హైదరాబాద్

తీరనున్న శివార్ల దాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: వేసవి కాలం వచ్చిందంటే చాలు నగరాన్ని నీటి ఎద్దడి భయపెడుతోంది. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి రావాలన్నా జనం బెంబేలెత్తేవారు. దాదాపు దశాబ్దాలుగా నెలకొన్న ఈ నీటి సమస్యను పరిష్కరించేందుకు కొంతకాలం క్రితం సుమారు రూ. 1900 కోట్ల వ్యయంతో శివార్లలో చేపట్టిన పనులు ఆశాజనంగా సాగుతున్నాయి. దాన కిషోర్ జలమండలి ఎండిగా వచ్చిన తర్వాత ఈ పనులను మరింత వేగవంతం చేయటంతో పాటు ఎప్పటికపుడు బోర్డు కార్యాలయంలో సమీక్షలు నిర్వహించటంతో పనులను నిరంతరం పర్యవేక్షించినందుకు పనులు చాలా ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా కృష్ణా, గోదావరి నుంచి భారీగా తరలించనున్న నీటిని నిల్వ చేసుకునేందుకు భారీ స్టోరేజీ సామర్థ్యంతో నిర్మించనున్న 27 రిజర్వాయర్లలో ప్రస్తుతం 12 రిజర్వాయర్ల నిర్మాణం తుది దశలో ఉండటంతో వీటిని మరో పక్షం రోజుల్లో వీటిని అందుబాటులోకి తేవాలని జలమండలి ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఇక మిగిలిన మరో 15 రిజర్వాయర్లను కనీసం వచ్చే నెల నాటికైనా అందుబాటులోకి తేగలిగితే ఎండలు బాగా మండే మే, జూన్ మాసాల్లో శివార్లకు పుష్కలంగా తాగునీటిని అందించేందుకు వీలు కల్గుతోందని అధికారులు భావిస్తున్నారు. పలు శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధుల్లో కేవలం 90రోజుల వ్యవధిలోనే సుమారు 1100 కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్ ఏర్పాటు చేయటం విశేషం. దీనికి అదనంగా ఈ ఏడాది జూన్‌లోగా మరో 900 కిలోమీటర్ల పైప్‌లైన్, మరో 29 భారీ స్టోరేజీ రిజర్వాయర్లను యుద్దప్రాపతిదికన నిర్మిస్తుండటంతో త్వరలోనే శివార్లకు చెందిన లక్షలాది మంది దాహర్తీ తీరే సమయం దగ్గరపడింది. ప్రస్తుతం కొనుగోలు చేసి నీటిని సేవిస్తున్న పలు శివారు సర్కిళ్లు, అలాగే వారానికోసారి కూడా సరఫరా అందక అష్టకష్టాలు పడుతున్న పలు ప్రాంతాల ప్రజలకు రోజూ తాగునీరిచ్చేందుకు జిహెచ్‌ఎంసి కార్యచరణను సిద్దం చేస్తోంది. కానీ ఇందుకు నైరుతి రుతుపవనాలు సహకరించాల్సి ఉంటుందని అధికారులు భావస్తిన్నారు. కోటి జనాభా ఉన్న మహానగరం దాహార్తీని తీర్చటంతో పాటు ఔటర్ రింగురోడ్డు లోపలున్న 190 గ్రామాలు, నగర పంచాయతీల దాహార్తీని సైతం సమూలంగా తీర్చేందుకు బృహత్తర ప్రణాళికలను సైతం జలమండలి సిద్దం చేస్తోంది. సుమారు రూ. 628 కోట్ల అంచనా వ్యయంతో ఆయా గ్రామాల పరిధిలో 1685 కిలోమీటర్ల మార్గంలో పైప్‌లైన్లను, 398 ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
ఎంతో ముందుచూపుతో...
మహానగరంలో మున్ముందు పెరగనున్న జనాభా, పట్టణీకరణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మున్ముందు కూడా మంచినీటి సమస్య రాకుండా ఎంతో ముందుచూపుతో జలమండలి ముందుకెళ్తోంది. ఇందుకు గాను ఇంతకు ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన విధంగా శామీర్‌పేట కేశవపూర్‌ల భారీ స్టోరేజీ రిజర్వాయర్ నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్దమైంది. జలమండలి ఆధ్వర్యంలో సుమారు రూ. 7770 కోట్ల అంచనా వ్యయంతో 20 టిఎంసిల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో దీన్ని నిర్వహించనున్నారు. ఈ రిజర్వాయర్‌కు అవరమైన అటవీ, ప్రైవేటు భూములను ఆరు నెలల్లోగా సేకరించే అంశంపై జలమండలి, రెవెన్యూ యంత్రాంగాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ రిజర్వాయర్‌కు ప్రధానంగా కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను తరలించి నింపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి సాంకేతిక అంశాలను, ఘన్‌పూర్ రిజర్వాయర్‌కు తరలించే పైప్‌లైన్ల ఏర్పాటు వంటి అంశాలన్నింటినీ వ్యాప్కోస్ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేసి ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించింది.