హైదరాబాద్

బ్లాక్‌లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లకు పనులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: జిహెచ్‌ఎంసి చెత్త తరలింపు విభాగంలో చెత్త తరలించే వాహనాల కాంట్రాక్టులు ఆరోపణలున్న, బ్లాక్ లిస్టుల్లో ఉన్న కాంట్రాక్టర్లకే ఇస్తున్నారని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయాస్ యూనియన్ అధ్యక్షుడు ఊదరిగోపాల్ ఆరోపించారు. బుధవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ చెత్త తరలింపు ప్రక్రియను వికేంద్రీకరణ చేసి, ఖర్చు తగ్గించామని అధికారులు చెప్పుకుంటున్నా, జోన్ల వారీగా అకొందరు అధికారులు కమీషన్ల కోసం అద్దె వాహనాల వినియోగాన్ని పెంచుతూ అడ్డదారిలో ఎక్కువ మొత్తంలో జేబులు నింపుకొంటున్నారని ఆరోపించారు. చెత్త తరలింపు ప్రక్రియ ప్రధాన కార్యాలయంలో వికేంద్రీకరణ అయి ఉన్నపుడు తీవ్ర దుర్వాసన, దుర్గంధంలో పనిచేసే డ్రైవర్లు ఆశపడి నాలుగైదు లీటర్ల డీజల్‌ను అమ్ముకుంటే వారిని పెద్ద దొంగలుగా, కార్పొరేషన్ ఖజానాకు కన్నం వేస్తున్నారని వ్యాఖ్యానించిన అధికారులు ఇపుడు బ్లాక్ లిస్టుల్లో ఉన్న కాంట్రాక్టర్లను రింగ్‌గా మార్చి 112 వాహనాలను సమకూర్చేందుకే టెండర్‌ను ఆహ్వానించారని ఆరోపించారు. సంస్కరణలు, అక్రమాలు, కుంభకోణాలు, అవకతవకలు అంటూ ఎప్పటికప్పుడు జిహెచ్‌ఎంసి కార్పొరేషన్ వాహనాల డ్రైవర్ మొదలుకుని సిటీవో వరకు మార్చుతున్న అధికారులు కాంట్రాక్టర్లను ఎందుకు మార్చటం లేదని, కొత్త వారికెందుకు పనులు అప్పగించటం లేదని ప్రశ్నించారు. 25 టన్నుల సామర్థ్యం కలిగిన ప్రైవేటు వాహనం చెత్తను తరలిస్తే ఒక్క రోజుకు రూ. 15వేల 400 వరకు ఖర్చవుతోందని, దీంతో కేవలం టన్నుల చెత్త శివారులోని డంపింగ్ యార్డుకు తరలుతోందని, అదే జిహెచ్‌ఎంసి వాహనం, కార్పొరేషన్ డ్రైవర్ ద్వారా తరలిస్తే తక్కువ ఖర్చుతో రోజుకి పనె్నండు టన్నుల చెత్త తరలుతోందని వివరించారు. 25 టన్నుల సామర్థ్యం కల్గిన 36 వాహనాలు, ఆరుటన్నుల వాహనాలు 56, 18 జేసిబిలు, 2 హిటాచీ వాహనాలతో కలిపి మొత్తం 112 వాహనాలను సమకూర్చుకునేందుకు టెండర్లను ఆహ్వానించిన అధికారుల్లోని కొందరు అక్రమార్కులైన, బ్లాక్‌లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లను రింగ్ చేసి కాంట్రాక్టును కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.