హైదరాబాద్

ఆధ్యాత్మిక విజ్ఞానంతో మనిషి ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: పూర్వం ఆధ్యాత్మిక విజ్ఞానంతో ఋషులు, మునులు జ్ఞాననేత్రంతో ఉపనిషత్తులు, వేదాలు చదివారని ప్రస్తుతం హేతువాదంతో ఎన్ని ఉపన్యాసాలిచ్చినా ఆధ్యాత్మికంగా మనిషి ఎదగాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బులుసు శివశంకరరావు అన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగిన ఉగాది, ఉద్యోగ భారతి పురస్కార ప్రదానోత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పండుగలు చెప్తాయన్నారు. వృక్షాలకు, జంతువులకు కూడా ప్రాణం ఉంటుంది కానీ మనిషికి మనస్సు ఉంటుందని దానిని సన్మార్గంలో వుంచుకోవాలన్నారు. ఎపి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ మనిషిలోని గుణాలకు ఉగాది పచ్చడికి సంబంధం ఉందని, అన్ని రుచులతో తియ్యగా వున్నట్లే మనిషి సత్యమార్గంలో నడవాలని అన్నారు. తెలుగు రాష్ట్రాలు భౌతికంగా విడిపోయినా భాషా సాంస్కృతిక పరంగా అన్నదమ్ముల్లా ఉన్నామని పేర్కొన్నారు. సమాచార, హక్కు చట్టం కమిషనర్ పి.విజయబాబు, టిటికి భక్తిచానల్ పూర్వ సిఇఓ మధుసూధనరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో పొత్తురి విజయలక్ష్మి, ఎస్.గోపు, వి. ఉదయభాస్కర్, డి.్ధర్మారావు, ఎ. మనోహరరావు, కె.్ధర్మారావులను సత్కరించి పురస్కారాలు ప్రదానం చేశారు. సభా కార్యక్రమానికి అకాడమీ కార్యదర్శి నాగరాజు స్వాగతం పలికారు. తొలుత రామాచారి బృందం లలితగీతాలు ఆలపించారు.

లలిత సంగీతాలను రక్షించుకోవాలి
కాచిగూడ, ఏప్రిల్ 9: లలిత సంగీతాలను ఆదరించాల్సిన అవసరం ఉందని ప్రఖ్యాత నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనరాణి అన్నారు. విన్నకోట మురళీకృష్ణ స్వరకల్పనలో డా.కేతవరపు రాజ్యశ్రీ ఆధ్వర్యంలో ‘లలిత సంగీత లహరి’ కార్యక్రమం వంశీ ఇంటరేషనల్, కేతవరపు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యద్దనపూడి సులోచన రాణి మాట్లాడుతూ లలిత సంగీతానికి ఆదరణ తగ్గుతోందని తెలిపారు. లలిత సంగీతాలను భావితరలకు అందిచాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. సభకు ముందుగా గాయనీ, గాయకులు ఎం.ప్రసన్నలక్ష్మీ, బివిఎన్‌ఎల్ పద్మావతి, సి.రమణ అలపించిన లలిత సంగీత లహరి అందరిని అలరించాయి. ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీరామరాజు స్వాగతోపన్యాసం చేశారు. దర్శకుడు మాధవపెద్డి సురేష్, డా.కళావేంకట దీక్షితులు, డా.తెనే్నటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.