హైదరాబాద్

ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: జిల్లాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులంతా రాజకీయాలకతీతంగా సహకరించాలని మంత్రి మహేందర్ రెడ్డి కోరారు. శనివారం ఖైరతాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. జెడ్‌పి చైర్‌పర్సన్ సునితా మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రి మహేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన నీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరధ పథకంలో భాగంగా 2000 కోట్లతో ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని అందించే పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా రూ. 450 కోట్లతో మిషన్ కాకతీయ కింద 1350 చెరువుల్లో పూడికతీత చేస్తున్నట్టు తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పధకం కింద లబ్దిదారులకు రూ.75వేలు అందించడం జరుగుతుందని, అర్హులైన వారికి అందేలా చూసే భాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదేనన్నారు. ఎమ్మెల్సి కోడ్ కారణంగా నిలిచిపోయిన పనులను వెంటనే ప్రారంభించి పూర్తిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేసి మూడు జిల్లాల అభివృద్ధికి తోడ్పాటు నందించాలని చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కోరారు. రైతులకు ప్రధాన మంత్రి కౌషల్ యోజన కింద చెల్లించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడి సక్రమంగా అందడం లేదని, సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా విడతల వారీగా వాటిని అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా కటాఫ్ తేదీ అనంతరం చెల్లించిన రైతులకు కొంత సమస్య ఏర్పడుతుందని వారు సభ్యులకు వివరించారు. ఇన్‌పుట్ సబ్సిడికి చివరి తేదీ అంటూ ఏమి లేదని ఎప్పుడైనా చేసుకోవచ్చునని కలెక్టర్ రఘునందన్ రావుస్పష్టం చేశారు. అర్హులైన రైతులందరికీ సబ్సిడీ వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రిప్ ఇరిగేషన్‌లో ఏర్పాటు కోసం చెల్లించిన డిడిలను తిరిగి తీసుకోవాలంటూ రైతులను ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి సంబందిత అధికారులను దానికి గల కారణాలను తెలుసుకొని ధరఖాస్తు చేసుకున్న వారందరికీ డ్రిప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మొక్కలను పట్టించుకోవడం లేదు
హరిత హారం పధకంలో భాగంగా వేలాది కోట్లు ఖర్చు చేసి నాటిన మొక్కలను అధికారులు పట్టించుకోవడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 శాతం మొక్కలను కాపాడగలిగామని అధికారులు చెప్పడంతో సభ్యులు అడ్డుతగిలి 20 శాతం మొక్కలు కూడా బ్రతలేదని, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ విధంగా జరుగుతుందని మండిపడ్డారు.
పర్యావరణ పరిరక్ష కోసం చేపట్టిన ఈ పధకంపై ప్రతి వారం అధికారులతో సమీక్ష నిర్వహించాలని మంత్రిని కోరారు. హరిత హారం కార్యక్రమంలో పనిచేసిన ఉపాధి హామీ కూలీలకు ఇప్పటి వరకు డబ్బులు ఎందుకు అందలేదని సభ్యులు అధికారులను నిలదీశారు. ఫిబ్రవరి నెల వరకు సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని అయితే మార్చి నెలలో చెల్లింపులను ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పధకంలో భాగంగా గ్రామీణ ప్రాంతల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పరిగి నియోజక వర్గ పరిధిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు మృత్యువాత పడ్డారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిందికి వేలాడుతున్న కేబుల్స్‌ను సరిచేయాలని కోరారు. మంత్రి స్పందిస్తూ వెంటనే ఆ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చాలా చోట్ల రోడ్ల దుస్థితి అధ్వానంగా ఉందని, వికారాబాద్ రోడ్డులో కల్వర్ట్ కోసం ఆరు నెలల క్రితం తవ్విన గుంతలు అలానే ఉన్నాయని వాటిని ఎందుకు పూర్తి చేయడం లేదని సభ్యులు అధికారులను నిలదీశారు. కోర్టు కేసులు, పైప్‌లైన్ పనులు వల్ల ఆలస్యం అవుతుందని అధికారులు వివరించారు. మంత్రి జోక్యం చేసుకొని రోడ్ల నిర్మాణంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రమాదాలు జరగకుండా రోడ్లను వెంటనే మరమత్తులు చేయాలని ఆదేశించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు సక్రమంగా రావడం లేదని, అరకొర సిబ్బందితో వైద్య సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ఇబ్రహింపట్నంలో పోస్టుమార్టం గది సక్రమంగా లేకపోవడం, బహిరంగ ప్రదేశంలో పోస్టుమార్టం నిర్వహిస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న ఆసుపత్రి గదిలోకి పోస్టుమార్టం విభాగాన్ని మార్చాలని మంత్రి అధికారులను సూచించారు.
ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో జెడ్‌పిటిసిలకు అవకాశం ఇవ్వడం లేదని జెడ్‌పిటిసిలు ప్రశ్నించగా ఎమ్మెల్యేలు సూచించిన వారికి ఆయా కమిటీల్లో అవకాశం కల్పించినట్టు మంత్రి తెలిపారు. ఈ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యేలనే అడగాలని సభ్యులకు సూచించారు. ప్రైవేట్ పాఠశాల దోపిడి విపరీతంగా ఉందని వారిని అదుపు చేయాలని సభ్యులు కోరారు. కనీస సౌకర్యాలు లేకుండా ఫీజు దోపిడి చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 14 పాఠశాలలకు శాశ్వత టీచర్లు లేకపోవడంతో స్థానిక విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే సిబ్బందిని నియమించాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, సంజీవరావు, తీగల కృష్ణారెడ్డి, ప్రకాష్ గౌడ్, వివేకనంద, రామ్మోహన్ రెడ్డి, కలెక్లర్లు రఘునంద్ రావు, దివ్య దేవరాజన్, మేడ్చల్ జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి, జెడ్‌పి సిఇఓ రమణరెడ్డి, రంగారెడ్డి,వికారాబాదు,మేడ్చల్ జిల్లాల పరిధిలోని జెడిపిటిసి సభ్యులు, ఎంపిపిలు, మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.