హైదరాబాద్

తడిసి ముద్దయన నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ / నార్సింగి / మేడ్చల్, ఏప్రిల్ 4: రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మంగళవారం వర్షం కురిసింది. రాష్ట్ర రాజధానితో పాటు ఇతర జిల్లాల్లో కూడా మంగళవారం పగటివేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు ఒక మోస్తరు వర్షం కురిసింది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురవగా, మరికొన్ని చోట్ల వడగళ్ల వర్షం కురిసింది. ఏటా శ్రీరామనవమికి ఒకరోజు అటు, ఇటుగా వర్షాలు కురుస్తుంటాయి. ఒకవైపు నిన్నటి వరకు ఎండలు మండిపోగా, మంగళవారం వేసవి తాపం నుండి ప్రజలకు కొద్దిగా ఉపశమనం లభించింది. చాలా చోట్ల మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు ఒకటి నుండి రెండు డిగ్రీలు పడిపోయింది. రాష్ట్ర రాష్ట్ర రాజధానిలోని చాలా చోట్ల ఒక మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. షాపూర్‌లో 37 మిల్లీమీటర్లు, జీడిమెట్లలో 28 మిల్లీమీటర్లు, గోల్కొండలో 25 మిల్లీమీటర్లు, బాలానగర్‌లో 25 మిల్లీమీటర్లు, షేక్‌పేటలో మిల్లీమీటర్లు, జూబ్లిహిల్స్‌లో 13 మిల్లీమీటర్లు, శేరిలింగంపల్లిలో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అధికారి ఒకరు ప్రకటించారు. భారీ వర్షంతో కొంత మేరకునగర ప్రజలు ఉపశమనం పోందారు. లంగర్‌హౌస్, మెహిదీపట్నం, నానల్‌నగర్, గుడిమల్కాపూర్, జియాగూడ, కార్వాన్, గండిపేట తదితర ప్రాంతాల్లో వర్షం బాగా పడింది. పలు ప్రాంతాలలో భారీ వర్షం పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాలలో రోడ్లుపై వరదనీరు పొంగిపొర్లింది. మేడ్చల్‌లో సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకూ ఠారెత్తించిన ఎండలు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి గాలి దుమారం మొదలైంది. చిన్నపాటి చినుకులు కూడా కురిసాయి. గాలి దుమారం కారణంగా రోడ్లు, వీధులు దుమ్ము ధూళితో నిండిపోయాయి. పెద్ద ఎత్తున దుమ్ము లేవడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంట్రీ క్లబ్ ప్రాంతంలో విద్యుత్ తీగలపై చెట్టుకొమ్మలు తెగిపడడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడిందని లైన్‌మెన్ వివరించారు. సిబ్బంది హుటాహుటిన స్పందించి మరమ్మతులు చేపట్టడంతో మూడు గంటల తర్వాత ఎట్టకేలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

తెలంగాణ చరిత్ర విశ్వవ్యాప్తం
జాగృతి అధ్యక్షురాలు, ఎంపి కల్వకుంట్ల కవిత ఆకాంక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో మంది నాయకులు ప్రాణాలు అర్పించారని, సురవరం ప్రతాపరెడ్డి చాకలి ఐలమ్మ సుద్దాల హనుమంతు తదితరులు పోరాడిన తెలంగాణ చరిత్ర విశ్వవ్యాప్తమవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాంస్కృతిక శాఖ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన తెలంగాణ వైతాళికుల ఛాయాచిత్ర ప్రదర్శనను కవిత ప్రారంభించారు. త్వరలోనే ట్యాంక్‌బండ్‌పై ఈ విగ్రహాలను ఏర్పాటుచేయడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. 1920లోనే తెలంగాణ గురించి గోల్కొండ పత్రికలో వ్రాసారని 1956 నుండి ఈనాటి వరకు పోరాడిన తెలంగాణ వైతాళికులు అందరూ గుర్తించుకునే విధంగా శాస్వత ఏర్పాట్లకు సంసిద్దులవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా ‘ఆకుపచ్చని పొద్దు పొడుపు’ పుస్తకాన్ని కవిత ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కెవి రమణాచారి మాట్లాడుతూ వసంత నవరాత్రులలో ప్రారంభమైన ఈ ప్రదర్శనా స్థలం తెలంగాణ తేజోమూర్తుల కీర్తి మందిరంగా ప్రఖ్యాతి చెందగలదని అన్నారు. తేజో మూర్తుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించడానికి ఈ ప్రదర్శన శుభసూచికమని అన్నారు. ప్రస్తుతం చాయాచిత్రాలను ఏర్పాటుచేసిన సమావేశ మందిరం సందర్శకులకు అందుబాటులో వుంచాలని రమణాచారి అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో బతుకమ్మ పండగకు గుర్తింపు లేదని ప్రస్తుతం అధికారికంగా రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని, తెలంగాణ పాలను సింహాసన మెక్కించిన సుద్దాల హనుమంతును గుర్తు చేశారు. కొమరం భీం, చాకలి ఐలమ్మ, దాశరథిలున్న జైలును పర్యాటక కేంద్రంగా ఏర్పాటుచేస్తే అప్పట్లో వారు జైలుగోడలపైన రాసిన తెంలగాణ పోరాట సాహిత్యం అందరూ చదవ గలుగుతారన్నారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ తెలంగాణ భాష, సంస్కృతిని కెసిఆర్ విప్లవ శ్వాసగా నడిపించారన్నారు. తెలంగాణ పోరాటాన్ని పాఠ్యాంశంలో సిలబస్‌గా పెట్టాలని అన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ స్వాగతం పలుకగా చిత్రకారుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.