హైదరాబాద్

ధాన్యాన్ని గోదాంలకు తరలించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: రవాణాకు వాహనాలను సమకూర్చుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంట వెంటనే గోదాంలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సంబధిత అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. శనివారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల వ్యవసాయ, పౌర సరఫరాల మార్కెట్, రెవెన్యూ శాఖ అధికారులతో రాష్ట్రంలో రబీ ధాన్యం కొనుగోలుపై మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, హరీష్‌రావు, ఈటెల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడాదిలో రికార్డు స్థాయిలో వరి పంట సాగిందన్నారు. సాధారణ విస్తీర్ణం 5.3హెక్టార్లకు గాను 8.68 లక్షల హెక్టార్లలో వరి సాగిందని తెలిపారు. నీటి యాజమాన్య పద్ధతులు నిత్యం మానిటరింగ్‌తో ఎకరాకు వరి దిగుబడి భారీగా పెరిగిందన్నారు. రవాణాకు వాహనాలను సమకూర్చుకుని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంట వెంట గోదాంలకు తరలించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కంది రైతులకు సంబంధించిన చెల్లింపులను రెండు రోజులలో విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. వరి పంటకు మద్ధతు ధర, సాంకేతిక పరిజ్ఞానంకు సంబంధించి పౌరసరఫరాల సంస్థచే రూపొందించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

ఓట్ల కోసం రిజర్వేషన్ల పెంపు
* బిసి యునైటెడ్ ఫ్రంట్ విమర్శ
ఖైరతాబాద్, ఏప్రిల్ 15: ఓట్ల కోసం ముస్లింలకు రిజర్వేషన్లను పెంచడం సరికాదని బిసి యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు పాలూరి రామకృష్ణయ్య అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ చేయకుండా ముస్లిలంకు రిజర్వేషన్లు చేస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో ముస్లిం ఓట్లను రాబట్టుకునేందుకు ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపు ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమేనని అన్నారు. గతంలో రిజర్వేషన్లు పెంచినప్పుడు ఎదురైన సమస్యలు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తెలియవా? అని ప్రశ్నించారు.