హైదరాబాద్

ద్వానాశాస్ర్తీకి ‘సాహితి హస్య కల్పవృక్షం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఏప్రిల్ 24: ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ద్వానాశాస్ర్తీకి ‘సాహితి హస్య కల్పవృక్షం’ బిరుదు ప్రదానోత్సవ కార్యక్రమం ఫ్రెండ్స్ కామెడీ క్లబ్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ హాస్య నటులు ఎంవి.సుబ్రహ్మణ్యం, మిమిక్రీ బుర్రమోహనకృష్ణ, పద్మావతి, జబర్దస్త్ అప్పారావు, ప్రకాష్ ప్రదర్శించిన డాక్టర్ దగ్గండి, పెద్దాయన్ని పిలవండి, చికెన్ 65, మామ.. అల్లుడు, బావ.. బావమరిది, అనే స్కిట్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. అనంతరం ద్వానాశ్రాస్తి మాట్లాడుతూ హాస్య కల్పవృక్షం బిరుదు ప్రదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నవ్వడం వల్ల దీర్ఘకాలిక రోగలను నయం చేయవచ్చన్నారు. నవ్వడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడని పేర్కొన్నారు.

‘శివశక్తి’ కూచిపూడి
నాట్యకళా వైభవం
హైదరాబాద్, ఏప్రిల్ 24: ఇరవై సంవత్సరాలుగా వివిధ ప్రాంతాలలో నృత్య ప్రదర్శనలు ఇస్తూ మొదటిసారిగా రవీంద్రభారతిలో 150 మంది నృత్య కళాకారులతో కూచిపూడి నృత్య యజ్ఞాన్ని నిర్వహిస్తున్నానని శివశక్తి కూచిపూడి ఆర్ట్ అకాడమి వ్యవస్థాపకులు గురుదాసు శ్రీనివాస్ అన్నారు. సోమవారం రవీంద్రభారతిలో ఈ సంస్థ ఆధ్వర్యంలో ‘నాట్య కళావైభవం-2017’ను అతివైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుండి పలువురు నృత్య కళాకారులు, నృత్య కళా సంస్థలు పాల్గొని వివిధ రకాల నృత్యాంశాలను ప్రదర్శించారు. ముఖ్యంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం, అన్నమాచార్య కీర్తనలు, రామదాసు కీర్తనలు, అష్టలక్ష్మీ వైభశం తదితర అంశాలను చక్కని హస్త పాద విన్యాసాలతో, సాహిత్యానికి తగిన అభినయంతో నృత్యం ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ప్రముఖ నాట్యాచార్యులు డాక్టర్ వేదంతం రాధేశ్యామ్ పాల్గొన్నారు. నృత్య గురువులు చింతి ఆదినారాయణశర్మ, కళాకృష్ణ, పసుమర్తి శేషుబాబు, కె.గౌతమి, జింక సంజీవ్‌కుమార్‌లు పాల్గొని కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వరంగల్, విశాఖపట్నం, హన్మకొండ, అనకాపల్లి ప్రాంతాలకు చెందిన నృత్య గురువులు తమ శిష్యులతో కార్యక్రమంలో పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు.

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్
అభ్యర్థులకు అవకాశాలు కల్పించాలి
చిక్కడపల్లి, ఏప్రిల్ 24: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అభ్యర్థులకు ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌తో సమానంగా అవకాశాలు కల్పించాలని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం దోమలగూడ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంగణంలో జరిగిన మొదటి కౌన్సిల్ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. మూడు తీర్మానాలను ప్రవేశపెట్టారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అభ్యర్థులకు ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ అభ్యర్థులతో సమానంగా అవకాశాలు కల్పించాలని, బడ్జెట్‌ను రూ. 57.45 లక్షల నుండి రూ.3.36 కోట్లకు పెంచాలని, నూతనంగా ఏర్పడిన 31 జిల్లాలతో పాటు సింగరేణి, సికింద్రాబాద్ జిల్లాలలో అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైసింగ్ కమిషనర్‌లను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించాలని తీర్మానించారు. గవర్నర్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహన్‌ను రాజభవన్‌లో కలిసి చర్చించామని తెలిపారు. గవర్నర్ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తీర్మానాలను సూచిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 201516 ఆస్తి అప్పుల పట్టికను, వార్షిక ప్రణాళికను, బైలాస్‌ను ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ఎ.చంద్రశేఖర్, సిబ్బంది జి.లక్ష్మి నారాయణ, ఎస్.మల్లారెడ్డి పాల్గొన్నారు.