హైదరాబాద్

దళితులకోసం పోరాడిన మహనీయుడు బిజెఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్‌రామ్ దళితుల అభివృద్ధి, హక్కుల గురించి పోరాడిన మహోన్నత వ్యక్తి అని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి కొనియాడారు. బుధవారం వికారాబాద్‌లో బాబు జగ్జీవన్‌రామ్ 110వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ చిన్న వయసులోనే దళితుల అభివృద్దికి ఎంతో కృషి చేశారని చెప్పారు. దళితుల ఎదుగుదలకు చదువు ముఖ్య కారణమని, అందరూ చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దళితులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పడుతోందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డి.దివ్య మాట్లాడుతూ దళితుల్లో మార్పు ఎలా వస్తుందో గుర్తించి దాన్ని ఆచరణలో పెట్టాలని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. జగ్జీవన్‌రామ్ దళితుల హక్కుల కొరకు పోరాడిన వ్యక్తి అని చెప్పారు. ఆయన చిన్న వయసులోనే కార్మిక, వ్యవసాయ, రక్షణ శాఖ మంత్రిగా పనిచేసి దళితుల అభివృద్ధికి పాటుపడ్డారని పేర్కొన్నారు. దళితులపై జరిగే దాడుల గురించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో దళిత నాయకులు కమిటీకి తెలపాలని సూచించారు. జిల్లాలో సివిల్స్ కోచింగ్ సెంటర్, స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. దళిత, గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల సివిల్‌రైట్స్ డే నిర్వహిస్తున్నామని వివరించారు. అంబేద్కర్ భవన్ మరమ్మతుకు రూ.21 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. చేవెళ్ళ శాసనసభ్యుడు కె.యాదయ్య మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ సేవలను కొనియాడారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యుడు బి.సంజీవరావు మాట్లాడుతూ బాబుజగ్జీవన్‌రామ్ 110వ జయంతి ఉత్సవాలను కొత్తగా ఏర్పడిన వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పరంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకమని అభిప్రాయపడ్డారు. దళితుల్లో ప్రతి వ్యక్తి చదువుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పారు. గ్రామాల్లో కులవివక్ష ఉందని, దళితులపై ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటి సభ్యులు పెండ్యాల అనంతయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి బి.నర్సింలు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సి.అనంతయ్య, టఫ్ జిల్లా అధ్యక్షుడు యేసురత్నం, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ఎంఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ, వాల్టా సభ్యుడు ఎం.సురేష్, దళిత మేధావుల ఫోరం అధ్యక్షుడు దేవదాసు, దళిత సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సి.జగదీశ్, న్యాయవాది బందయ్య, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు శివరాజ్, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు ఎస్.రాజలింగం, టిఆర్‌ఎస్ లీగల్‌సెల్ నాయకుడు రాంచందర్‌రావు, టిఆర్‌ఎస్‌కెవి జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ ఎస్.రాంచంద్రారెడ్డి, టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.శుభప్రద్‌పటేల్, జడ్పిటిసి ముత్తార్‌షరీఫ్, సిఐ జి.రవి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, తహశీల్దార్ చినప్పలనాయుడు, ఎంపిడివో ఎం.సత్తయ్య ప్రసంగించగా డిఎస్‌సిడివో మోహన్‌రెడ్డి వందన సమర్పణ చేశారు.