాకరిస్తుందని దుయ్యబట్టారు. ఈ విషయమై పలుమార్లు చర్చించగా దేశంలో ఎక్కడాలేని విధంగా ట్రావెల్స్ వాహనాలకు అనుమతిస్తే ట్రాన్స్‌పోర్టు వాహనాలకు తాము అనుమతిస్తామని వింత వాదన చేస్తుందని విమర్శించారు. ఈనెల 28లోపు ఏపి ప్రభుత్వం ఈ విషయమై నిర్ణయం తీసుకోకపోతే 29 నుంచి తెలంగాణలోకి ప్రవేశించే అన్ని రకాల వాహనాలను అడ్డుకొని తీరతామని హెచ్చరించారు. ప్రతీ ఏడు వాహన ఇన్సూరెన్సులను పెంచడాన్ని ఉపసంహరించుకోవాలని ఐఆర్‌డిఏ అధికారులను కోరినట్టు చెప్పారు. హైదరాబాద్ నలువైపులా పార్కింగ్ సౌకరాల్యలను కల్పించాలని కోరారు. వీటితోపాటు ఇసుక రిచ్‌లలో బుకింగ్స్‌లో జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని, ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జ్‌లను ఏర్పాటు చేయాలని టిఎస్ ఎండిసి అధికారులను కోరాగా వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ సమావేశంలో రామ్‌రెడ్డి, జనారెడ్డి, రాములు గౌడ్, మల్లేష్ పాల్గొన్నారు.

వ్యర్థనీటి పునర్వినియోగంపై అవగాహన అవసరం

హైదరాబాద్, మార్చి 21: నీటిని పొదుపు చేయటంతో పాటు వ్యర్థనీటిని శుద్ధి చేసి పునర్వినియోగించే అంశంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ సూచించారు. బుధవారం ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని ది ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహిస్తున్న రెండురోజుల సెమినార్ మంగళవారం ప్రారంభమైంది.
‘ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఫర్ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్’ అనే అంశంపై నిర్వహిస్తున్న ఈ సెమినార్‌కు జలమండలి ఎండి ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలమండలి సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం తిరిగి వ్యర్థనీరుగా డ్రైనేజీలో కలుస్తుందని వివరించారు. గృహా సంబంధ వ్యర్థ నీరు వృథాగా మూసీ నదిలో కలుస్తుందని తెలిపారు. ఇప్పటికే 700 ఎంఎల్‌డి వ్యర్థనీటిని ఎస్టీపిల్లో శుద్ధి చేసి పునర్వినియోగానికి సిద్దం చేసినట్లు ఆయన వివరించారు. ఈ శుద్ధి చేసిన నీటిని ఎలా పునర్వినియోగించుకోవాలి, ఏఏ అవసరాలకు ఈ నీటిని వినియోగించుకోవచ్చునని అంశంపై ప్రజల్లో విస్త్రృతంగా అవగాహన పెంపొందించాలని సూచించారు. శుద్ధ వ్యర్థనీరు వినియోగంలో ప్రజల ఆలోచన విధానంలో మార్పు తీసుకువచ్చేలా ఇంజనీర్లు, ఎన్జీవోలు, విద్యార్థులు కృషి చేయాలని సూఃచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరుగునీటి పునర్వినియోగానికి కసరత్తుప్రారంభించిందని తెలిపారు.