హైదరాబాద్

ఇక పారదర్శక తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: మహానగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర ఆహార విక్రయ కేంద్రాలపై చేస్తున్న తనిఖీలను పారదర్శకంగా నిర్వహించాలని కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రధాన కార్యాలయంలో వెటర్నరీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుపుతున్న తనిఖీల వల్ల నగరవాసుల నుంచి మంచి స్పందన వస్తుందని, అయితే మున్ముందు ఈ తనిఖీలు, దాడులు వివాదాస్పదమయ్యే అవకాశాలున్నందున అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహారించాలని సూచించారు. ముఖ్యంగా ఏదైనా హోటల్, రెస్టారెంట్లపై జరిమానా విధించేటపుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తనిఖీలను మెడికల్ ఆఫీసర్లు, వెటర్నరీ, పోలీసు, జలమండలి తదితర విభాగాల అధికారులతో కలిసి చేపట్టాలని సూచించారు. తనిఖీలు నిర్వహించే హోటళ్లు, రెస్టారెంట్లను లాటరీ ద్వారా ఎంపిక చేయాలని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం అవుతున్నందున హలీం బట్టీలను ఏర్పాటు చేయటంలో తగు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే నగరంలో ఆహారాన్ని విక్రయించే ప్రతి వ్యాపార సంస్థ కూడా 2006 ఫుడ్‌సేఫ్టీ, స్టాండెడ్ యాక్టు-2011 యాక్టులను పాటించాలని కమిషనర్ సూచించారు. ఇందుకు సంబంధించి ప్రతి హోటల్ నిర్వాహకులు, యజమాన్యాలు డిక్లరేషన్‌లు ఇవ్వాలని ఆదేశించారు. ఈ డిక్లరేషన్‌ను అనుసరించి తమ హోటళ్లు, రెస్టారెంట్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం, సిబ్బంది కూడా పలు పరిశుభ్రత ప్రమాణాలను పాటించేలా చర్యలకు అవకాశముంటుందని ఆయన వివరించారు. ముఖ్యంగా సిబ్బంది గ్లౌజులు, మాస్కులు, హెడ్‌క్యాప్‌లను ధరించటం జరుగుతోందని, అంతేగాక, సిబ్బందికి వైద్య పరీయలు సైతం క్రమం తప్పకుండా నిర్వసిస్తామని డిక్లరేషన్‌లో పేర్కొనాల్సి ఉంటుందని కమిషనర్ సూచించారు. వంటశాల గోడలు, పై కప్పులను శుభ్రంగా ఉంచడంతో పాటు తగు వెంటిలేషన్ ఏర్పాటు చేస్తామని లిఖిపూర్వకంగా పేర్కొనాలని సూచించారు. అంతేగాక, మాంసాహారాన్ని విక్రయించే హోటళ్లు, ఇతర సంస్థలు జిహెచ్‌ఎంసికి చెందిన స్లాటర్ హౌజ్‌లలోని మంసాన్ని మాత్రమే సేకరించాలన్నారు. వ్యర్థాలను నాలాలు, డ్రైనేజీల్లో వేయకుండా, పార్శిల్స్ కోసం 50 మైక్రాన్లు మంచిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులనే వినియోగించే అంశాన్ని కూడా ప్రస్తావించాలని సూచించారు.
ప్రతి సంస్థ విధిగా ట్రేడ్ లైసెన్సును తీసుకోవటంతో పాటు పైన పేర్కొన్న నిబంధనలన్నింటినీ పాటిస్తున్నట్లు డిక్లరేషన్ అందజేయాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో పలువురు అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, వెటర్నరీ విభాగం అధికారులు పాల్గొన్నారు.