హైదరాబాద్

శివార్లలో ప్రారంభానికి రిజర్వాయర్లు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: మహానగరంలో విలీనమైనా నేటికీ తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్న శివార్ల దాహం తీరనుంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సుమారు రూ. 1900 కోట్ల హడ్కో నిధులతో శివార్లలో జలమండలి నిర్మించిన రిజర్వాయర్లను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గోదావరి, కృష్ణా నుంచి పెద్ద మొత్తంలో నగరానికి నీటిని తరలించే అవకాశాలున్నా, వాటిని నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు, సరఫరా చేసేందుకు పైప్‌లైన్ వంటి వ్యవస్థ అందుబాటులో లేకపోవటం వల్ల శివార్లలో నీటి సమస్య తీవ్రమైంది. ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు చేపట్టిన హడ్కో ప్రాజెక్టు పనుల్లో మే మొదటి వారం నుంచి దశల వారీగా పనులు పూర్తి అవుతున్న కొద్దీ, నీటి నిల్వ, సరఫరా అందుబాటులోకి వచ్చి శివార్ల దాహర్తీ తీరే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగానే ఇప్పటికే సిద్దమైన గోపన్నపల్లి, నల్లగండ్ల, హుడా మియాపూర్, కెపిహెచ్‌బి ఫేజ్ 4, ఆటోనగర్, షాపూర్‌నగర్ రిజర్వాయర్లలో రేపోమాపో ట్రయల్ రన్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులపై జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ గరువారం బోర్డు ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పూర్తయిన రిజర్వాయర్లలో ట్రయల్న్ నిర్వహించాలని జనరల్ మేనేజర్లు, నిర్వాహణ సంస్థలను ఆదేశించారు. రిజర్వాయర్ల వద్ద ప్రస్తుతం తుది దశలో ఉన్న సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రిజర్వాయర్ పరిసరాల్లో చేపట్టిన ఇతర పనులు, రిజర్వాయర్ ఇన్‌లెట్, ఔట్ లెట్ పునులు, పైప్‌లైన్ విస్తరణ పనులు, పైప్‌లైన్ కోసం తవ్వకాలు జరిపిన రోడ్ల మరమ్మతులు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు. రోడ్లు తవ్వుతూ పైప్‌లైన్ విస్తరణ, కొత్తగా పైప్‌లైన్లు వేసే పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ పనులు జరుగుతున్నట్లు సూచిక బోర్డులు, బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. పైప్‌లైన్ల కోసం తవ్వని రోడ్లలో ఏ మాత్రం ఆలస్యం జరగకుండా పనులను ముగించి, వెంటనే ఆ రోడ్డుకు పునరుద్దరణ పనులు చేయాలని సూచించారు. ఈ రెండు పనులు కూడా ఏకకాలంలోనే జరిగిపోవాలని ఆయన సూచించారు.