హైదరాబాద్

నగరమంతా ఎల్‌ఇడి వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: మహానగరంలో ప్రస్తుతమున్న వీధి దీపాలన్నింటినీ ఎల్‌ఇడి లైట్లుగా మార్చేందుకు జిహెచ్‌ఎంసి సన్నాహాలు చేస్తోంది. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ వెలుగులను ఇచ్చే ఈ ఎల్‌ఇడి లైట్ల ఏర్పాటుకు సంబంధించి ఇదివరకే ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చినా, వాటిలో సవరణలు చేస్తూ ప్రభుత్వం మరో సారి కొత్తగా జీవోను జారీ చేసింది. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి పరిధిలో సుమారు నాలుగు లక్షల పై చిలుకు ఉన్న వీధి దీపాల 53 ప్యాకేజీలుగా నిర్వహణ వ్యయంతో పాటు నెలకు రూ. 2 కోట్ల వరకు విద్యుత్ బిల్లును చెల్లిస్తున్న జిహెచ్‌ఎంసి ఈ భారం నుంచి గట్టెక్కేందుకు ఎల్‌ఇడి లైట్ల ఏర్పాటును పరిష్కారంగా గుర్తించింది. ఈ ఎల్‌ఇడి లైట్లు కూడా చీకటి పడగానే ఆన్ కావటం, ఆ తర్వాత అర్ధరాత్రి కాగా, ఆటోమేటిక్‌గా డిమ్మింగ్ అయ్యే విధంగా ఏర్పాటు చేయాలని ఇదివరకిచ్చిన జీవోలో సర్కారు ఆదేశించింది. అయితే అర్ధరాత్రి నగరంలోని ఏ రహదారిలోనైనా ఎక్కువ రాకపోకలు లేకపోవటం, అపుడు ఈ లైట్లు డిమ్మింగ్ కావటంతో జిహెచ్‌ఎంసి పెద్దగా ఆర్థికంగా లాభం లేకపోవటంతో డిమ్మింగ్ విధానం లేకుండానే ఎల్‌ఇడి లైట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి పంపిన ప్రతిపాదనకు అనుకూలంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఇప్పటి వరకు డిమ్మింగ్‌తో ఈ లైట్లను ఏర్పాటు చేయాలా? డిమ్మింగ్ లేకుండా ఏర్పాటు చేసేందుకు సర్కారు అనుమతి కోసం ఎదురుచూసిన జిహెచ్‌ఎంసి ఇక ఈ ఎల్‌ఇడి లైట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియన్స్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థచే ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.
అదే విధంగా ఎల్‌ఇడి లైట్ల ఏర్పాటు సందర్భంగా సర్వేలెన్స్ కెమెరాలో, వెదర్ సిస్టమ్, వైఫైలను ఏర్పాటును కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేయటానికి సర్కారు అనుమతిచ్చినట్లు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. ప్రస్తుతం నగరంలోనున్న 4లక్షల 12వేల ఎనిమిది సాంప్రదాయక విద్యుత్ దీపాల స్థానంలో ఎల్‌ఇడి లైట్లను ఏర్పాటు చేయటానికి గత సంవత్సరం అక్టోబర్ 28న ప్రభుత్వం జారీ చేసిన జీవో 761ను సవరించింది. ప్రస్తుతమున్న సాంప్రదాయక విద్యుత్ బల్బుల ద్వారా 72.12 మెగావాట్ల విద్యుత్ వినియోగమవుతుండగా, తాజాగా సర్కారు ఇచ్చిన ఆదేశాల మేరకు వీటి ఏర్పాటుకున్న అడ్డంకులన్నీ తొలగినట్టే. ఇక సాంప్రదాయక బల్బుల స్థానంలో ఎల్‌ఇడి లైట్లను ఏర్పాటు చేసే ప్రక్రియను జిహెచ్‌ఎంసి ముమ్మరం చేయనుంది.